Srichakrapeetam

Srichakrapeetam Hindu Religious Priest Services, Astrology, Navagraha Japamulu and Homamulu .....Remedy & Solutions,

అందరికీ శ్రీరామనవమి శుభాకా0క్షలు. सर्वेभ्यः श्री रामनवमि शुभाशयः Happy Sriramanavami to All हर हर महादेव्
26/03/2026

అందరికీ శ్రీరామనవమి శుభాకా0క్షలు.
सर्वेभ्यः श्री रामनवमि शुभाशयः
Happy Sriramanavami to All

हर हर महादेव्

అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకా0క్షలు.
19/03/2026

అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకా0క్షలు.

श्री वेदान्त पन्चदशि  ( వేదా0త పంచదశి )                तत्व विवेक प्रकरणमं  ( తత్త్వవివేక ప్రకరణము ) श्लोक:  तथा स्वप्ने...
01/03/2026

श्री वेदान्त पन्चदशि ( వేదా0త పంచదశి )

तत्व विवेक प्रकरणमं ( తత్త్వవివేక ప్రకరణము )

श्लोक: तथा स्वप्नेत्र वेद्यं तु न स्थिरं जागरे स्थिरं ।
तद्भेदो तस्तयो स्संविदेक रूपा न भीद्यते ।।

శ్లో :. తథా స్వప్నే త్ర వేద్యం తు న స్థిరం జాగరే స్థిరం |
తద్భేదో తస్తయో స్సంవిదేక రూపా న భిద్యతే ||

చూడబడు పదార్ధములకంటే చూచునట్టి జ్ఞానము భిన్నము కావలయుననియూ , దావి స్వరూప స్వభావములకు భేదము కనుబడకపోవుటచే అది ఏకమే అనియు పదార్ధములకు మాత్రమే భేదము కలదనియూ , ఆ భేదముతో జ్ఞానమునకు సంబంధము ఉండదనియూ సవిమర్శముగా పూర్వము లోకమున వివరి0చియున్నాము. ఈ సిద్దాతము జాగ్రదాద్యవస్థలు మూడి0టిలో దేనిని బట్టి చూచినను సరిపడును. సుషుప్యవస్థ విషయం అటు0డని0డు. జాగ్రత్స్వప్నములు మాత్రము సమానములే. ఈ రె0డువ్యవస్థలయందునూ అనేక పదార్ధములు పరస్పరభిన్నములగు స్వరూపములతో కానవచ్చుచున్నవి అనుట అనుభనసిద్దమే కదా ! కావునా జాగ్రదవస్థయందువలనే స్వప్నావస్థయందునూ పదార్ధములు మాత్రమే భిన్నములు గాని జ్ఞానము భిన్నము కాదని నిర్వివాదముగా గ్రహి0పవచ్చును.

శ్రీ విద్యారణ్య స్వామి.

श्री विद्यारण्य स्वामि

चिदानंद रूपः शिवोहं शिवोहं

श्री वेदान्त पन्चदशि  ( వేదా0త పంచదశి )                तत्व विवेक प्रकरणमं  ( తత్త్వవివేక ప్రకరణము ) श्लोक:  शब्दस्पर्शा...
28/02/2026

श्री वेदान्त पन्चदशि ( వేదా0త పంచదశి )

तत्व विवेक प्रकरणमं ( తత్త్వవివేక ప్రకరణము )

श्लोक: शब्दस्पर्शादयो वेद्या वैचित्र्याज्जागरे पृथक् ।
ततो विभक्ता तत्संवि दैकरूप्या न्न भिद्यते ।।

శ్లో :. శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్ర్యాజ్జాగరే పృథక్ |
తతో విభక్తా తత్సంవి దైకరూప్యా న్న భిద్యతే ||

ఇంద్రియములచే పదార్ధములను గ్రహి0చుట యేది కలదో అది జాగ్రదవస్ధ అనబడుచున్నది. ఈ అవస్ధ మిక్కిలి విస్పష్ఠముగనే ఉన్నదికదా ! దీనియందు మనము అనేకపదార్ధములను , గుణములను చూచుచున్నాము. " ఇది శబ్దము.ఇది స్పర్శము. ఇది ఆకాశము . ఇది వాయువు. ఇది స్తంభము. " అని వాటిని పరస్పర భిన్నములుగా కూడా తెలియచున్నాము. వాని ఆకారములయందును , గుణములయందును అనంతమగు భేదము కనబడుటచే " ఈ పదార్దములయందు భేదము కలదు " అనుట యె0తయు యుక్తియుక్తముగా అనుభవానుసారముగా ఉన్నది.ఈ విషయమున వర్ణి0చిన కారణములచే మనకు ప్రమాదమేమీయూ లేదు. ఇంకను ప్రమాదస్ధానమును గురి0చి కొ0త చెప్పవలసి ఉన్నది. మనము పదార్ధజ్ఞానస్వరూపమును గూడి ఇట్టి భేదములు కలదానినిగానే తలంచుచున్నాము. పరస్పర భిన్నములగు రె0డుపదార్ధములను గ్రహి0చినప్పుడు పదార్ధములతో పాటు జ్ఞానమునకు కూడా భేదము కలిగెను అని అనుకొనుచున్నాము.శబ్ధజ్ఞానము కంటే స్పర్శజ్ఞానము భిన్నమని భ్రా0తిపొ0దుచున్నాము. ఇదియే మన ప్రమాదము. ఇదియే జీవుని యధార్ధస్వరూపమును తెలియకండుటకు కారణము. ఇదియే మఱల మఱల సంసార దు:ఖమును అనుభవి0చుటకు మూలకారణము.

శ్రీ విద్యారణ్య స్వామి.

श्री विद्यारण्य स्वामि

चिदानंद रूपः शिवोहं शिवोहं

श्री वेदन्त पन्चदशि  ( వేదా0త పంచదశి )                तत्व विवेक प्रकरणमं  ( తత్త్వవివేక ప్రకరణము ) श्लोक:  तत्पादांबुरु...
26/02/2026

श्री वेदन्त पन्चदशि ( వేదా0త పంచదశి )

तत्व विवेक प्रकरणमं ( తత్త్వవివేక ప్రకరణము )

श्लोक: तत्पादांबुरुहद्वंद्व सेवानिर्मल चेतसाम् ।
सुखबोधाय तत्वस्य विवोकोयं विधीयते ।।

శ్లో : తత్పాదా0బురుహద్వంద్వ సేవానిర్మల చేతసామ్ |
సఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే ||


వేదా0తశాస్త్రము మిక్కిలి గంభీరమై సామాన్యులకు దుర్బోధమై యున్నది. ఈ విధంగా ఉండుటచే దానిని సమగ్రముగా విచారి0చ లేకపోవుటవలన , విచారి0చినా బుద్ధిమా0ద్యమువలన అర్ధమును నిర్ణయం చేయలేక అనేకులు ఆయాసపడుచున్నారు. చిత్తశుద్ధి లేని వారి విషయం అలా ఉంచి, చిత్తశుద్ధి కలిగిన వారు కూడా శాస్త్రగాభీర్యము వలన ఆయాసపజవలసి వచ్చుచున్నది. కావునా చిత్తశుద్ధి కలవారి ఆయాసమును తీర్చుటకై శాస్త్ర తాత్పర్యమును సవిమర్శముగాను , సంక్షేపముగను బోధి0చుటకై ఈ క్రొత్త గ్ర0ధమును ఆరంభి0చుచున్నాను. జీవుడు బ్రహ్మరూపు0డైనను అజ్ఞానము వలన , ఆ బ్రహ్మమందు పంచకోశములు ఆరోపి0చబడి ఉండుటచే బ్రహ్మమునకు భిన్నముగా తోచుచున్నాడు. ఆయనకు నా కోశములతో సంబంధము లేదని తెలుసుకొని సుఖతరముగా విమర్శి0పబడును. " జీవుడును ప్రపంచాతీతుడే " అను విషయమును నిరూపి0పబడి " జీవబ్రహ్మైక్యము " స్ధాపి0పబడును.

శ్రీ విద్యారణ్యస్వామి.

श्री विद्यारण्य स्वामि .

चिदानंद रूपः शिवोहं शिवोहं

श्री वेदन्त पन्चदशि  ( వేదా0త పంచదశి )                तत्व विवेक प्रकरणमं  ( తత్త్వవివేక ప్రకరణము ) श्लोक:  नमः श्री शंक...
25/02/2026

श्री वेदन्त पन्चदशि ( వేదా0త పంచదశి )

तत्व विवेक प्रकरणमं ( తత్త్వవివేక ప్రకరణము )

श्लोक: नमः श्री शंकरानंद गुरुपादांबु जन्मने ।
सविलासमहामोहा ग्राहाग्रासैक कर्मणे ।।

శ్లో : నమః శ్రీ శఙ్కరానందగురుపాదా0బుజన్మనే |
సవిలాసమహామోహ గ్రాహా గ్రాసైక కర్మణే ||

ఈ ప్రపంచం అంతయూ అజ్ఞానమున జనియి0చినది. అజ్ఞానము అనగా భ్రా0తి. దానిచే జీవులు స్వయముగ పరబ్రహ్మము కంటే భిన్నులుగాను , తమకంటే భిన్నమైన ప్రపంచము మరోకటి ఉండి తనను బంధి0చుచున్నట్లును తలంచుచున్నారు. ఇదియె బంధము. ఇట్టి బంధమును బోధన శక్తిచే ధ్వంసము చేసి శిష్యులను సదా అనుగ్రహి0చుచు0డు శంకరానంద గురువు యొక్క పాదపద్మములకు నమస్కరి0చెదను. అభేదవిజ్ఞానముచే పరమేశ్వర రూపునిగా తెలుసుకుని మ్రొక్కెదను.......

శ్రీ విద్యారణ్యస్వామి.

श्री विद्यारण्य स्वामि .

चिदानंद रूपः शिवोहं शिवोहं

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11వ సంవత్సరం కాశీ శివరాత్రి మహోత్సవం కాశీ క్షేత్రములో ఘనంగా కాశీ విశ్వనాధ స్వామి ద...
18/02/2026

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11వ సంవత్సరం కాశీ శివరాత్రి మహోత్సవం కాశీ క్షేత్రములో ఘనంగా కాశీ విశ్వనాధ స్వామి దయతో శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో జరిగినది.

हर हर महादेव्
ऊॅं नमः शिवाय
ऊॅं गं गणपतये नमः

ऊॅं श्री स्वामियो शरणं अय्यप्प
04/11/2024

ऊॅं श्री स्वामियो शरणं अय्यप्प

29/10/2024

ఒకరి తప్పుని మరోకరు చూపిస్తే అవమానం....
తన తప్పును తను తెలుసుకోవడం గొప్పతనం ...
అదే పశ్చాత్తాపం లేదా ప్రాయశ్చిత్తం
हर हर महादेव्

Address

Hyderabad
500018

Alerts

Be the first to know and let us send you an email when Srichakrapeetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Srichakrapeetam:

Share