01/09/2025
భారతీయ గోవులను, సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవాలనే ధ్యేయంతో చేపట్టిన గో ధర్మ ప్రచార కార్యక్రమానికి స్వాగతం।
భారతీయ గో ధర్మ సూత్రాలు, సంస్కృతి, సంప్రదాయ, ఆచార వ్యవహారాలు ప్రపంచంలోనే అత్యుత్తమ శాస్త్రీయ జీవన విధానాలు। ఇవి వేద, అంతరిక్ష, ఖగోళ, భౌతిక, రసాయన, జీవ శాస్త్రధర్మాల సమ్మిళితం। జీవకోటి, మానవ మనుగడకు, ప్రకృతి పరిరక్షణకు అత్యంత ప్రధానమైనవి। సాంకేతిక, పర్యావరణ, వైద్య, ఆహార, ఆరోగ్యపరంగా అత్యంత ఉన్నతమైనవి। ఆర్ధిక, సామాజిక, సాంఘిక, కుటుంబ సంక్షేమ వ్యవస్థల అభివృద్ధికి అత్యవసరమైనవి। కనుమరుగవుతున్న ఈ సనాతన భౌతిక గో ధర్మాలను పునరుద్ధరించటం, నేటి తరం బాలలకు తెలియచేయటం, ఉత్తమమైన భారతీయ జీవన విధానాన్ని అందించటంమే గో ధర్మ ప్రచార ముఖ్య ఉద్దేశ్యం।