ABCD Business Solutions

ABCD Business Solutions START YOUR OWN BUSINESS
ABCD Business solutions will give u the complete solution to start any busin
(1)

*ప్రధానమంత్రి  ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP )*ఈ పథకం క్రింద వస్తు ఉత్పత్తుల పరిశ్రమలకు రూ 50 .00 లక్షలు మరియు వ్యాపారం ...
03/11/2025

*ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP )*

ఈ పథకం క్రింద వస్తు ఉత్పత్తుల పరిశ్రమలకు రూ 50 .00 లక్షలు మరియు వ్యాపారం & సేవల సంస్థల కు రూ 20 .00 లక్షల ప్రాజెక్ట్ వ్యయం వరకు వ్యక్తుల అర్హతలను బట్టి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం పై 15 % నుండి 35 % వరకు సబ్సిడీ పొందవచ్చు .MSME డాష్‌బోర్డ్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) 59,708 యూనిట్లకు సహాయం చేసి, రూ. 2,202.00 కోట్ల మార్జిన్ మనీ (MM) సబ్సిడీని పంపిణీ చేసింది. ఈ పథకం ప్రారంభమైనప్పటినుండి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి, దేశవ్యాప్తంగా మొత్తం 10,18,185 సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో PMEGP సహాయం చేసింది.ఈ సంస్థలకు, ₹73,348 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయబడ్డాయి, పథకం ప్రారంభమైనప్పటి నుండి లబ్ధిదారులకు మొత్తం ₹27,166 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ అందించబడింది.
3 . CETMSE స్కీం ( ఇన్సూరెన్సు క్రెడిట్ గ్యారంటీ స్కీం )
ఈ స్కీం క్రింద ప్రస్తుతం , ఉత్పత్తులతయారీ , సేవ ,వ్యాపార సంస్థల ప్రారంభానికి ,గరిష్టంగా రూ 10 .00 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం వుండే వాటిని పరిగణిస్తున్నారు . మొత్తం ప్రాజెక్ట్ వ్యయం లో 5 % నుండి 25 % వరకు ( ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని బట్టి ) ప్రమోటర్లు పెట్టుబడిగా సమకూర్చుకొంటే , మిగిలిన మొత్తాన్ని కోలేటరల్ లేకుండా రుణాలు పొందే అవకాశం వున్నది . రూ 10 కోట్ల వరకు అవకాశంవున్న ప్రాజెక్ట్ నుబట్టి ,ప్రమోటర్ల అనుభవాన్ని బట్టి తగినంత మొత్తాన్ని బ్యాంకులు శాంక్షన్ చేస్తున్నాయి . నా ప్రోగ్రాంలకు హాజరైన వారు ఎందరో ఈ స్కీం క్రింద ప్రాజెక్ట్ మొదలు పెట్టామని చెప్పారు . నేను చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ల తో ఈ స్కీం ప్రకారం ప్రాజెక్టులు మొదలు పెట్టినవారు వున్నారు కూడా .
2023–24 ఆర్థిక సంవత్సరానికి, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) ₹2,02,807 కోట్ల విలువైన హామీలను వివిధ ప్రాజెక్ట్ లకు ఆమోదించింది . ఈ స్కీం మొదలైన దగ్గర నుండి అక్టోబర్ 2023 నాటికి, పథకం ప్రారంభం నుండి ఆమోదించబడిన హామీల మొత్తం విలువ ₹5 లక్షల కోట్లకు చేరుకుంది అని గణాంకాలు చెపుతున్నాయి .

-- : Mynampati Sreenivasa Rao

అమల్లోకి UPI కొత్త రూల్స్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు స...
16/09/2025

అమల్లోకి UPI కొత్త రూల్స్..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్లో రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.

ఐఫోన్‌ల తయారీలో ఆంధ్రప్రదేశ్ భాగం: కుప్పంలో హిందాల్కో భారీ పెట్టుబడి!ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ప్రాంతం త్వరలో ఒక కొత్త పా...
28/08/2025

ఐఫోన్‌ల తయారీలో ఆంధ్రప్రదేశ్ భాగం: కుప్పంలో హిందాల్కో భారీ పెట్టుబడి!

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ప్రాంతం త్వరలో ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం తయారీ సంస్థల్లో ఒకటైన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇక్కడ రూ. 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాదు, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌ల ఛాసిస్ (బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది.

హిందాల్కో: ఒక ప్రపంచ స్థాయి దిగ్గజం
ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో, అల్యూమినియం మరియు రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ 1958లో స్థాపించబడింది. కేవలం భారతదేశానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో దీని వ్యాపార కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు ఈ సంస్థ కీలకమైన ఉత్పత్తులను అందిస్తుంది. లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వేలమందికి ఉపాధి కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పాత్ర మరియు స్థానిక ప్రాముఖ్యత

కుప్పంలో హిందాల్కో చేస్తున్న ఈ భారీ పెట్టుబడి వల్ల ఆంధ్రప్రదేశ్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్ (Apple's global supply chain) లో ఒక కీలకమైన భాగం కాబోతోంది. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా సుమారు 613 ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యంగా, కుప్పం భౌగోళికంగా బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రముఖ పారిశ్రామిక నగరాలకు దగ్గరగా ఉండటం, చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించడం వలన ఇది పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారుతోంది.

ఈ ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు. ఇది భారతదేశం "మేక్ ఇన్ ఇండియా" మరియు "మేక్ ఫర్ ది వరల్డ్" లక్ష్యాలకు అనుగుణంగా, కీలకమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే దిశగా ఒక ముందడుగు. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలను ఇప్పుడు భారతదేశంలోనే తయారు చేయడం అనేది దేశ పారిశ్రామిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి ఒక గొప్ప సంకేతం.

హిందాల్కో లాంటి ప్రపంచ స్థాయి సంస్థ పెట్టుబడి పెట్టడం వల్ల, ఈ ప్రాంతం మరిన్ని టెక్ పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామం భారతదేశం యొక్క తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది.

కుప్పం ఇక యాపిల్ రేంజ్ గ్లోబల్ బ్రాండ్!

మీరు స్వర్ణకారుడిగా మారాలనుకుంటున్నారా!!! అలా అయితే, ఇది మీ కోసం ఒక పోస్ట్. గోల్డ్ జ్యువెలరీ అప్రైజర్ శిక్షణ అనేది ఫీల్డ...
25/06/2025

మీరు స్వర్ణకారుడిగా మారాలనుకుంటున్నారా!!! అలా అయితే, ఇది మీ కోసం ఒక పోస్ట్. గోల్డ్ జ్యువెలరీ అప్రైజర్ శిక్షణ అనేది ఫీల్డ్‌లో అనుభవం లేని వారికి, జ్యువెలరీ అప్రైజర్ మరియు సంబంధిత శిక్షణ అనుభవం ఉన్న వారికి నగల వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వ్యాపార అవకాశాలను చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.ఆచరణాత్మక మరియు సాధారణ వ్యాయామాల ద్వారా ఆధునిక పద్ధతులను ఉపయోగించి శిక్షణ జరుగుతుంది.ఈ శిక్షణ యొక్క ప్రయోజనాలు మీరు నగల వ్యాపారాన్ని ప్రారంభించడానికి, బ్యాంకులలో పని చేయడానికి, పురాతన ఆభరణాలను కొనడానికి మరియు విక్రయించడానికి, తాకట్టు దుకాణాన్ని నడపడానికి మరియు నగల పరిశ్రమను ప్రోత్సహించడానికి మీకు సహాయపడతాయి.శిక్షణ పూర్తిచేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి 9652611011 / 9652611022
Appraisal Training Gold Appraisal Classes Gold Appraisal Training Gold Appraisal Programs Appraiser Certification Your Gold Valuation Career Gold Appraisal Training Appraisal Course Online Gold Valuation Training a Certified Gold Appraiser Appraisal Training Near Me Appraisal Expertise training institute for precious metal appraisal assessment and valuation course jewelry appraisal training appraisal school assessment workshop appraiser certification bank

అపోలో డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వయసు 92ఆస్తి రూ.70 వేల కోట్లు92 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తార...
16/05/2025

అపోలో డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వయసు 92
ఆస్తి రూ.70 వేల కోట్లు

92 ఏళ్ల వయసులో ఇప్పటికీ
ఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు.
సాయంత్రం 5 వరకు పనిచేస్తారు.
ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు.

అలా ఆయన హెల్త్ కేర్ రంగంలో
70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు.

చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,
స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు.

తర్వాత అమెరికా వెళ్లి కార్డియాలజీ చేశారు.
అప్పట్లోనే డాక్టర్ అంటే విదేశాల్లో
ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోండి.

కానీ ఓ లేఖ,
ఓ ఘటన ఆయన జీవిత గమ్యాన్ని మార్చేశాయి.

డాక్టర్ చదివి ఈ దేశానికి సేవ చేయాలనేది
ప్రతాప్ రెడ్డి తండ్రిగారి కోరిక.

విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు
ఈ కోరికను వెలుబుచ్చుతూ తండ్రి రాసిన లేఖ,
ప్రతాప్ రెడ్డిని కదిలించింది.
1970ల్లో ఆయన భారత్ కు వచ్చేశారు.

ఇండియా వచ్చిన తర్వాత
ఓ ఘటన ఆయనను కలచివేసింది.

ఇండియాలో పనిచేస్తున్న రోజుల్లో,
1979లో సరైన వైద్య సదుపాయాలులేక
తన కళ్ల ముందే ఓ రోగి చనిపోవడాన్ని
ప్రతాప రెడ్డి తట్టుకోలేకపోయారు.

ఆ రోగిని బతికించగలననే విషయం ఆయనకు తెలుసు,
కానీ సదుపాయాల్లేవు.
అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాలోనే ప్రపంచస్థాయి వైద్యం అందించే
హాస్పిటల్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు.

ఆ ఆలోచన నుంచి
పుట్టుకొచ్చిందే అపోలో హెల్త్ కేర్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలోకు
71 హాస్పిటల్స్ ఉన్నాయి.
5వేల ఫార్మసీలతో పాటు,
291 ప్రాధమిక సంరక్షణ కేంద్రాలున్నాయి.

వీటితో పాటు
డిజిటల్ హెల్త్ ఫ్లాట్ ఫామ్ కూడా నిర్వహిస్తోంది.

ఇప్పుడీ కంపెనీ మార్కెట్ విలువ 70వేల కోట్ల రూపాయలు.

డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కుటుంబం
ఇందులో 29.3 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.

ఫోర్బ్స్ ప్రకారం, ప్రతాప్ సి.రెడ్డి వ్యక్తిగత
నికర ఆస్తుల విలువ 26,560 కోట్ల రూపాయలు.
ఈ నంబర్ ఆయనకిప్పుడు తృప్తినివ్వడం లేదు,

అపోలో సామ్రాజ్యం,
అందులో రోగులకు అందుతున్న
వైద్య సేవలు ఆయనకు సంతృప్తినిస్తున్నాయి.

దేశాల మధ్య ఎగుమతులు,దిగుమతులు నిరంతర ప్రక్రియ. గత సంవత్సరం భారతదేశం, ఆమెరికా మద్య షుమారు 129 బిలియన్ డాలర్ల వ్యాపారం జరి...
04/04/2025

దేశాల మధ్య ఎగుమతులు,దిగుమతులు నిరంతర ప్రక్రియ. గత సంవత్సరం భారతదేశం, ఆమెరికా మద్య షుమారు 129 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అమెరికా భారతదేశానికి 41 బిలియన్ డాలర్ల విలువ ఎగుమతి చేస్తే, ఇండియా అమెరికాకు 87 బిలియన్ డాలర్ల విలువ ఎగుమతి చేసింది. ఈ రెంటి మధ్య ఉండే తేడానే ట్రేడ్ గ్యాప్ అంటారు. గత సంవత్సరం అమెరికా ఇండియాకు మధ్య ఉన్న ట్రేడ్ గ్యాప్ 46 బిలియన్ డాలర్లు. ఇండియాకు అమెరికా ప్రభుత్వం కావచ్చు, అమెరికా వ్యాపారాలు కావచ్చు ఆ గ్యాప్ డబ్బులు కడతాయి.

ఈ ట్రేడ్ గ్యాప్ రావటానికి చాలా కారణాలలో ప్రధాన కారణం tariffs.. సుంకాలు. ఎగుమతి, దిగుమతుల మీద వేసే పన్ను. అమెరికా తన దిగుమతుల మీద 2.5% సుంకాలు విధిస్తూ ఉంటే ఇండియా షుమారు 56% నుంచి 125% సుంకాలు విధిస్తుంది. ఉదాహరణకు అమెరికాలో తయారైన కారు మీద ఇండియా 100% సుంకం విధిస్తే, ఇండియాలో తయారైన కారు మీద అమెరికా రెండున్నర శాతం సుంకం వేస్తుంది. దీనివలన అమెరికా వస్తువులు ఇండియాలో ఖరీదుగా మారి ఎక్కువ ఎగుమతులు చేసుకునే అవకాశం అమెరికా కోల్పోతుంది. అమెరికా బేస్ సుంకం 2.5% ప్రపంచంలోనే అతి తక్కువ. దీనివలన ఈ తరహా అసమానతలు ప్రపంచమంతటితో అమెరికా ఎదుర్కొంటుంది.

ఇప్పుడు దానిని సరిచేయాలని, ప్రపంచంలో అతి పెద్ద కస్టమర్ ను నేనే, నేను చెప్పినట్లు అందరూ వినాలి అనే వైఖరితో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు reciprocal tariffs మొదలుపెట్టారు. అంటే మీరు మా వస్తువుల మీద ఎంత సుంకం విధిస్తే మేము మీ వస్తువుల మీద అంత సుంకం విధిస్తాం అనటం.

ఒక విధంగా అమెరికా సుంకం మరీ తక్కువగా ఉండటం అన్నది నిజం. దానివలన కొన్ని అమెరికా కంపెనీలు విదేశాల్లో తమ తయారీ పరిశ్రమలు పెట్టి, తక్కువ ధరకు తయారు చేయించి రెండున్నర శాతం సుంకం కట్టి అమెరికాలో అమ్ముకుంటున్నది నిజం. దీనివలన ఆ దేశంలో తయారీ రంగం పూర్తిగా దెబ్బతిని పోయింది అన్నది నిజం. ప్రస్తుత అధ్యక్షుడు చెబుతున్నట్లుగా సుంకాల్లో అసమానతలు తగ్గించాలి, ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం వహించిన ఆ దేశం వాటిని సరిచేయాల్సిన అవసరం కూడా ఉంది.

ఇక్కడే తప్పు జరుగుతున్నది. ఉద్దేశం మంచిది అయితే చాలదు చేసే విధానం కూడా బాగుండాలి. ట్రేడ్ గ్యాప్ ఎక్కువ ఉన్న దేశాలతో చర్చలు జరపాలి. ఆ తేడా ఎలా సరిచేయాలి అనేది రెండు దేశాల ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకోవాల్సిన అంశం. ఇతర దేశాల సుంకాలు తగ్గించమని అడగవచ్చు, అదే సమయంలో తన సుంకాలు కొంచెం పెంచుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఉన్నదానిని సమీక్షించి లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి గానీ, లేడీకి లేచిందే పరుగు లాగా తీసుకునే నిర్ణయాల వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదుపుకి గురవుతుంది. అసలు ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందో తెలియని ఒక అయోమయ స్థితికి ప్రపంచాన్ని నెట్టి వేయటం బాధ్యతా రాహిత్యం! చూద్దాం, ఆర్ధిక వ్యవస్థలు ఎలా మారతాయో!!
- Ramesh Adusumilli

‼️  *Exclusive Opportunity to Exhibit at the World’s Largest Franchise & Retail Show* ‼️ *Dear Brand,**We are pleased to...
29/03/2025

‼️ *Exclusive Opportunity to Exhibit at the World’s Largest Franchise & Retail Show* ‼️

*Dear Brand,*

*We are pleased to invite you to book your stall at the World’s Largest Franchise & Retail Show happening on 17-18 May 2025 at the YASHOBHOOMI India International Convention & Expo Centre (IICC), New Delhi.*

*Why Exhibit?*
*Connect with 40,000+ visitors and over 500 national & international brands* .

*Showcase your brand to potential investors, distributors, and business partners.*

*Network with industry leaders, decision-makers, and entrepreneurs.*

*This is a prime opportunity to elevate your brand, expand your reach, and explore new business opportunities.*

For stall bookings or inquiries, please contact:
*Best Regards*
*Abhishek Kumar Jha*
*Assistant Manager Franchise India Brands Limited*
*Number +91 93550 99183 / +91 70013 72682*

We are excited to see you participate in this prestigious event.

*### సోప్స్ అధినేత మృతి*తమిళనాడు నుంచి గుంటూరు వచ్చి త్రిబుల్ ఎక్స్ ### సోప్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించి అంచలంచెలుగా గ...
13/03/2025

*### సోప్స్ అధినేత మృతి*

తమిళనాడు నుంచి గుంటూరు వచ్చి త్రిబుల్ ఎక్స్ ### సోప్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించి అంచలంచెలుగా గుంటూరు నగరంలో ఎదిగి ఎంతోమందికి తన సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎన్నో దైవ,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వితరణ చేసిన మానవతవాది, పరోపకారి, సామాజిక సేవకులు, స్నేహశీలి *శ్రీ మాణిక్వేల్ గారు.

09/03/2025

*_ఎగుమతిదారుల సిండికేట్‌తో రైతులు విలవిల*_*

*పడిపోయిన రొయ్యల ధరలు*

*పంట చేతికివచ్చే సమయంలో* .. *భారీగా తగ్గుదల*
*
*_ఎగుమతిదారుల సిండికేట్‌తో రైతులు విలవిల*_

*పెరిగిన ఉత్పత్తి వ్యయం..*

*కుదేలవుతున్న ఆక్వారంగం*

*పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ఫీడ్‌ ధరలు*

*ప్రభుత్వమే ఆక్వాను ఆదుకోవాలి* : *రైతుల డిమాండ్‌*

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే ఆక్వారంగం క్రమంగా కుదేలవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయానికి తగ్గట్టు ఉత్ప త్తి అయిన రొయ్యలకు సరైన లభించకపోవడంతో ఆక్వా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఎగుమతిదారులు సిండికేట్‌గా తయారై ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అయ్యే సమయానికి ధరలను ఇష్టారాజ్యంగా తగ్గించేయడంతో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు విద్యుత్‌ చార్జీల భారం, ఆక్వా ఫీడ్‌ ధరల పెరుగుదలతోపాటు ఉత్పత్తి వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ఉమ్మడి ఉభయగోదావరి , కృష్ణా,నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం , విశాఖపట్నంజిల్లాల్లోని ఆక్వా సేద్యం చేస్తున్న రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు రొయ్యల చెరువుల లీజు కూడా రికార్డుస్థాయికి చేరిపోయింది. కానీ ఆక్వా పంట విక్రయించే సమయంలో మాత్రం ఎగుమతిదారులు పెట్టిందే రేటు.. వారు కొంటేనే రైతుకు దిక్కు అన్న చందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆక్వా సేద్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. ఆక్వా సేద్యం చేస్తున్న రైతులకు రొయ్య పిల్లల సీడ్‌ చెరువులో వేసిన నాటి నుంచి అది పెరిగి పెద్ద అయి కౌంట్‌ దశకు చేరే సమయం వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంకంటే భిన్నంగా సాగు సమయంలో అనేక కష్టాలు పడాల్సి వస్తోంది.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల రొయ్యలు, చేపలపై వివిధ రకాల వైరస్‌లు దాడి చేస్తున్నాయి. ఫలితంగా ఆ పంట లు సాగుచేస్తున్న ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటికితోడు పెరిగిన విద్యుత్‌ చార్జీలు, అడ్డూ అదుపులేకుండా ఆక్వాసేద్యానికి సంబంధించిన ఎరువులు, వ్యాక్సిన్లు, మేత రేట్లు పెంచి రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు. పంట సాగుకు వచ్చే సమయంలో ముఖ్యంగా ఆక్వారంగానికి చెందిన ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి ధరలు అమాంతంగా తగ్గించడంతో పంట దిగుబడి, రొయ్య కౌంట్‌ ధరలపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు వారు ఇస్తున్న షాక్‌తో నష్టం వాటిల్లుతోంది. గతేడాది మే నెలలో వంద కౌంట్‌ ధర కిలో రూ.220 పలికేది. అయితే ఆ కౌంట్‌ సాగు చేయడానికి రూ.250 పైనే ఖర్చు అవుతుందని ఆక్వా రైతులు చెబుతున్నారు. గత ఏడాదిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిలో కౌంట్‌ రొయ్య ధర రూ.260 వరకు పెరిగింది. ఒక దశలో వంద కౌంట్‌ రూ.270 కూడా కొనుగోలు చేశారు. ఈ ధర కొన్ని నెలలపాటు నిలకడగా కొనసాగడంతో రె ైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే గత కొన్ని రోజులు నుంచి క్రమంగా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. మహాశివరాత్రి పర్వదినం నుంచి రొయ్యల ధరలు పతనం ప్రారంభమై వంద కౌంట్‌ ధర రూ.200కు పడిపోయింది. ఎగుమతిదారులు సిండికేట్‌ అయి పండుగల పేరిట రొయ్య ల ధరలను తగ్గిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆక్వాసాగు చేస్తున్న వందలాదిమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ధరల్లో రోజురోజుకు క్షీణత*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వారంగ ఉత్పత్తుల ధరల పెరుగుదల చూపించినట్టే చూపి హఠాత్తుగా వాటిని తగ్గించేశారు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఉన్న ధరలతో పోలిస్తే మార్చి మొదటివారంలో ఇప్పటివరకు రూ.150 తగ్గించేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతీ కౌంట్‌కు కిలోకు సగటున రూ.40వరకు ధర తగ్గించారు. ప్రతీ రైతుకు ఎకరానికి కనీసం రూ.లక్ష వరకు నష్టం వాటిల్లితున్నట్టు రైతులు వాపోతున్నారు. కాగా ఫిబ్రవరి 20న వంద కౌంట్‌ రూ.260 ఉండగా, 90 కౌంట్‌ రూ.270, 80 కౌంటు రూ.300, 70 కౌంట్‌ రూ.330, 60 కౌంట్‌ రూ.360, 50 కౌంట్‌ రూ.390, 40 కౌంట్‌ రూ.415 పలికేది. అయితే మార్చి 1వ తేదీన నుంచి 3వ తేదీ వరకు వంద కౌంట్‌ రూ.250 నుంచి రూ.230కి పడిపోయింది. 40 కౌంట్‌ రూ.400 నుంచి రూ.380కు పడిపోయింది. కానీ రైతుల నుంచి మాత్రం ఇంకా ధరలు తగ్గించి దళారులు తక్కువకు కొనుగోలు చేయడం వల్ల భారీగా నష్టపోతున్నారు.

*ఆక్వా రైతులను ఆదుకోవాలి*

ప్రస్తుతం ఉన్న ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంతో ఎదురుచూశాం. అయితే ఒక్కసారిగా మూడ్రోజుల్లో రూ.30 ధర తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

విద్యుత్‌ చార్జీలు, రొయ్య మేత ధర పెంపుపై రైతులను ఎగుమతిదారులు తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు. చిన్నాపెద్దా ఆక్వా సాగు చేసుకునే రైతులకు ఫీడ్ తక్కువ ధరకు సరఫరాచేసి ఉత్పత్తి సమయంలో ధరలను నిలకడగా ఉంచితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

Address

Rd No. 79, Jubilee Hills
Hyderabad
500033

Telephone

+919959077778

Website

Alerts

Be the first to know and let us send you an email when ABCD Business Solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share