04/04/2025
బొమ్మ టెక్నికల్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ…
ఖమ్మం నగరంలోని బొమ్మ కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే నేషనల్ టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ పోస్టర్ను కలెక్టర్ ముజమ్మిలాఖాన్ ఆవిష్కరించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కోర్సుల పరిధిలో పలు అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజే స్తామని చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.