Freelance Workforce Corp:: Outdoor Advertising & Business Consultancy

Freelance Workforce Corp:: Outdoor Advertising & Business Consultancy It is service oriented center and Business consultancy center.It purely Outdoor advertising activit

అందరికి ఉపయోగపడే పోస్ట్ తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి.
23/03/2023

అందరికి ఉపయోగపడే పోస్ట్ తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి.

17/03/2023
02/06/2022
14/04/2022

జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్*
ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య సంఖ్యలు
1. రక్తపోటు: 120/80
2. పల్స్: 70 - 100
3. ఉష్ణోగ్రత: 36.8 - 37
4. శ్వాసక్రియ: 12-16
5. హిమోగ్లోబిన్: పురుషులు (13.50-18)
ఆడవారు ( 11.50 - 16 )
6. కొలెస్ట్రాల్: 130 - 200
7. పొటాషియం: 3.50 - 5
8. సోడియం: 135 - 145
9ట్రైగ్లిజరైడ్స్: 220
10. శరీరంలో రక్తం మొత్తం: 5-6 లీటర్లు
11. చక్కెర: పిల్లలకు (70-130)
పెద్దలు: 70 - 115
12. ఐరన్: 8-15 మి.గ్రా
13. తెల్ల రక్త కణాలు: 4000 - 11000
14. ప్లేట్‌లెట్స్: 150,000 - 400,000
15. ఎర్ర రక్త కణాలు: 4.50 - 6 మిలియన్లు..
16. కాల్షియం: 8.6 - 10.3 mg/dL
17. విటమిన్ D3: 20 - 50 ng/ml (మిల్లీలీటర్‌కు నానోగ్రామ్‌లు)
18. విటమిన్ B12: 200 - 900 pg/ml
మీకు దాహం అనిపించకపోయినా లేదా అవసరం లేకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి ... అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీరు లేకపోవడం.
మీరు మీ ప్రాధాన్యతలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు కూడా క్రీడలు ఆడండి... శరీరాన్ని తప్పనిసరిగా కదిలించాలి, కేవలం నడక ద్వారా లేదా ఈత ద్వారా... లేదా ఏ రకమైన క్రీడలు అయినా.
🫑🫑🫑
విపరీతమైన ఆహార కోరికలను వదిలేయండి...ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాలను తగ్గించండి.
వీలైనంత వరకు, అత్యవసరమైతే తప్ప కారును ఉపయోగించవద్దు...
కోపం వదలండి...
🙏మహేష్💐💐💐

 #స్ఫూర్తిదాయకమైన_సందేశం #కథ "మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను..! నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగ...
13/07/2021

#స్ఫూర్తిదాయకమైన_సందేశం

#కథ

"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను..! నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."

"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి విశేషం" అడిగాను.

"మా అమ్మాయి సుధ తెల్సుగా సుధ. దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు.
అందుకని.. దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.. "అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది.

సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగి పోతోంది.

క్షణం తర్వాత లోపల్నించి మాటలు వినబడుతున్నాయి.
" తొలి జీతం కదా. నాన్న గారికి ఇవ్వమ్మా"

"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది.

అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది.

" తప్పే.. అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు
ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు.వెళ్ళు.. వెళ్ళి జీతం ఇచ్చిరా పో"

"ఏంటమ్మా.. ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను.
ఆ టేబుల్ మీద పెడతా.. వచ్చి తీసుకోమను."

ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు. చెంప ఛెళ్ళుమన్న శబ్దం.

"అమ్మా"

"ఛీ..ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకోలేకపోతోంది తల్లి.

" అమ్మా.. ఎంతసేపూ.. నీ వైపునుండి ఆలోచించడమేనా.. నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…"
"చెప్పేడు .."
"అమ్మా.. చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న
ఆఫీసుకి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా.. అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ.

అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో " అమ్మా సుధా.. నా తల్లీ " అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు.

అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళనిండా నీళ్ళు. తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు.

"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మనకన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు దేవుడికి పువ్వులు, పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అది మన సంస్కృతి. మన సంప్రదాయం.

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదాన్ని 100% నమ్మొచ్చు.... ------------------------------------------------------------ *ఒక కెమ...
21/05/2021

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదాన్ని 100% నమ్మొచ్చు....
------------------------------------------------------------
*ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి విశ్లేషణ*

సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం...
ఒక సైన్స్ విద్యార్థిగాకాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా...
సైన్స్ పేరిట ఆయుర్వేదంపై దుష్ప్రచారం చేయొద్దు.. ?

ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద విశ్వవిద్యాలయాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద ,వల్లాభీ , విక్రమశీల లాంటి అనేక బౌద్ద విధ్యాలయాలు...
వేల సంవత్సరాల క్రితమే శరీరధర్మ శాస్త్రం , ప్రకృతి శాస్త్రం , ఆయుస్సును ఇచ్చే విజ్జానం ఆయూష్ విజ్ఞానం మీద అనేక పరిశోధనలు చేసి మానవజాతికి ఆరోగ్య బిక్ష పెట్టారు. ఈ రోజు విజ్జానానికి ఊహకు అందని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క మీద పరిశోధనలు చేసి వాటి గూర్చి క్లుప్తంగా మూడు వేల సంవత్సరాల క్రితమే బోధించారు...
మూడువేల సంవత్సరాల క్రితమే బుద్దుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శస్త్ర చికిత్సలు చేశాడు. బ్రైన్ సర్జరీ కూడా చేశాడు.
దేనికి ఏవిడెన్స్ కావాలి ? ఆయుర్వేదానికా...
సరే నీవు నమ్ముతున్న సైన్స్ ఎవిడెన్స్ ఇస్తున్న వైధ్యం గూర్చి నీకు తెలుసా...???
WHO ప్రమాణాలతో తయారు చేస్తున్న ఏ ఒక్క ఔషదానికైనా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు అని నిరూపించండి చూద్దాము. అప్పుడు సైన్స్ అందులో అల్లోపతి సైన్స్ గూర్చి మాట్లాడదాము...
_____________ ఈ విషయాలు తర్వాత చూద్దాము.
ప్రస్తుత కృష్ణపట్నం ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న ఆయూర్వేదిక్ మందు గూర్చి మాట్లాడదాము...
ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు...
1) అల్లం - అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది.
2) తాటిబెల్లం - ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషదంగా ఉపయోగెంచడానికి ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు.
3) తేనే - తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.
4 ) నల్లజిలకర్ర - ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
అలసట , బలహీనతలను తగ్గిస్తుంది.
నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.
తేనే , నల్లజీలకర్ర , వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.
నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం ,పోటాషియం ,పాస్ఫరస్ ,జింక్ ,మాంగనీస్ ,కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి.
నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.
నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.
నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.
5 ) తోకమిరియాలు- ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు , దగ్గు , కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.
6) లవంగాలు - లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు జలుబు ,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
7) వేప - వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.
వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది.
వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
దగ్గు , ఆస్తమా , కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.
వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ , మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది.
వేపను కడుపునొప్పి , అతిసారం ,గ్యాస్ , అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
8) నేరేడు - ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు
జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు.
ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది. అధిక రక్తపోటు ను నివారిస్తుంది.
9) మామిడి - కడుపులో పురుగులను తొలగించడానికి , జ్వరాన్ని తగ్గించడానికి , కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.
10) నేల ఉసిరి- వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.
11) కొండపల్లేరు - ఆయాసం , ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.
12) కుప్పింటాకు - రోగనిరోధక శక్తిని పెంచడానికి , దగ్గు ,జలుబు , గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి , కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు.
13) తెల్లజిల్లేడు పువ్వు : దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
14) పట్టా , 15) బుడ్డబుడస ఆకు , 16 ) ముళ్ళ వంకాయ గూర్చి నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
ఆనందయ్య తయారుచేసిన ఔషదం కరోన రోగులకు 100% ఉపయోగపడుతుంది.

14/01/2021
12/01/2021

నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో

Address

Nidadavole
534301

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919491133268

Website

Alerts

Be the first to know and let us send you an email when Freelance Workforce Corp:: Outdoor Advertising & Business Consultancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Freelance Workforce Corp:: Outdoor Advertising & Business Consultancy:

Share