10/10/2020
అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.
జడ్జి విషయమేంటని అడిగితే..??
ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్ మేన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు.
జడ్జి: దొంగతనం చేసావా .?
పిల్లాడు : అవును మేడం.
జడ్జి : ఏమీ దొంగతనం చేసావు.
పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్.
జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా.!
పిల్లాడు: డబ్బులు లేక తీసుకున్నాను మేడం.
జడ్జి: ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా.!
పిల్లాడు: అమ్మ మాత్రమే ఉన్నారు, అందులోనూ అనారోగ్యం అన్నాడు.
జడ్జి: ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు..!
పిల్లాడు: ఒక కారు షెడ్ లో పనిచేస్తుండే వాడిని మేడం!,
అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు.
జడ్జి: ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా.!
పిల్లాడు: ఉదయం నుండి యాభై మంది దాకా పని అడిగాను ఒక్కరుకూడా ఇవ్వలేదు.
సూర్యుడు అస్తమించేసాడు, ఇక ఏమీ చేయలేక ఈ పని చేశానని తల దించుకున్నాడు.
పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు.
ఈ రోజు ఈ పిల్లాడి పరిస్థితికి అందరం నేరస్థులమే నాతో సహా ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క స్నేహహస్తాన్ని అందించలేక పోయాము అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతిఒక్కరు ఇతడిని పట్టుకున్న పోలీసులు, నాతో సహా అందరూ 10 డాలర్ లు కట్టాలి ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళలేరు ఇక ఇతడిపై కేసు పెట్టిన షాప్ యజమాని 100 డాలర్ లు జరిమానా కట్టాలి.
ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి అని తీర్పు రాశారు.
ఆ పిల్లాడు అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు.
ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జి ని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు.
సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందించలేని ఆ స్నేహహస్తమే కారణం అని ఆ జడ్జి తల వంచుకున్నారు.
ఇంకా ఏదో ఒక మూల నీతి, నిజాయితీ బతికే ఉన్నదని ఇలాంటివారిని చూసినప్పుడే అనిపిస్తున్నది.
ఆకలి అన్నవారికి అన్నం పెడదాం.
ఆకలి విషయంలో అబద్ధం ఆడలేరు కదా ఎవరైనా.
🌹 🌹