Stock M∆rket # learn-earn

Stock M∆rket # learn-earn we provide daily free mcx tips on this page

u have intrested to learn about full stock market

భారీగా పెరిగిన వెండి ధర 🙄న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం వెండి ధర ఒక్కసారిగ...
31/01/2021

భారీగా పెరిగిన వెండి ధర 🙄

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం వెండి ధర ఒక్కసారిగా దాదాపు రూ.3వేలు పెరగడం విశేషం. అలాగే బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.132 పెరిగి రూ.48,376కు చేరింది. అలాగే క్రితం సెషన్‌లో రూ.65,495గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ. 2,915 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,844.35 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 26.35 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది

రివ్యూ: ఫౌజీ ఎలా ఉందంటే?సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్...
27/01/2021

రివ్యూ: ఫౌజీ ఎలా ఉందంటే?

సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్‌జీ’కీ పోటీగా ఓ గేమ్‌ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్‌ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ ప్రకటించింది

అదే ఇండియన్ పబ్‌జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్‌ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్‌ ఎలా ఉంది? పబ్‌జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా..

సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్‌జీ’కీ పోటీగా ఓ గేమ్‌ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్‌ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ ప్రకటించింది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?)

అదే ఇండియన్ పబ్‌జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్‌ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్‌ ఎలా ఉంది? పబ్‌జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా...

అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయింది. ఈ గేమ్ ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ ని ఓపెన్ చేసాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. క్యాంపెయిన్‌, టీమ్‌ డెత్‌ మ్యాచ్‌, ఫ్రీ ఫర్‌ ఆల్‌ అనే మూడు మోడ్స్‌ కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్‌డేట్స్‌ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పబ్‌జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది.

చేతులే ఆయుధాలు:
అయితే ఈ గేమ్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పట్టించుకునేంత కావు. ఉదా: మీరు ఒక గుడారంలో ఉంటే మీరు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఆటగాళ్లను కొట్టవచ్చు. అలాగే ప్రారంభ దశలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆటగాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని కొట్టడం లేదు. ఇందులో పబ్‌జీలో లాగా గన్స్ అందుబాటులో లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇవి కూడా కొన్ని స్టేజిలు దాటాక మీకు లభిస్తాయి. అప్పటి వరకు మీ శతృవులను మీ చేతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది

ఇందులో ప్రధాన పాత్రలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అయితే తను మిగతా తన తోటి సిబ్బందిని చైనా సైన్యం నుండి రక్షించుకోవాలి. గేమ్ లో ముందుకు వెళ్తున్నపుడు ఎనర్జీని పెంచుకోవడానికి పబ్‌జీలో లాగా డ్రింక్స్ ఏమి ఉండవు. కేవలం మనం భోగి మంటల దగ్గర కూర్చొని ఉంటే హెల్త్ పెరుగుతుంది. ఒక్కోసారి గేమ్ లో హెల్త్ అయిపోయిన దీని సహాయంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం గేమ్ లో చేతితో పోరాడే ఆయుధాలు కత్తి లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఆశించినట్టు తుపాకులు లేవు. తర్వాత మోడ్ లో తీసుకొస్తారేమో చూడాలి. ఈ కత్తి లాంటి ఆయుధంతో శత్రువులను చంపడం చాలా తేలిక అవుతుంది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అవి రెండు హత్యలకు మాత్రమే పరిమితం చేయబడతాయి.

సినిమాటిక్ లుక్స్
ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఏ దశలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్‌లో చూపిస్తుంటుంది. ఇందులో పాస్ ఆప్షన్ ఉండటం చేత రియల్ గేమ్ అనుభూతిని మనం మిస్ అవుతాం. అలాగే శత్రువులను కొట్టేటప్పుడు వారి చనిపోయేరో లేదో తెలిపే సూచికలు లేవు. అందువల్ల కొన్నిసార్లు మీరు వారు చనిపోయాక కొట్టాల్సి వస్తుంది. ప్రధానంగా గేమ్ ను సినిమాటిక్ లుక్స్ లో, ఇటీవలి గాల్వన్ సరిహద్దు సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో క్రమంగా చెక్‌పోస్టులను దాటేటప్పుడు మరింత కష్టమైంది అని చెప్పుకోవాలి. ఇందులో గేమర్స్ వారికీ ఇచ్చిన సమయంలో అన్ని దశలను పూర్తి చేయడం అంటే కష్ట్టమే అని చెప్పుకోవాలి. ఆట నిజంగా చాలా కష్టంగానే ఉంది. నేను, నా సహోద్యోగులు ఎవరూ కూడా ప్రస్తుతం అన్ని దశలను పూర్తీ చేయలేకపోయాము.

ఆట మీద నా అభిప్రాయం
ఈ గేమ్ ని ప్రధానంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు మనకు భాగా తెలిసిపోతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్‌ ఉండవు. అందుకే గేమ్ ఎక్కువ శాతం ఆసక్తిగా అనిపించదు. పబ్‌జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి.. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్‌ మోడ్‌తో ఈ గేమ్‌ పబ్‌జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్‌ లో పబ్‌జీలో లాగా మల్టి ప్లేయర్ సపోర్ట్ తీసుకొస్తే తప్ప ఏమైనా మార్పు ఉండొచ్చు. సాధారణ సమయాలలో చిన్న పిల్లలతో ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ‘గల్వాన్‌’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది.

మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్‌,,,😍ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగిం...
27/01/2021

మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్‌,,,😍

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్‌–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్‌ యెల్లన్‌ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి.

ఫలితంగా సెన్సెక్స్‌ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్‌ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు

19/10/2020
కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు ట్రంప్‌ ఆరోగ్య స్థితిగతులుఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలుఐటీ కంపెనీ టీస...
05/10/2020

కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు

ట్రంప్‌ ఆరోగ్య స్థితిగతులు

ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలు

ఐటీ కంపెనీ టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.
ఈ నెల 7న టీసీఎస్‌ ఫలితాలు....
మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్‌ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు.
మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు....
విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్‌ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్‌ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు.

మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్‌
సీఈవోలతో సీఐఐ సర్వే
క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్‌ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్‌ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్‌డౌన్‌ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్‌ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది.

సెప్టెంబర్‌ చివరివారంలో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, లాభాలతో ముగిసాయి. అయినా ఈ హెచ్చుతగ్గులన్న...
05/10/2020

సెప్టెంబర్‌ చివరివారంలో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, లాభాలతో ముగిసాయి. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 31 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. ఇక భారత్‌ స్టాక్‌ సూచీల సాంకేతిక అంశాలకొస్తే....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
గత నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 38,738 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,308 పాయింట్ల భారీ లాభంతో 38,697 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైతే 38,990 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 39,235–39,560 పాయింట్లశ్రేణి వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 40,010 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్‌ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 38,240 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 37,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 37,545 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.

నిఫ్టీ తక్షణ నిరోధం 11,535
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,428 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 367 పాయింట్ల లాభంతో11,417 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే, 11,535 పాయింట్ల వద్ద నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,590–11620 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని దాటితే తిరిగి 11,795 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,295 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,185 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,100 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది.

ట్రంప్‌నకు కరోనా:-వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్తలతో అమెరికా  మార్కెట్లు  కుప్...
04/10/2020

ట్రంప్‌నకు కరోనా:-

వాషింగ్టన్
: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. తనతోపాటు, భార్య మెలానియా ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ అయిందని ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు మొదలైన తరుణంలో ట్రంప్ వ్యాధి పరినపడటంతో రిపబ్లిక్‌ పార్టీ ఆందోళనలో పడిపోయింది. (కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు)

డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి,ఔన్సు దర 1,894.60 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడిన ప్రపంచ నాయకుల జాబితాలోతాజాగా ట్రంప్ చేరారు. ఇంతకుముందు బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారోకు కూడా ఈ వైరస్ సోకింది. తనకు వైద్యం చేసిన డాక్టరకు వైరస్ పాజిటివ్ రావడంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అలాగే భార్యకు కరోనా సోకడంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇంటినుంచే విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

కాగా రెండవసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఈసారి కాస్త వెనుకంజలో ఉన్నారని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతుండగా ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్‌ పార్టీ ధీమాగా ఉంది. అటు బైడెన్‌ కు తిరుగే లేదని, ముఖ్యంగా మహిళల ఆదరణ లభిస్తోందని, దీంతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు ప్రెసిడెన్షియల్‌ డిబేట్లలో విజయవంతంగా మొదటి డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

01/10/2020

11/09/2020

of the day....🖋

AGR బాకాయిల చెల్లింపునకు పదేళ్ల వ్యవధి2021 మార్చిలోగా 10 శాతం కట్టాలి టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ:...
02/09/2020

AGR బాకాయిల చెల్లింపునకు పదేళ్ల వ్యవధి

2021 మార్చిలోగా 10 శాతం కట్టాలి

టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల భారంతో కుంగుతున్న టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల వ్యవధినిచ్చింది. 2021 మార్చి 31లోగా బాకీలో 10 శాతం భాగాన్ని కట్టాలని ఆదేశించింది. ఆయా టెల్కోల మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీ) లేదా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవో) బకాయిల చెల్లింపునకు సంబంధించి నాలుగు వారాల్లోగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా, వడ్డీ విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇక దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు స్పెక్ట్రంను విక్రయించే అంశంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తుది ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. బాకీల లెక్కింపునకు సంబంధించి టెలికం శాఖ లెక్కలు, గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పేమీ ఉండబోవని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. వాస్తవానికి బాకీల చెల్లింపునకు టెల్కోలు, టెలికం శాఖ (డాట్‌) 20 ఏళ్ల వ్యవధికి అనుమతి కోరాయి. కానీ దాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు పదేళ్ల వ్యవధికి అనుమతించడం గమనార్హం.

వొడాఫోన్‌కు కష్టం.. ఎయిర్‌టెల్‌కు ఫర్వాలేదు..
సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల వ్యవధిలో బాకీలన్నీ కట్టాలంటే వొడాఫోన్‌ ఐడియాకు కష్టంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఎనిమిది శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఏటా భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 3,900 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 7,500 కోట్లు కట్టాల్సి వస్తుందని లెక్క వేసింది. ఒకవేళ వడ్డీ భారం గానీ లేకపోతే ఇది రూ. 2,600 కోట్లు /రూ. 5,000 కోట్లకు తగ్గవచ్చని వివరించింది. ఇంకా వడ్డీ రేటు విషయంలో నిర్దిష్ట ఉత్తర్వులేమీ లేవని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్‌ బ్రోకింగ్‌ విభాగం) హేమంగ్‌ జానీ తెలిపారు.

‘ఎయిర్‌సెల్, వీడియోకాన్‌ కట్టాల్సిన బాకీల భారం ఎయిర్‌టెల్‌పై పడదు. అలాగే ఆర్‌కామ్‌ బకాయిల భారం రిలయన్స్‌ జియోపై ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎయిర్‌టెల్, రిలయన్స్‌లకు సానుకూలమైనవే కాగలవు‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్‌ గడువులోగా లైసెన్సుల వ్యవధి ముగిసిపోయే టెలికం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కేఎస్‌ లీగల్‌ అండ్‌ అసోసియేట్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సోనమ్‌ చంద్వాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెల్కోలు లైసెన్సును రెన్యువల్‌ చేసుకోవడంలో విఫలమైతే పదేళ్ల వ్యవధి కన్నా ముందే బకాయి మొత్తం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఏం జరిగింది..
సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీలను కేంద్రానికి టెలికం సంస్థలు కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. డాట్‌ లెక్కించిన దాని ప్రకారం టెల్కోలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు పైచిలుకు కట్టాల్సి ఉంది. అయితే, తమ సొంత లెక్కల ప్రకారం తమ బాకీలు అంత భారీ స్థాయిలో లేవంటూ టెల్కోలు కొంతమేర కట్టాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున మిగతాది కట్టేందుకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కోరాయి.

అటు టెలికం శాఖ కూడా 20 ఏళ్ల వ్యవధినివ్వడంపై ఈ ఏడాది మార్చిలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. వాయిదా పద్ధతిలో బాకీలు చెల్లించడంపై జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి ఉంచింది. అయితే, బాకీ మొత్తం విషయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులేమీ ఉండబోవంటూ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో టెలికం కంపెనీల గత పదేళ్ల ఖాతాలు సమర్పించాలని సూచించింది. అటు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ జియో మధ్య స్పెక్ట్రం షేరింగ్‌ ఒప్పందం వివరాలు కూడా ఇవ్వాలని ఆగస్టు 14న సూచించింది. తాజాగా బాకీల చెల్లింపు వ్యవధి విషయంలో ఆదేశాలు జారీ చేసింది.

Stock M∆rket  # learn-earn.Learn about Market ,Invest in stock market,Get good returns every month app :9550156731
02/09/2020

Stock M∆rket # learn-earn.

Learn about Market ,Invest in stock market,
Get good returns every month
app :9550156731

31/08/2020

Learn-earn..
now with us.......

Address

Jayanagar
Khammam
507002

Website

Alerts

Be the first to know and let us send you an email when Stock M∆rket # learn-earn posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Stock M∆rket # learn-earn:

Share