RK5 Incline

RK5 Incline SCCL RK5 UNDER GROUND MINE

*నాలుగు సింగరేణి గనులకు జాతీయస్థాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు*కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగ...
05/09/2025

*నాలుగు సింగరేణి గనులకు జాతీయస్థాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు*

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన సింగరేణి C&MD బలరామ్ (ఐఆర్ఎస్)

భూగర్భగనులలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, RK6 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు

ఓపెన్ క్యాస్ట్ లలో రామగుండం ఓసి - 1 లోని ఫేజ్ 2, జె.కె ఓసి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు.

*ఆర్కే న్యూటెక్, RK 6 గనుల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరామ్, ఐఆర్ఎస్ గారితో కలిసి అవార్డు స్వీకరించిన శ్రీరాంపూర్ ఏరియా జిఎం M. శ్రీనివాస్, RK5 గ్రూప్ ఏజెంట్ N. శ్రీధర్.*

* ముంబైలో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్టార్ రేటింగ్ అవార్డుల ప్రధానోత్సవం*

ఇవాళ వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్త కథనాలు

*నాలుగు సింగరేణి గనులకు జాతీయస్థాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు*కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదు...
04/09/2025

*నాలుగు సింగరేణి గనులకు జాతీయస్థాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు*

కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన సింగరేణి C&MD బలరామ్ (ఐఆర్ఎస్)

భూగర్భగనులలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, RK6 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు

ఓపెన్ క్యాస్ట్ లలో రామగుండం ఓసి - 1 లోని ఫేజ్ 2, జె.కె ఓసి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు.

*ఆర్కే న్యూటెక్, RK 6 గనుల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరామ్, ఐఆర్ఎస్ గారితో కలిసి అవార్డు స్వీకరించిన శ్రీరాంపూర్ ఏరియా జిఎం M. శ్రీనివాస్, RK5 గ్రూప్ ఏజెంట్ N. శ్రీధర్.*

ఇవాళ ముంబైలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన స్టార్ రేటింగ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం

@@@@@ # # # #@@@@@ # # # # #@@@@@@

సింగరేణిలోని నాలుగు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన
సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్
చక్కని పనితీరుతో మరిన్ని అవార్డులు సాధించాలని పిలుపునిచ్చిన సీఎండీ శ్రీ ఎన్.బలరామ్
సింగరేణి భవన్, సెప్టెంబర్ 04 , 2025.
పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 4 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. గురువారం ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు.
ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో రామగుండం-3 ఏరియాకి చెందిన ఆర్ జి ఓ సి-1 ఎక్స్ టెన్షన్, ఇల్లందు ఏరియాకి చెందిన జే కే-5 ఓసి, భూగర్భగనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన ఆర్కే-6 గని , ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ ను ఇస్తూ అత్యుత్తమ స్టార్ రేటు సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను అందిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియను స్టార్ రేటింగ్ అంటారు.
ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోనికి తీసుకుని మార్కులను కేటాయించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి ఉన్న గనులలో పై 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుండి వచ్చిన పరీశీలక బృందం వారు ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం జరుపుతారు.
ప్రాథమిక మూల్యాంకనం తర్వాత వీటి నుండి అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఈసారి నాలుగు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయం. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులు సాధించుకోవడం జరిగింది. దీనిపై ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ తన హర్షం ప్రకటిస్తూ గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు గనులకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇవే కాకుండా 14 గనులు 100 కు 80 నుండి 90 మార్కులు సాధించి 4 స్టార్ రేటింగు ను అందుకోవటం విశేషం. 20 గనులకు 3 స్టార్ రేటింగ్ లభించడం విశేషం. గతంలో కొన్ని గనులకు 2 స్టార్ రేటింగ్లు కూడా లభించగా.. ఈ సారి అన్ని గనులు కూడా తమ పనితీరును మెరుగుపరచుకుని 3 స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.

PRODUCTION MOTIVATION MEETING BY GM SRP@RK5_02-08-2025*భూగర్భ గనుల్లో సింగరేణిలోనే RK 5 కు ప్రత్యేక గుర్తింపు..**అన్ని గ...
02/08/2025

PRODUCTION MOTIVATION MEETING BY GM SRP@RK5_02-08-2025

*భూగర్భ గనుల్లో సింగరేణిలోనే RK 5 కు ప్రత్యేక గుర్తింపు..*

*అన్ని గనులకు ఆదర్శం RK5*

*గతంలో 6లక్షలకు టన్నులకు పైగా ఉత్పత్తి సాధించిన చరిత్ర ఆర్కే 5 గనిది*

*జులై నెలలో నూరు శాతం ఉత్పత్తి సాధించటం అభినందనీయం*

*రక్షణతో కూడిన ఉత్పత్తితో ఈ ఏడాది నూటికి నూరు శాతం లక్ష్యం సాధించాలి: జీఎం శ్రీనివాస్*

న్యూస్:
జులై నెలలో 100 % టార్గెట్ సాధించిన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించేందుకు వచ్చాను . శ్రీరాంపూర్ ఏరియాలోనే కాదు సింగరేణి వ్యాప్తంగా RK5 గనికి ప్రత్యేక గుర్తింపు ఉంది . ఉత్పత్తి, రక్షణలోనే కాదు స్వచపక్వాడ్ , పర్యావరణ పరిరక్షణ ఇతర సామాజిక కార్యక్రమాల్లో RK 5 ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఎత్తు పని ప్రదేశాలలో సైతం నిబద్ధతతో కృషి చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా జులై నెలలో RK 5 గని 100% ఉత్పతి సాధించడం అభినందనీయం అన్నారు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ M. శ్రీనివాస్. అదే స్ఫూర్తితో రక్షణతో ఈ సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. నిరంతరం సమీక్షిస్తూ గ్రూప్ ఏజెంట్ , మేనేజర్ లకు తగు సూచనలు చేస్తుండగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ టార్గెట్ సాధించటంలో ముఖ్య పాత్ర పోషించిన ఏజెంట్ , మేనేజర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 6లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి భూగర్భగనుల్లో రికార్డ్ సృష్టించిన చరిత్ర RK 5 గనిదే అంటూ గుర్తుచేశారు. అన్ని రకాల వసతులు, పనిప్రదేశాల్లో మెటీరియల్స్ ఏర్పాటు చేస్తాం జులై మాసం తరహాలోనే రానున్న రోజుల్లో రక్షణతో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా 100 శాతం ఉత్పత్తి సాధించాలి అని కోరారు. RK 6 గని ప్రొడక్షన్ నిలిపివేయడంతో ఆ గని ఉద్యోగులను సైతం RK5 కు కేటాయించినందున రోజుకు మరో 200 టన్నులు అధికంగా బొగ్గు ఉత్పత్తి RK 5 లో జరగాలి అప్పుడే ఏరియా లక్ష్యం సాధించగలం అన్నారు. జులై నెలలో అధిక ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన రిలే A ఉద్యోగులను ప్రోత్సాహక బహుమతులతో అభినందించారు. సింగరేణి సంస్థ బాగుంటేనే ఉద్యోగులకు మంచిదని ఆవిధంగా యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు, యూనియన్లు కలిసికట్టుగా కృషిచేయాలన్నారు గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రెటరీ బాజీ సైదా . ఈ కార్యక్రమంలో జీఎం M. శ్రీనివాస్ తో పాటు , గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గ్రూప్ ఇంజనీర్ శ్రీనివాస భట్టాచార్య, రక్షణ అధికారి శివయ్య, సంక్షేమ అధికారి హరికృష్ణ, పిట్ ఇంజనీర్ శ్యామ్, అసిస్టెంట్ మేనేజర్ లు రాందాస్ , వినయ్ రెడ్డి, పిట్ సెక్రెటరీ నర్సింగా రావ్, అండర్ మేనేజర్ లు, సూపర్వైజర్లు, మైనింగ్ స్టాప్, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

*RK5 PRODUCTION GIFTS_01- 02 - 2025*న్యూస్:ప్రోత్సాహక బహుమతులతో RK 5 ఉద్యోగుల్లో పోటీ వాతావరణం నెలకొంది తద్వారా ఉత్పత్తి...
02/02/2025

*RK5 PRODUCTION GIFTS_01- 02 - 2025*

న్యూస్:

ప్రోత్సాహక బహుమతులతో RK 5 ఉద్యోగుల్లో పోటీ వాతావరణం నెలకొంది తద్వారా ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి అన్నారు RK 5 &6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్.RK5 ఉద్యోగులు అంతా కలిసికట్టుగా పోటీ వాతావరణంలో పనిచేసి గత ఆరు నెలలుగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. జనవరి మాసంలో 97 శాతం ఉత్పత్తి తో పాటు ఓఎంఎస్ 1.05 సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల టార్గెట్ తో పాటు ఈ ఆర్థిక సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించేలా మరింత నిబద్ధతతో కృషి చేయాలని RK 5 ఉద్యోగులను కోరారు. సంస్థ చైర్మన్, డైరెక్టర్ల నిరంతర సమీక్షలు , సూచనలు... జీఎం గారి ప్రత్యేక పర్యవేక్షణ పూర్తి సహకారంతో గని పరిధిలో ప్రణాళికలు రచించుకొని కంపెనీ స్థాయిలోనే మెరుగైన ఫలితాలు సాధించి RK5 గని మరోసారి టాప్ లో నిలపాలని ఆకాంక్షించారు. మెరుగైన ఓఎంఎస్ తో పాటు 97 శాతం ఉత్పత్తి సాధించిన జనవరి నెల ఉత్పత్తిలో టాప్ లో నిలిచిన C రిలే SDL ఆపరేటర్ , కోల్ కట్టర్ ల గ్యాంగ్, సపోర్ట్మెన్లు, ట్రామర్ లు, H.O.P ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝ. రానున్న రోజుల్లో కూడా ఇంతే స్ఫూర్తితో నిబద్ధతతో సంస్థ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలి ఇతర రిలే ఉద్యోగుల సైతం ప్రోత్సాహక బహుమతులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కొంత మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరు అవ్వడం బాధాకరమని వారు కూడా విధిగా డ్యూటీ చేస్తూ ఉత్పత్తి లక్ష్యసాధనలో భాగస్వాములై మంచి జీతం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ ,మేనేజర్ సుధీర్ కుమార్ ఝ,గ్రూప్ ఇంజనీర్ శ్రీనివాస భట్టాచార్య, రక్షణాధికారి రాందాస్ ,సంక్షేమ అధికారి రణదీప్ గౌడ్, ఫిట్ ఇంజనీర్ శ్రీకాంత్ యాదవ్, ఇంజనీర్ సారయ్య, ఫిట్ సెక్రటరీ నర్సింగరావు, అండర్ మేనేజర్లు , సూపర్వైజర్లు , మైనింగ్ స్టాప్ , యూనియన్ ల ప్రతినిధులు ,పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

గురువారం 02-01-2025 రోజున RK 5 గనిలో ఏజెంట్ శ్రీధర్ , మేనేజర్ సుధీర్ కుమార్ ఝ ల ఆధ్వర్యంలో నిర్వహించిన డిసెంబర్ మాసంలో అ...
03/01/2025

గురువారం 02-01-2025 రోజున RK 5 గనిలో ఏజెంట్ శ్రీధర్ , మేనేజర్ సుధీర్ కుమార్ ఝ ల ఆధ్వర్యంలో నిర్వహించిన డిసెంబర్ మాసంలో అధిక ఉత్పత్తి సాధించిన ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతుల అందజేత కార్యక్రమం గురించి ఇవ్వాల వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్త కథనాలు...

*RK5 PRODUCTION MOTIVATIONAL GIFTS _ 02-01-2025**ప్రోత్సాహక బహుమతులతో సత్ఫలితాలు.**డిసెంబర్ నెలలోనూ మెరుగైన ఓ.ఎం.ఎస్ తో ...
02/01/2025

*RK5 PRODUCTION MOTIVATIONAL GIFTS _ 02-01-2025*

*ప్రోత్సాహక బహుమతులతో సత్ఫలితాలు.*

*డిసెంబర్ నెలలోనూ మెరుగైన ఓ.ఎం.ఎస్ తో పెరిగిన ఉత్పత్తి శాతం*

*డిసెంబర్ మాసంలో అధిక ఉత్పత్తి సాధించిన B రిలే ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతుల అందజేత*

*చైర్మన్ గారి నిరంతర సమీక్ష సమావేశాలు, డైరెక్టర్ల సూచనలు , జీఎం గారి పర్యవేక్షణ పూర్తి సహకారం ముందస్తు ప్రణాళికలతో మెరుగైన ఉత్పత్తి సాధించాము:ఏజెంట్, మేనేజర్*

*ఇక ముందు కూడా ఇంతే నిబద్ధతతో పోటీ వాతావరణంలో రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యం సాధించాలి: ఏజెంట్ శ్రీధర్*

న్యూస్:
RK5 ఉద్యోగులు అంతా కలిసికట్టుగా పోటీ వాతావరణంలో పనిచేసి గత ఆరు నెలల్లోనే మెరుగైన ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు RK5&6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్. ఉద్యోగుల్లో ఉత్పత్తి లక్ష్యం పట్ల పోటీ తత్వం పెంపొందించేలా చేపట్టిన ప్రోత్సాహ బహుమతుల విధానం త్వరితగతిన సత్ఫలితాలను అందించిందంటూ హర్షంవ్యక్తం చేశారు. డిసెంబర్ మాసంలో 96 శాతం ఉత్పత్తి తో పాటు ఓఎంఎస్ 1.04 సాధించామన్నారు. ఉత్పత్తిలో స్వల్పంగా వెనుకబడ్డప్పటికీ మెరుగైన ఓ.ఎం.ఎస్ సాధించిన స్ఫూర్తితో ఈ నెల టార్గెట్ తో పాటు ఈ ఆర్థిక సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించేలా మరింత నిబద్ధతతో కృషి చేయాలని RK 5 ఉద్యోగులను కోరారు. సంస్థ చైర్మన్, డైరెక్టర్ల నిరంతర సమీక్షలు , సూచనలు... జీఎం గారి ప్రత్యేక పర్యవేక్షణ పూర్తి సహకారంతో గని పరిధిలో ప్రణాళికలు రచించుకొని కంపెనీ స్థాయిలోనే మెరుగైన ఫలితాలు సాధించి RK5 గని మరోసారి టాప్ లో నిలపాలని ఆకాంక్షించారు. మెరుగైన ఓఎంఎస్ తో పాటు 96 శాతం ఉత్పత్తి సాధించిన డిసెంబర్ నెలలో B రిలే ఉద్యోగులు అధిక ఉత్పత్తి సాదించారన్నారు. ఈ సందర్భంగా B రిలే SDL ఆపరేటర్ , కోల్ కట్టర్ ల గ్యాంగ్, సపోర్ట్మెన్లు, ట్రామర్ లు, H.O.P ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝ. రానున్న రోజుల్లో కూడా ఇంతే స్ఫూర్తితో నిబద్ధతతో సంస్థ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలి ఇతర రిలే ఉద్యోగుల సైతం ప్రోత్సాహక బహుమతులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కొంత మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరు అవ్వడం బాధాకరమని వారు కూడా విధిగా డ్యూటీ చేస్తూ ఉత్పత్తి లక్ష్యసాధనలో భాగస్వాములై మంచి జీతం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ ,మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, రక్షణాధికారి రాందాస్ ,సంక్షేమ అధికారి రణదీప్ గౌడ్, అసిస్టెంట్ మేనేజర్ శివయ్య, అండర్ మేనేజర్లు , సూపర్వైజర్లు , మైనింగ్ స్టాప్ , యూనియన్ ల ప్రతినిధులు ,పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

03/12/2024
నవంబర్ నెలలో మెరుగైన O.M.S తో ఉత్పత్తి శాతం పెరిగిన సందర్భంగా ఉద్యోగులను అభినందించి ...ప్రోత్సాహక బహుమతులు అందజేయడం ద్వా...
03/12/2024

నవంబర్ నెలలో మెరుగైన O.M.S తో ఉత్పత్తి శాతం పెరిగిన సందర్భంగా ఉద్యోగులను అభినందించి ...ప్రోత్సాహక బహుమతులు అందజేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించేలా గ్రూప్ ఇంజనీర్ శ్రీధర్ , మేనేజర్ సుధీర్ కుమార్ ఝ ల ఆధ్వర్యంలో సోమవారం( 02-12-2024) RK 5 గనిలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి ఇవాళ వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్త కథనాలు

RK5 PRODUCTION MEETING & MOTIVATIONAL GIFTS FOR EMPLOYEES_02-12-2024*గత నెల ఇచ్చిన ప్రోత్సాహక బహుమతులు సత్ఫలితాలను ఇచ్చా...
02/12/2024

RK5 PRODUCTION MEETING & MOTIVATIONAL GIFTS FOR EMPLOYEES_02-12-2024

*గత నెల ఇచ్చిన ప్రోత్సాహక బహుమతులు సత్ఫలితాలను ఇచ్చాయి..*

*నవంబర్ నెలలో మెరుగైన ఓ.ఎం.ఎస్ తో పెరిగిన ఉత్పత్తి శాతం*

*నవంబర్ లో అధిక ఉత్పత్తి సాధించిన A రిలే ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతుల అందజేత*

*చైర్మన్ గారు డైరెక్టర్ల సూచనలు జీఎం గారి పర్యవేక్షణలో ముందస్తు ప్రణాళికలతో గత ఆరు నెలలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాము:గ్రూప్ ఏజెంట్*

*ఇక ముందు కూడా ఇంతే నిబద్ధతతో పోటీ వాతావరణంలో రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యం సాధించాలి: గ్రూప్ ఏజెంట్*

న్యూస్:
RK5 ఉద్యోగులు అంతా కలిసికట్టుగా పోటీ వాతావరణంలో పనిచేసి గత ఆరు నెలల్లోనే మెరుగైన ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు RK5&6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్. ఉద్యోగుల్లో ఉత్పత్తి లక్ష్యం పట్ల పోటీ తత్వం పెంపొందించేలా గత నెల అందజేసిన ప్రోత్సాహ బహుమతుల విధానం త్వరితగతిన సత్ఫలితాలను అందించిందంటూ హర్షంవ్యక్తం చేశారు. నవంబర్ మాసంలో గత ఆరు నెలల కంటే మెరుగైన ఓఎంఎస్ 1.04 సాధించామన్నారు. ఉత్పత్తిలో స్వల్పంగా వెనుకబడ్డప్పటికీ మెరుగైన ఓ.ఎం.ఎస్ సాధించిన స్ఫూర్తితో ఈ నెల టార్గెట్ తో పాటు ఈ ఆర్థిక సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించేలా మరింత నిబద్ధతతో కృషి చేయాలని కోరారు. సంస్థ చైర్మన్, డైరెక్టర్ల సూచనలు, జీఎం గారి పర్యవేక్షణలో గని పరిధిలో మెరుగైన ప్రణాళికలతో కంపెనీ స్థాయిలోనే RK5 గని మరోసారి టాప్ లో నిలవాలని ఆకాంక్షించారు గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝ. నవంబర్ మాసంలో మెరుగైన ఓ.ఎం.ఎస్ తో పాటు 94 శాతం ఉత్పత్తి సాధించామని ఇందులో A రిలే ఉద్యోగులు అధిక ఉత్పత్తి సాధించారు అన్నారు. గత నెల మాదిరిగానే ఈసారి కూడా నవంబర్ లో అధిక ఉత్పత్తి సాధించిన A రిలే SDL ఆపరేటర్ , కోల్ కట్టర్ ల గ్యాంగ్, సపోర్ట్ మెన్ లు, ట్రామర్ లు, H.O.P ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝ. రానున్న రోజుల్లో కూడా ఇంతే నిబద్ధతతో సంస్థ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలి ఇతర రిలే ఉద్యోగులు సైతం ప్రోత్సాహక బహుమతులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కొంత మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరు అవ్వడం బాధాకరమని వారు కూడా విధిగా డ్యూటీ చేస్తూ మంచి జీతం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ ,మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, రక్షణాధికారి రాందాస్ ,సంక్షేమ అధికారి రణదీప్ గౌడ్, అసిస్టెంట్ మేనేజర్ శివయ్య, ఇంజనీర్ సారయ్య, ఫిట్ సెక్రటరీ నర్సింగ్ రావ్, అండర్ మేనేజర్లు , సూపర్వైజర్లు , మైనింగ్ స్టాప్ , యూనియన్ ల ప్రతినిధులు ,పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

LONG ABSENTEESIM COUNSELLING@RK5_11-11-2024దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరు అవుతున్న RK 5 ఉద్యోగులకు సోమవారం సాయంత్రం కౌన్స...
11/11/2024

LONG ABSENTEESIM COUNSELLING@RK5_11-11-2024

దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరు అవుతున్న RK 5 ఉద్యోగులకు సోమవారం సాయంత్రం కౌన్సిలింగ్ నిర్వహించారు . RK 5&6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో , మేనేజర్ సుదీర్ కుమార్ ఝ సమక్షంలో దాదాపుగా 30 మంది కార్మికులను వారు ఎందుకు విధులకు గైర్హాజరు అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారి వారి సమస్యలు అడిగి తెలుసుకొని ఇకనుంచి విధిగా డ్యూటీ చేసుకోవాలని సూచించారు. సక్రమంగా విధులు నిర్వహించటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించారు గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ . రెగ్యులర్ గా డ్యూటీ చేస్తూ మంచి వేతనం పొందటం ద్వారా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉండవచ్చన్నారు. ఒక వేళ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తాం అన్నారు.సంస్థ ఉత్పత్తి లక్ష్యం సాధనకు ఉద్యోగుల గైర్హాజరు సైతం ఒక ఆటంకం గా మారింది అని RK 5 గనిలో 1200 మందిలో కేవలం 800 మంది మాత్రమే రెగ్యులర్ గా విధులకు హాజరవుతున్నారు అని 400 మంది అబ్సెంట్ అవటం విచారకరం అన్నారు. అందులోనూ 125 మంది 75 మస్టర్లు కూడా చేయకపోవటం విచారకరం అని ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అని ఆకాంక్షించారు. ఇకనుంచి అందరూ ప్రతిరోజూ డ్యూటీ చేస్తూ సంస్థ ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తిలో RK 5 గని ని సింగరేణిలో అగ్రగామిగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, రక్షణ అధికారి రాందాస్, సంక్షేమ అధికారి రణదీప్, అడిషనల్ మేనేజర్ శివయ్య, ఫిట్ సెక్రటరీ నర్సింగ్ రావ్, యాక్టింగ్ పీఏ శ్రీకాంత్ ఇతర అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.

NEW MANAGER CHARGE & PRODUCTION ENHANCING MEETING@RK5_09-11-2024*C&MD, డైరెక్టర్ల స్ఫూర్తి, జీఎం గారి సూచనల మేరకు రక్షణత...
09/11/2024

NEW MANAGER CHARGE & PRODUCTION ENHANCING MEETING@RK5_09-11-2024

*C&MD, డైరెక్టర్ల స్ఫూర్తి, జీఎం గారి సూచనల మేరకు రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యం సాదిద్దాం గౌరవప్రదమైన ఇన్సెంటివ్ పొందుదాం:ఏజెంట్ శ్రీధర్*

*మెరుగైన ఉత్పత్తి సాధించిన ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతుల అందజేత.*

*నూతన మేనేజర్ ను శాలువాలతో సత్కరించి స్వాగతం పలికిన RK 5 ఉద్యోగులు ,అధికారులు*

*కార్మికుల గైర్హాజరు తగ్గాలి సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచాలి: మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, ఏజెంట్ శ్రీధర్*

న్యూస్:
గతకొద్ది సంవత్సరాలుగా ఉత్పత్తి , రక్షణలో సింగరేణిలో అగ్రగామిగా నిలుస్తున్న RK 5 గని ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తి కొనసాగించి రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యసాధనలో నెంబర్ వన్ గా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు RK5&6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్. కొన్ని ప్రతికూల పరిస్థితులు , ఉద్యోగుల గైర్హాజరు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు సంస్థ ఉత్పత్తి సాధనలో RK 5 కొంత వెనుకబడింది అన్నారు. C&MD, డైరెక్టర్ ల సూచనలతో, శ్రీరాంపూర్ జీఎం గారి ఆదేశాలతో ఉద్యోగులు గైర్హాజరు తగ్గించుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి లో శ్రీరాంపూర్ ఏరియలోనే RK 5 ను నెంబర్ వన్ గా నిలుపాలన్నారు. ఉత్పత్తి తో పాటు మెరుగైన OMS సాధిస్తే ఇన్సెంటివ్ రూపంలో అందుకు తగ్గ ప్రతిఫలం పొందవచ్చు అని సూచించారు. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ఏవిధంగా జరుగుతుంది దాన్ని ఏవిధంగా మెరుగు పరుచుకోవాలి అని అవగాహన కల్పించి కార్మికుల్లో స్ఫూర్తి నింపారు. ఉత్పత్తి సాధనలో పోటీ నెలకునేలా గతవారం మెరుగైన ప్రొడక్షన్ సాధించిన B రిలే ఉద్యోగులకు శనివారం ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇకనుంచి ఎవరు ఉత్పత్తిలో టాప్ గా నిలిస్తే వారికి గని పరిధిలో ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని తెలిపారు. శుక్రవారం RK 5 గని నూతన మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ కుమార్ ఝ ను శనివారం ఉద్యోగులు, అధికారులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. సింగరేణి ఉద్యోగిగా తన ప్రయాణం RK 5 గని లోనే ప్రారంభమైందని వివిధ ప్రాంతాల్లో పనిచేసి తిరిగి ఇదే గని కి మేనేజర్ గా రావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నూతన మేనేజర్ సుదీర్ కుమార్ ఝ. అందరూ కలిసికట్టుగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి RK 5 ను సింగరేణిలోనే టాప్ గా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్,గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝ, రక్షణ అధికారి రాందాస్, సంక్షేమ అధికారి రణదీప్ గౌడ్, ఇంజనీర్ సారయ్య, అడిషనల్ మేనేజర్ శివయ్య, అసిస్టెంట్ మేనేజర్ వినయ్ రెడ్డి, అండర్ మేనేజర్ లు వేణుగోపాల్,సునీల్, నవీన్, లింకన్, ప్రశాంత్,వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఫిట్ సెక్రటరీ నర్సింగా రావ్ , మైనింగ్ స్టాఫ్, సూపర్వైజర్ లు, అధికారులు,వివిధ యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Address

Srirampur

Alerts

Be the first to know and let us send you an email when RK5 Incline posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Business?

Share