Shafi Legal Services

Shafi Legal Services Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shafi Legal Services, Business service, Hyderabad, Kukatpally.

16/01/2026

Wishes

20/07/2025

💥💥💥💥💥💥💥💥💥💥

*అది కుక్క కాదు, మేకగా నిర్ధారణ చేసిన తాజా ఢిల్లీ హైకోర్టు తీర్పుని స్వాగతిద్దాం!*
*****************************
*మరి మనుషుల్ని కరిచే పిచ్చికుక్కగా దేశప్రజల మనస్సుల్లో చిత్రించిన ఆ నేరం మాటేమిటి?*
*****************************
(నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగి జమాతే మత సభ కరోనా వ్యాప్తికి పన్నిన కుట్రగా మోపిన కేసును ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసిన సందర్బంగా ఓ ప్రతిస్పందన & వ్యాఖ్య)

అది 24-3-2020 తేదీ! ఆ రాత్రి మోడీ లాక్ డౌన్ ప్రకటన ప్రసారమైనది. అంతవరకూ సోకని కరోనా భయాన్ని మనలో పుట్టించింది. మబ్బులు లేకుండానే కుంభవర్షం, ఉరుములు లేకుండానే పిడుగులు చందంగా లాక్ డౌన్ వేసింది. భయం గుప్పెట్లోకి దేశం వెళ్ళింది. ఒక ఊరుకు మరో ఊరు మనుషులు వెళ్లే పరిస్థితి లేదు. ఓ వీధి వాళ్ళు మరో వీధి వెళ్లడం నేరమై పోయింది. పొరుగు ఇళ్లకి వెళ్లే స్థితి లేదు. మనిషికి మనిషే శత్రువైన స్థితి! అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ల మీడియా పై ఆధారపడే స్థితి! పనులు ఏవీ, కాలక్షేపమైనా, అది మత్తు పదార్థమైనా వృధా కార్యమైనా మిగిలిన వెంటిలేషన్ కార్పొరేట్ మీడియా! సరిగ్గా ఆ సమయంలో...

బ్రేకింగ్ న్యూస్!

హార్ట్ బ్రేకింగ్ న్యూస్!

మైండ్ బ్రేకింగ్ న్యూస్!

ఇప్పుడే అందిన వార్త!

అదిగిదిగో పెద్దపులి!

ఇదిగిదిగో దాని తోక!

ఇదీ గోదీ మీడియా తీరు!

తమ చెప్పుచేతుల్లోని టీవీల ఎదుట దేశ ప్రజల్ని అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్లు కూర్చోబెట్టి భయపెడుతోన్న పాడు కాలంలో ఇలా రక్తి కట్టించే శీర్షికలతో చెత్త వార్తల్ని దేశ ప్రజల మెదళ్ళల్లోకి ఎక్కిస్తూ గోదీ మీడియా బుర్రల్ని ఎలా ఖరాబు చేసిందో తెలిసిందే!

మీడియా ఛాంబర్లే ఉగ్ర శిబిరాలై ముస్లిమ్స్ పైకి హిందువుల్ని రెచ్చగొట్టిన తీరుతెన్నులు తెల్సిందే!

నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగి జమాతే మత సమ్మేళనమే నేరకుట్రగా, నిర్వాహకులు కరోనా వ్యాప్తిదార్లుగా ఎలా ఊదరగొట్టారో తెల్సిందే!

కోవిడ్ వ్యాప్తికి పన్నిన కుట్రగా ఈవిగో సాక్ష్యాలు, అల్లదిగో ఆధారాలంటూ అర్ణవ్ గోస్వామి గాడిద అరుపులు తెల్సిందే!

ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడమే సమకాలీన చరిత్రలో ఓ పరమ కుట్ర!

2020 జనవరి చివరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై తొలి హెచ్చరిక చేసినా నిర్లక్ష్యం చేసిన తీరే ఒక పెద్ద కుట్ర!

గుజరాత్ లో ట్రంప్ సమ్మేళనం వరకూ...

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ మార్పిడి వరకూ...

NRC వ్యతిరేక ఉద్యమ క్రూర అణచివేత కోసం ఈశాన్య ఢిల్లీలో కుట్ర పన్నే వరకూ...

కోవిడ్ నివారణ చర్యల్ని నిర్లక్ష్యం చేయడం కుట్ర!

రోజు కూలోళ్ళు కూలికి వెళ్ళకుండా 21 రోజులు ఇళ్లల్లో బందించడం కుట్ర!

పొలాలు, హలాలు, దుక్కి, సాగు, కొడవళ్ళు, సైరన్లు, రైళ్లు, బస్సులు, ట్రక్కులు, మగ్గం, పగ్గం బంద్ చేసి కొవ్వొత్తులు వెలిగించి చప్పట్లు కొట్టించడం పెద్ద కుట్ర!

పసిపిల్లలకి పాలపొడి సైతం అందకుండా ఇళ్లల్లో బంధించి కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయుతీలు ఇవ్వడం కుట్ర!

140 కోట్ల మంది ప్రజల్ని చీకటి జీవితాల్లోకి నెట్టి, కార్పొరేట్ల కోసం కరోనా చీకటి కాలంలోనే మూడు వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్స్, ఇంకా ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లుల్ని చర్చ లేకుండా పార్లమెంట్ లో ఆమోదించడం కుట్ర!

లాక్ డౌన్ కుట్రతో పాటు ఆ కాలపు మోడీ సర్కార్ కుట్రల జాబితా పెద్దదే!

తమ కుట్రల్ని కప్పిపెట్టి ముస్లిం మతాన్ని బలి పశువు చేయడం కుట్ర!

నిజాముద్దీన్, మర్కజ్ ముస్లిం మత సమ్మేళనం కోవిడ్ వ్యాప్తికి ఓ కుట్రగా ప్రజల్ని రెచ్చగొట్టింది.

ఆ మత సమ్మేళనానికి కోవిడ్ సోకిన విదేశీ మత గురువులు తెచ్చి, వారి ద్వారా హిందువులకు కోవిడ్ వ్యాప్తి చేసే కుట్రగా ప్రచారం చేయించింది.

ఆ ప్రచారంతో సాధారణ హిందువుల్లో నాడు ఎన్ని అపోహలు ఏర్పడ్డాయో!

ముస్లిమ్స్ ఇళ్ల పై ఎన్ని దాడులు జరిగాయో!

యూపీ, ఢిల్లీల్లో ముస్లిం నివాసాలపై ఫాసిస్టు మతోన్మాద మూక దాడులు జరిగాయో!

మెట్రోపాలిటీన్ నగరాల్లో అపార్ట్మెంట్స్, కాలనీలలో ముస్లిమ్ కుటుంబాలెన్ని సాంఘిక బహిష్కరణకి గురయ్యాయో!

లాక్ డౌన్ సడలింపు తర్వాత పొట్ట పోషణ కోసం కూలి పనులకు బయటకి వచ్చిన ముస్లిం శ్రామికుల పై ఎన్ని భౌతిక దాడులు జరిగాయో!

ఉత్తరాది రాష్ట్రాలలో పండ్లు, కూరగాయల వెండర్స్ కి, ముస్లిం ఆటో, ట్రక్కు డ్రైవర్లకు ఎన్ని రకాల భౌతిక దాడులు ఎదురయ్యాయో!

రోడ్లపై నడవడానికి సైతం ముస్లిమ్స్ తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎలా వణకి పోయారో!

అవి పీడ కలలు కాదు. నిజంగా అనుభవించిన వాస్తవ విషాద గాధలు!

తాము చేయని నేరానికి బలిపశువులైన చరిత్ర!

ఓ వారంలో 64 నెలలు నిండనున్న సందర్బంగా 17-7-2025 న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మూడురోజులైనది. గోదీ మీడియా వ్యూహత్మక మౌనం వహించింది. ఇది కూడా ఓ పరమ కుట్ర!

కోవిడ్ కుట్రదార్లుగా ఆరోపిస్తూ నాటి ముస్లిం సమ్మేళనం నిర్వహించిన 70 మంది మీద 16 FIR లు పోలీసులు నమోదు చేశారు. ఎందరు జైళ్లకు వెళ్ళారో! ఎన్ని బాధలు పడ్డారో! ఎన్ని మానసిక వేదనలు భరించారో!

గత గురువారం ఢిల్లీ హైకోర్టు 76 FIR లను కొట్టివేసింది. ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వారు నిర్దోషులని స్పష్టం చేసింది.

తీర్పు ఇచ్చిన మహిళా జడ్జి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఓ ముస్లిం కాదు. ఓ విప్లవవాది కాదు. ఓ కమ్యూనిస్టు కాదు. ఓ రాజ్యాంగవాదిగా తీర్పు ఇవ్వడం గమనార్హం!

మత పెద్దల వివరణల్ని తీసుకోవాలనే కనీస నీతి కూడా పాటించకుండా, విశ్వసనీయ వార్తల పేరిట మోడీ సర్కార్ ఫాసిస్టు ఎజెండాలో భాగంగా గోది మీడియా నిరపరాదుల్ని దేశప్రజల్లో పెద్ద నేరస్తుల్ని చేసింది. తానే జడ్జి పాత్ర పోషించింది. అది నూటికి నూరుపాళ్ళు తప్పంటూ ఇప్పుడు అసలు తీర్పు వెలువడింది.

మత సమ్మేళన కర్తలే కాకు ఇరవై కోట్ల మంది ముస్లింలు అనుభవించిన భౌతిక, నైతిక, రాజకీయ, మానసిక గాయాల మాట ఏమిటి? వారి నష్టాలను ఎవరు భర్తీ చేయగలరు? మానసిక గాయాలను ఎవరు మాన్పించగలరు?

ఈ తీర్పు తర్వాతనైనా తప్పు గుర్తించి వాస్తవాన్ని అది ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నిద్దాం. అది మీడియాపై భ్రమలు గల సామాన్య ప్రజలలో స్వానుభవ చైతన్యం కలిగించడం కోసమే. వారి మనస్సుల్లో భ్రమలను తొలగించడం కోసమే. మనమే గోదీ మీడియా పట్ల భ్రమలతో కాదు.

హిందూ ముస్లిం ప్రజల మధ్య ద్వేషం రెచ్చగొట్టే బడా కార్పొరేట్ ఫాసిస్టు ఎజెండాను బట్టబయలు చేసే లక్ష్యానికి తీర్పుని ఓ సాధనంగా మారుద్దాం.

రాజ్యాంగేతర ఫాసిస్టు శక్తుల కుట్రల్ని రాజ్యాంగ బద్ద కోర్టుల తీర్పులతో ఇటీవల బట్టబయలయ్యే ఉదాహరణలు తెల్సిందే! ఐతే ఫాసిస్టు కుట్రలకు జరిగే విస్తృత ప్రచారం అవి ఓటమి పొందిన సందర్భాలలో జరగడం లేదు. ఈ సందర్బంగా కూడా అదే జరిగింది.

తాజా ఢిల్లీ హైకోర్టు తీర్పుకు కూడా విస్తృత ప్రాచుర్యం కల్పిద్దాం.

చిన్న వార్తా పత్రికలతో పాటు స్థానిక దిన, వార పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు, పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి ప్రత్యామ్నాయ ప్రచార, ప్రసార సాధనాల ద్వారా వీలైనంత విస్తృతంగా ప్రచారం చేపడదాం.

(ఈ తీర్పు పై గూగుల్ ఆధారంగా సేకరించిన రెండు ఆంగ్ల న్యూస్ ఆర్థికల్స్ ని సమాచారం కోసం పంపిస్తున్నా)

*✍️ఇఫ్టూ ప్రసాద్ (పిపి)*
*20-7-2025*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

18/07/2025
My new car
11/07/2025

My new car

Today attended Bombai High Court
08/07/2025

Today attended Bombai High Court

https://youtu.be/pcM20ISQLzk?si=qSJMBzPmgfcPLuBT
19/06/2025

https://youtu.be/pcM20ISQLzk?si=qSJMBzPmgfcPLuBT

మంగ్లీ అన్నీ తెలిసే చేసిందా? సింగర్ మంగ్లీ చీకటి బాగోతం | Singer Mangli Dark Secret | Advocate YakubThe controversy surrounding popular singer Mangli and her...

Address

Hyderabad
Kukatpally

Telephone

+919704316011

Website

Alerts

Be the first to know and let us send you an email when Shafi Legal Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shafi Legal Services:

Share