14/10/2026
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు. నార్లాపూర్ పంప్ హౌస్‌లోని రెండు భారీ మోటార్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ మోటార్ల ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసి, ఎల్లూరు రిజర్వాయర్‌కు తరలించి, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించనున్నారు.