Padmavathidesigners

Padmavathidesigners MAY I HELL YOU

Our Services,

T.T.D, SHIRDI, SRISAILAM, SEVAS & ROOM BOOKING
PASSPORT APPLICATION PROCESS & SLOT BOOKING
VISA PROCESS, AIR TICKETS, BUS TICKETS & TOURISM PACKAGES.

19/07/2017

కొండపైకి నేరగాళ్లకు నో ఎంట్రీ!

పాత నేరస్తులకు కిందే చెక్‌
అలిపిరిలో ప్రత్యేక కెమేరాల ఏర్పాటు
నేరగాళ్లను ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు

తిరుమల, జూలై 18: ఏడు కొండలపై కాలు పెట్టాలంటే... ఇక కెమేరాలో బొమ్మ పడాల్సిందే. అలిపిరి దగ్గరో.... మెట్టు మార్గం ముందో... కొండపైకి వేసే తొలి అడుగుకు ముందే మిమ్మల్ని ప్రత్యేక కెమేరాలు అపాదమస్తకం క్షుణ్నంగా తనిఖీ చేస్తాయి. సాధారణ భక్తుల్లో కలిసిపోయి గుట్టుగా కొండెక్కేద్దామనుకునే పాత నేరగాళ్ల గుట్టును ఇట్టే పట్టేస్తాయి. తక్షణం పోలీసులను అప్రమత్తం చేస్తాయి. వెరసి నేరగాళ్లకు ఏడు కొండల తొలిమెట్టు దగ్గరే చెక్‌. ఇక వెంకన్న కొండంతా జీరో క్రైమ్‌ జోన్‌. టీటీడీ అధికారుల లక్ష్యం ఇది. ఫేస్‌ రికగ్నేషన్‌ కెమేరాల ఏర్పాటు ద్వారా నేరగాళ్లను కొండ ఎక్కనీయకుండా చేయాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి క్షేత్రానికి ముఖద్వారమైన అలిపిరిలోనే పాతనేరస్థుల జాడ కనిపెట్టేసి మళ్లీ కటకటాల వెనక్కి పంపేలా ఓ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఫేస్‌ రికగ్నిషన్‌ కెమేరాలను ఏర్పాటు చేయాలని తలపోస్తోంది.

ఇలా చూసి... అలా పట్టించేలా:-
గతంలో నేరాలకు పాల్పడిన వారి ముఖాన్ని కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. దానికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి కెమేరాలతో అనుసంధానిస్తారు. అప్పటికే కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉన్న ఫొటోల్లోని వ్యక్తులెవరైనా ఆ కెమేరా ముందుగా వెళ్తుంటే వెంటనే అప్రమత్తం చేసేలా ఆ సాఫ్ట్‌వేర్‌ పని చేస్తుంది. గతంలో శిక్ష అనుభవించిన వారు, బెయిల్‌పై బయట ఉన్న వారు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగే వారు ఈ కెమెరాల కంటపడితే వెంటనే అలర్ట్‌ మెసేజ్‌లు వస్తాయి. దాంతో ఆ కెమేరాలను ఆపరేట్‌ చేసేవారు... ఆ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకు వస్తారు. వారు అప్రమత్తమై ఆయా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. ఇలా పాత నేరస్తులు కొండపైకి చేరకుండా ఈ కెమేరాలను వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ఎన్ని కెమేరాలు... ఎక్కడెక్కడా...
అలిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి కాలినడక, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారానే తిరుమలకు రావాలి. ఈ మూడు చోట్ల మొత్తం 24 ఫేస్‌ రికగ్నేషన్‌ కెమేరాలను ఏర్పాటు చేయాలని విజిలెన్సు అధికారులు భావిస్తున్నారు. ఈ కెమేరాల పరిశీలన, వాటి ద్వారా వచ్చే సందేశాలను విశ్లేషించేందుకు అలిపిరిలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరు కెమేరాల ద్వారా వచ్చే సందేశాలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తారు. ఒకవేళ పాతనేరస్థులను ఈ కెమేరాలు గుర్తిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు.

ఆటోమెటిక్‌ వెహికల్‌ ఐడింటిఫై కూడా...
ఫేస్‌ రికగ్నిషన్‌ కెమేరాల వ్యవస్థతో పాటు ‘ఆటోమెటిక్‌ వెహికల్‌ ఐడింటిఫై సిస్టమ్‌’ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజిలెన్స్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా అతివేగం, నిబంధనల అతిక్రమణ వంటి వాటికి పాల్పడిన వాహనాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం అలిపిరిలోని గరుడ సర్కిల్‌ వద్ద అండర్‌ వెహికల్‌ స్కానింగ్‌ వద్దే ఆటోమెటిక్‌ వెహికల్‌ ఐడింటిఫై సిస్టమ్‌ ఉంది. కానీ కొంత మరమ్మతులకు గురవడంతో ప్రస్తుతం అవి పనిచేయటం లేదు. తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై నూతనంగా బాధ్యతులు స్వీకరించిన సీవీఎస్వో రవికృష్ణ, ఇతర విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు సమావేశమై ఈవో అనిల్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక కమాండెంట్‌ కంట్రోల్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతమున్న విధానం ద్వారా నేరాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో సక్సెస్‌ కాకపోవటమే ఇందుకు కారణం. తిరుమలలో దాదాపు 640 సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ నేరాలు, నిబంధనల అతిక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ కెమేరాల పనితీరును పరిశీలించే కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌లో మార్పులు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

17/07/2017

Hi Friend's
PADMAVATHI SRIVICES
1. Passport processing
2. Visa Processing
3.Air Tickets
4.TTD: Seva & Room's
5. Srisailam: Seva & Room's
6. Shirdi: Arati, Darshan & Room's
7. Vijayawada: Kanaka Durga Seva Tickets
8. Bus Tickets
9. Sabarimala : Drashan Tickets & Room's Available
10. Holiday Package Available
⏩📲 9160207756📞☎️

13/07/2017
12/07/2017

నేటి నుంచి తిరుమలలో మరో కొత్త నిబంధన

తిరుమల: తిరుమలలో గదుల కోసం భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా టీటీడీ టోకెన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. సీఆర్‌వోలో 10, ఎంబీసీలో-34లో ఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు స్లాట్లద్వారా ఈ కౌంటర్ల వద్ద భక్తులు ఆధార్‌ నెంబరు ద్వారా నమోదు చేసుకోవాలి. కావాల్సిన గది కేటగిరిని తెలపాలి. నమోదు పూర్తికాగానే టోకెన్‌ ఇస్తారు. గది ఖాళీ కాగానే ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అరగంటలోపు భక్తులు అలాట్‌మెంట్‌ కౌంటర్లకు వెళ్లి గదులు పొందాలి. లేకుంటే ఆ తరువాత సీరియల్‌ నంబరు గల భక్తులకు వీటిని కేటాయిస్తారు.

08/06/2017
03/06/2017

తిరుమలలో గది కావాలా..?

ఈ వేసవిలో తిరుమల కొండ మీద నేలనే పడకలుగా మార్చుకుని ముణగదీసుకున్న భక్తులు వేలాదిగా కనిపిస్తున్నారు. ఆలయం ముందున్న విశాలమైన ఆరుబైలు పెద్ద సంఖ్యలో భక్తులకు రాత్రి నివాసంగా మారింది. రోడ్ల పక్కన ప్లాట్‌ఫారాల మీదా, పార్కుల్లోనూ, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ముందూ లగేజి తలకింద పెట్టుకుని కునుకు తీస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. ఎందుకిలా? ఎటు చూసినా వసతి గృహాలున్న తిరుమలలో ఇంత మంది రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నారు? అసలు కొండమీద ఎంత మందికి వసతి ఉంది? ఆన్‌లైన్‌లో కాటేజీలు బుక్‌ చేసుకోవాచ్చా? తిరుమలకు చేరుకున్న భక్తులు వసతి కోసం ఎవరిని సంప్రదించాలి? ఏ సిఫారసులూ
లేని భక్తులకు వసతి దొరుకుతుందా? ఈ సందేహాలకు సమాధానమే ఈ సమాచారం.

7 వేల గదులు 40 వేల మందికి బస :-
తిరుమలలో 7 వేల గదులు ఉన్నాయి. మరమ్మతులు, ఇతర టీటీడీ అవసరాల కోసం 500 గదులు కేటాయించారు. మిగిలిన గదుల్లో 30 నుంచి 40 వేల మంది బస చేయడానికి వీలుంది. సాధారణ రోజుల్లో తిరుమలకు రోజూ 50 నుంచి 70 వేల మంది వస్తుంటారు. వారాంతపురోజులు, పర్వదినాలు, సెలవురోజులైతే ఈ సంఖ్య లక్షకు చేరుతుంది. కొండకు వచ్చే అందరు భక్తులూ వసతి కోరుకోరు. చాలా మంది పేదలు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, పుష్కరిణిలో స్నానం చేసి, బ్యాగులతో సహా క్యూలో నిలబడతారు. దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయిపోతారు. ఏ అర్ధరాత్రో దర్శనం చేసుకుని బయటకు వస్తే, తెల్లవారే దాకా ఆరుబయటే తలకింద బ్యాగులు పెట్టుకుని పడుకుంటారు. వసతి దొరకని మధ్యతరగతి భక్త జనం దిక్కుతోచక అవస్థపడుతుంటారు. దళారుల పాలబడుతుంటారు.

పీఏసీల్లో మరుగుదొడ్లు, లాకర్లు:-
తిరుమలలో ఇప్పుడున్న కాటే జీలకు మించి నిర్మాణాలు చేపట్ట రాదు. దీంతో పెరుగు తున్న భక్తులకు సరిపడేన్ని గదులను టీటీడీ కల్పించే అవకాశం లేదు. అయితే యా త్రీకుల వసతి సముయాలు (పీఏసీ) పెద్ద సంఖ్యలో భక్తులకు నీడనిస్తున్నాయి. తిరుమలలో మొత్తం నాలుగు పీఏసీ భవనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శ్రీవారి సేవకులకు కేటాయించారు. మిగిలిన మూడింటిలో ఒకటి ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉండగా, మరొకటి బస్టాండు ఎదురుగాను, ఇంకోటి సిఆర్‌ఓ సమీపంలోనూ ఉంది. మూడు పీఏసీల్లోని 20 హాళ్లలో మరుగుదొడ్లు, స్నానపుగదులు, 5,500 లాకర్లు ఉన్నాయి. పీఏసీ-2లో కల్యాణకట్టతో పాటు అన్నప్రసాదాల విరతణ చేస్తారు. గదులు లభించని భక్తులు తమ లగేజిని ఇక్కడి లాకర్లలో పెట్టుకుని దర్శనానికి వెళుతుంటారు. హాల్లోనే పడుకుంటారు. దాదాపు 20 వేల మందికి పీఏసీల్లో వసతి ఉంది.

పద్మావతి ప్రాంతంలో వీఐపీల కోసం 620 గదులు ఉన్నాయి.అద్దెలు రోజుకి రూ.100 నుంచి రూ.6 వేల వరకు ఉంటాయి. ఈవో, జేఈవో, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫారసు లేఖల ఆధారంగా ఈ గదులను కేటాయిస్తారు. సిఫారసు లేఖలున్నవారు పద్మావతి విచారణ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇతర వివరాలకు 0877-2263731 నెంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు:-
ఆన్‌లైన్‌లోనూ గదులను ముం దుగానే బుక్‌ చేసుకునే సౌకర్యం ఉంది. రోజుకి 2 వేల గదులను 90 రోజుల ముందు భక్తుల కోసం టీటీడీ ఇంటర్నెట్‌లో ఉంచుతుంది.అద్దె ఎంత , ఏ వసతి సముదాయంలో ఉన్న గది వంటి వివరాలు ఇందులో ఉంటాయి. భక్తులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకుని క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి కావలసిన గదిని కావలసిన రోజుకి ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. దర్శనం కోసం వచ్చిన భక్తులు సీఆర్‌వో సమీపంలోని ఏఆర్‌పీ కౌంటర్‌లో బుకింగ్‌ ప్రింట్‌ అవుట్‌ చూపించి గదిని తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రూ.50 నుంచి రూ.2 వేల వరకు గదులు అందుబాటులో ఉంటాయి.

నేరుగా కొండకు వస్తే:-
ఆన్‌లైన్‌లో ముందుగా బుక్‌ చేసుకోకపోయినా, ఎటువంటి సిఫారసు లేకపోయినా తిరుమలలో గదులు పొందవచ్చు. సామాన్యుల కోసమే సీఆర్‌వో, కౌస్థుభం, సన్నిధానం, ఎంబీసీ విచారణ కార్యాలయాల్లో ఈ గదులను కేటాయిస్తారు. గుర్తింపు కార్డు చూపితే చాలు. 24 గంటలూ ఈ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయి. క్యూ ద్వారా ముందు వచ్చిన వారికి వచ్చినట్టు గదులను కేటాయిస్తారు. ముందుగా 24 గంటలకే పరిమితం చేసినా, భక్తుల విన్నపం మేరకు మరో 24 గంటలు అదే గదిని తిరిగి కేటాయిస్తారు.
వివరాలకు : 0877- 2263572, 0877- 2263523

02/06/2017

శ్రీవారి భక్తులకు ఇక ఉచిత ఫోన్ సౌకర్యం

తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల్లో ఇకపై ఉచిత ఫోన్‌ కూడా చేరనుంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఒక్కోసారి తమవారి క్షేమ సమాచారాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఎయిల్‌టెల్‌ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఫోన్‌ను కాలినడక క్యూకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు.

సర్వే చేశాకే..
టీటీడీ ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈవో ఏకే సింఘాల్‌ తక్కువ సమయంలోనే భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో సిబ్బందితో సర్వే చేయించారు. అత్యవసర సమయంలో తమ వారితో మాట్లాడాలంటే ఫోన సౌకర్యం ఉంటే బాగుంటుందని భక్తులు సూచించారు. ఫోన ఏర్పాటుపై అధికారులతో ఈవో చర్చలు జరిపారు.

వంద ఫోన్ల ఏర్పాటుకు ప్రణాళిక
భక్తులు వేచి ఉండే వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో 16, వైకుంఠం-2లో 31 కలిపి మొత్తం 47 కంపార్టుమెంట్లు ఉన్నాయి. తొలుత ప్రతి కంపార్టుమెంటులోనూ ఉచిత ఫోన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఈవో నిర్ణయించారు. ఆ తర్వాత తిరుమలలోని వివిధ ప్రాంతాల్లోనూ ఉచిత ఫోన్లను ఏర్పాటు చేస్తే.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యోచిస్తున్నారు. ఈ మేరకు సుమారు 100 ఫోన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

‘ఉచితం’ కోసం సంప్రదింపులు
శ్రీవారి సేవగా ఫోన్లను ఉచితంగా ఏర్పాటు చేసే సంస్థ కోసం వివిధ టెలికాం సంస్థలతో ఈవో, జేఈవోలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే.. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించడంపైనా ఆలోచిస్తున్నారు. ఎయిల్‌టెల్‌ సంస్థ సీయూజీ సర్వీసును టీటీడీ ఉపయోగిస్తోంది. అందువల్ల ప్రస్తుతానికి ఆ సంస్థకు సంబంధించిన ఫోన్‌ను కాలినడక భక్తుల కాంప్లెక్సులో ఏర్పాటు చేసి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మొదట కాయిన్‌ బాక్స్‌ విధానం చర్చకొచ్చినా.. చివరకు భక్తులకు ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

రెండు నిమిషాలకు కట్‌ అయ్యేలా..
వెనుక వేచి ఉండే భక్తులకు అవకాశమిచ్చేలా ప్రతి రెండు నిమిషాలకు కాల్‌ కట్‌ అయ్యే విధాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానంతో భక్తులంతా ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నారు. టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు హయంలో 55 కాయిన్‌ బాక్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అప్పట్లో ఈ సౌకర్యం కనుమరుగైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఉచిత ఫోన్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.

31/05/2017

Address

D NO 4-3-40 RAMANNAPETA 1/1, LINE, KORITEPADU
Guntur
522007

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

9160207756

Website

Alerts

Be the first to know and let us send you an email when Padmavathidesigners posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Padmavathidesigners:

Share