Prashanth Gouda

Prashanth Gouda MAN POWER SERVICES

07/12/2023

రోడ్ పై గ్రిల్స్ తీయడం వరకు ఓకే గాని, పేరు మార్చాల్సిన అవసరం లేదు

దాని పేరు ప్రగతి భవన్, కేసీఆర్ భవన్, కల్వకుంట్ల భవన్ కాదు.. ప్రగతి అనేది అభివృద్ధికి సూచిక.. మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రభుత్వాధినేత నివసించే భవన్ కాబట్టి ప్రగతి భవన్ అని పేరు పెట్టారు.. ఇలా ప్రతి దాంట్లో కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలెడితే నవ్వులపాలవ్వడం తప్ప ఇంకేం ఉండదు..

శాసనాలు, చట్టాలు చేసే అతి ముఖ్యమైన ప్రదేశం కాబట్టి, అది అంబెడ్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, తాను రచించిన రాజ్యాంగానికి లోబడి ఉండాలి అన్న సంకల్పంతో సచివాలయానికి Dr. BR అంబెడ్కర్ సచివాలయం అని పేరు పెట్టారు..

అంతేకాకుండా, తనని చూస్తూ స్ఫూర్తి పొందాలనే ఉద్దేశ్యం తో సచివాలయానికి సమీపంలో అంత పెద్ద విగ్రహం కట్టించాడు కేసీఆర్..

ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆశయాల్ని, రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించడం అనేది కేసీఆర్ నుండి నేర్చుకోవాలిగాని కేసీఆర్ కి నేర్పించక్కర్లేదు..

వీళ్లకు అంబెడ్కర్ మీద, దళితుల మీద నిజంగా అంత ప్రేమ ఉంటె, కేసీఆర్ కన్నా చాలా నయం అని నిరూపించుకోవాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు దళిత సీఎం అని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు అని ఎంత లొల్లి చేశారో, దాన్ని కౌంటర్ చెయ్యడానికి దళితున్నే సీఎం ని చెయ్యాల్సింది.. అప్పుడు కేసీఆర్ కన్నా గొప్ప అని నిరూపించుకునే అవకాశం ఉండేది..

అంతేగాని అధికారదాహంతో చేసిన విమర్శలని మీకు మీరే నిరూపించుకుంటా ఇపుడు ఇలా అర్థం పర్థం లేకుండా పేర్లు మారిస్తే గొప్పోళ్ళు ఐపోరు..

అయినా ఇదేముంది లే, ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలా చూస్తాం, దానికి తెలంగాణ సమాజం సిద్ధమయ్యే ఉంటుంది..
Kalvakuntla Taraka Rama Rao - KTR
KTR Youth Force
BRS Party

06/12/2023

# # Telangana # #

Address

MG Plaza, Flat # 301, Telangana
Hyderabad
500038

Telephone

+919032615535

Website

Alerts

Be the first to know and let us send you an email when Prashanth Gouda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share