Sri giri sannidhi handy crafts

Sri giri sannidhi handy crafts Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri giri sannidhi handy crafts, Wholesale & Supply Store, oop. ankalamma temple , shop no-21, pg Road, Srisailam.

గోమతి చక్రాల విశిష్టత ...?గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లే...
30/09/2020

గోమతి చక్రాల విశిష్టత ...?
గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి. వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు. గోమతిచక్రం నత్తగుళ్ళని పోలి ఉంటుంది కాబట్టి వీటిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుకభాగం ఉబ్బెత్తు గాను, ముందుభాగం చదరం (ఫ్లాట్) గాను ఉంటుంది. వృషభ రాశి, రోహిణి రాశులు శుక్రగ్రహానికి చెందినవి, శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వల్ల ఈ చక్రాల ఉపయోగం అనేకం, అనంతం, అత్యంత శ్రేష్ఠం అని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారణం కావడం వలన గోమతి చక్రాన్ని ధరించడం వల్ల అనేక శ్రేష్టమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయి. గోమతిచక్రలు రెండు రంగులలో లభిస్తాయి తెల్లనివి, ఎరుపువి. తెలుపురంగు గోమతిచక్రాలను అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ధరించడానికి ఉపయోగపడతాయి. ఎరుపురంగు గోమతి చక్రాలు వశీకరణం, శత్రునాశనం, క్షుద్రపూజలకు, తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగించాలి. గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడం, వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబరచకపోవడం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణ వల్ల నివారింపబడతాయి.
గోమతి చక్రాల పూజా విధానం

గోమతి చక్రాలను సిద్ధం చేసుకుని వాటిని ముందుగా గంగాజలం లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని పరిశుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి, గోమతిచక్రాలను 'శ్రీయంత్రం' లేదా 'అష్టలక్ష్మీ యంత్రం' తో పీఠంపై అమర్చుకోవాలి. గోమతి చక్రాల పూజను శుక్రవారం రోజు, దీపావళి రోజు లేదా వరలక్ష్మీవ్రతం రోజు చేసుకుని మనకు కావలసిన సమయాలలో తీసుకుని ఉపయోగించవచ్చు. గోమతి చక్రాలను లలితా సహస్ర నామాలను జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. పూజ పూర్తయిన తరువాత గోమతి చక్రాలను ఎఱ్ఱని బట్టలో కాని, హనుమాన్ సింధూరంలో కానీ పెట్టుకోవాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు బీరువాలో భద్రపరచుకోవాలి.

గోమతి చక్రాల ఉపయోగాలు ?

1) ఒక గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వల్ల మనుషులలోని రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి లభిస్తుంది.
గోమతిచక్రాన్ని లాకెట్ రూపంలో ధరిస్తే నరదృష్టి బాధలనుండి విముక్తి కలుగుతుంది, బాలారిష్ట దోషాలు కూడా సమసిపోతాయి.

2). రెండు గోమతిచక్రాలను బీరువాలో కాని పర్సులో కాని ఉంచినట్లయితే ధనాభివృద్ధి కలిగి ఎప్పుడూ ధనానికి లోటు ఉండడు.
రెండు గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే' పరుపు క్రింద కాని దిండు క్రింద కాని ఉంచినట్లయితే వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

3). మూడు గోమతి చక్రాలను బ్రాస్ లెట్ లా చేసుకుని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహకారం లభిస్తుంది.
మూడు గోమతి చక్రాలను మన దగ్గర అప్పుగా తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వని వారి పేరు మూడు గోమతిచక్రాల మీద అతని పేరువ్రాసి నీటిలో వేయటం కాని వాటిని వెంట పెటుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా యిచ్చే అవకాశం ఉంటుంది. (ఈ ప్రయోగాన్ని మంగళవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
4). నాలుగు గోమతి చక్రాలను పంట భూమిలో పొడిచేసి కాని మామూలుగా కాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.
నాలుగు గోమతి చక్రాలను గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో భూమిలో స్థాపించడం వలన ఆ ఇళ్ళు త్వరగా పూర్తయి అందులో నివశించే వారు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు.
నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారింప బడతారు.
5). ఐదు గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకి కట్టడం వలన గర్భం నిలుస్తుంది.
ఐదు గోమతి చక్రాలను చదువుకునే పిల్లల పుస్తకాల దగ్గర ఉంచడం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.
ఐదు గోమతి చక్రాలను నదిలో కాని జలాశయంలో కాని విసర్జన చేస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది.
6). ఆరు గోమతి చక్రాలను అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.
ఆరు గోమతి చక్రాలు ఇంట్లో ఉంచుకుంటే శత్రువులపై విజయం సాధించవచ్చు, కోర్టు గొడవలు ఉండవు, ఉన్నా విజయం సాధిస్తారు.
7). ఏడు గోమతి చక్రాలు ఇంటిలో ఉండడం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి.
ఏడు గోమతిచక్రాలను నదిలో విసర్జన చేసిన దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.
8). ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు.
9). తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండడం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. ఆ ఇంట్లోని వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు.
10) పది గోమతి చక్రాలు ఆఫీసులో ఉండడం వలన ఆ సంస్థకి అమితమైన గుర్తింపు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి, వారు సమాజంలో గొప్ప పేరుప్రఖ్యాతలతో గుర్తింపబడతారు.
11). పదకొండు గోమతి చక్రాలు లాభ లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచడం వలన ఎటువంటి వాస్తుదోషా, శల్యదోషాలు ఉండవు.
12). పదమూడు గోమతి చక్రాలను శివాలయంలో దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
13). ఇరువైఏడు గోమతిచక్రాలను వ్యాపార సముదాయంలో ద్వారబంధానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం ద్వారా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.
14). జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నవారు పంచమస్థానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి కాని, సాంగత్యం కాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలకు పూజించడం గాని, దానం చేయడం గాని, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించడం చేయాలి.contact -9966480262

లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల" తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలన...
14/08/2020

లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల" తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను ‘కలువలు’ అని కూడా అంటారు. తామరలకు ‘పుత్రజీవి’ అను పేరు కలదు. తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకొని కొద్దిగా వేడి చేసిన ఆవు పాలతో త్రాగవలెను. ఈ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును. తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది. స్పటికమాల, పగడాల మాలకంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. “ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా.” అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి. చేతిలో ధనం నిలబడని వారు తామరమాలతో జపం చేసిన ధరించిన ఐశ్వర్యం, ధనం, స్ధిరాస్తులు పొందగలరు. తామరమాలతో అమ్మవారి పఠాన్ని గాని, విగ్రహాన్ని గాని, శ్రీయంత్ర మేరువుని గాని అలంకరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు. దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. సకలైశ్వర్య ప్రదాయిని, శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. మహాలక్ష్మిని కమలవాసిని అని కూడా అంటారు. వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్య వలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు శుకాశ్రామాన్ని చేరి స్వర్ణముఖీ నదీ తీరాన సరోవరం నిర్మించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మ పురాణం తెలుపుతుంది. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జన్మించిన పద్మావతి లేదా అలమేలు మంగ. తమిళంలో అలర్‌ అనగా పువ్వు. మేల్‌ అనగా పైన. మంగై అనగా అందమైన స్త్రీ - అలమేలు అనగా పద్మంలో ప్రకాశించున సుందరి. చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలెన స్త్రీమూర్తి అని అర్థం. సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. తామర విత్తనాలను పద్మ, కమల, లోటస్ విత్తనాలని కూడ అంటారు. లక్ష్మీదేవి స్వరూపమైనతామర విత్తనాలు సహజ సిద్దమైనవి. తామరవిత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు, పటాలకు, శ్రీచక్రాలకు అలంకరించటం మంచిది. తామరమాలను జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు మెడలో దరించటం గాని, జపంచేయటం గాని చేస్తే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. తామర విత్తనాలు లక్ష్మీ, శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి. తామర విత్తనాలు, తామరమాలతో పూజ చేస్తే దనాభివృద్ధి కలుగుతుంది. జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, గొడవలు, అపోహలు ఉంటాయి. ఇలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి భాదలు ఉండవు. దీపావళి రోజున "ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా". అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి.

13/08/2020

శుక్రగ్రహ దోష నివారణకు "ఇంద్రాణి లాకెట్"

జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. శుక్రుడు వివాహం, సౌఖ్యత కారకుడు. దాంపత్య జీవితంలో గొడవలు, సౌఖ్యత లేనివాళ్ళు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. వివాహం కాని స్త్రీ, పురుషులు ఇంద్రాణి లాకెట్ దరిస్తే వివాహం తొందరగా జరుగుతుంది.

శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నా లేక వ్యతిరేకంగా ఉన్నా అట్టి జాతకుని సామర్థ్యాలు బయటి ప్రపంచానికి తెలియవు. ఎక్కడా అవకాశాలు రావు. తన సామర్థ్యము మీద తనకే నమ్మకము పోతుంది. ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేసి లేక వారి దగ్గర సహాకులుగా స్థిరపడి వాళ్ళ పురోగతికి వీళ్ళు సోపానాలు అవుతారు. జీవితములో ఏదో సాథించాలని తాపత్రయ పడి అన్నిరకాలుగా శక్తి సామర్థ్యాలు, క్రియేటివిటీ ఉండి అనేక సంవత్సరాలు అవకాశము కోసము ఎదురుచూసి ఏ రకమైన ప్రయోజనము పొందలేక జీవితములో ఓడిపోతారు.

కొందరి జాతకములో శుక్రుడు అఖండంగా యోగిస్తాడు. కానీ ఆ యోగాన్ని నిలబెట్టలేడు. గొప్ప కళాకారుడిగా రాణించి, కీర్తిప్రతిష్టలు సంపాదించి అత్యున్నత స్థానములో వెలిగిపోతారు. కానీ మద్యపానానికి అలవాటుపడి మద్యమే జీవితమై సర్వం కోల్పోతారు. ప్రాణనష్టం కూడా సంభవించవచ్చు. లేని పక్షములో జీవిత చరమాంకములో తిండికి, బట్టకి నానా ఇబ్బందులూ ఎదుర్కుంటారు.

పేకాటలో, గుఱ్ఱపు పందాలలో నష్టపోవడము మాత్రము శుక్ర గ్రహ ప్రభావము వల్ల మాత్రం కాదు. ఓ స్త్రీకి బానిసై, వృత్తి, ఉద్యోగాలు, కెరియర్ అన్నీ నిర్లక్ష్యము చేసి సంపాదించినదంతా ఖర్చుపెట్టి దివాలా తీస్తారు. ఇది శుక్ర గ్రహ ప్రతికూల ప్రభావం మాత్రమే. జాతక రీత్యా శుక్రుడు బాగా లేకపోతే స్త్రీలవల్ల అష్టకష్టాలు, నిందలు సంభవిస్తాయి. స్త్రీలోలుడిగా అపఖ్యాతి సంభవిస్తుంది.

శుక్రుడు అనుకూలముగా ఉంటే ఎంతటి వ్యభిచారము చేసే వాడయినా అతని లీలలు వెలుగులోనికి రావు. సహోదరీ వర్గం స్థిరాస్థులను సంగ్రహిస్తారు. కోర్టుకు లాగి మరీ ఆస్తులు దక్కించుకుంటారు. చేసిన మేలును మరుస్తారు. రక్త సంబంథమే లేనట్లు ప్రబల శత్రువర్గముగా మారిపోతారు.

వ్యాపారంలో అభివృద్ధి లేని వారు, ఒడుదుడుకులు ఉన్నవారు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. లలిత కళలలో రాణించాలని అనుకునే వాళ్ళు, కావ్య రచన చేయువారు, సంగీతం, నాట్యం, కవిత్వం, జ్యోతిష్యం, రత్న వ్యాపారం చేయువారు ఇంద్రాణి లాకెట్ ధారణ చేయాలి.

సంసార సౌఖ్యత లేనివారు ఇంద్రాణి లాకెట్ ధరించాలి. కంటిలో రేటినాకు శుక్రుడు కారకుడు కావున దృష్టి లోపం ఉన్నవారు ఇంద్రాణి లాకెట్ మెడలో ధరించటం చేసిన దృష్టి లోప సమస్యల నుండి నివారింపబడతారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం,పటుత్వం ఉండదు.

అతిమూత్ర వ్యాది ఉన్నవారు, సుఖవ్యాదులు ఉన్నవారు, వీర్య సమస్యలు ఉన్నవారు, చర్మ వ్యాదులు, బొల్లి ఉన్నవారు మొదలగు రకాల వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఇంద్రాణి లాకెట్ ధరిస్తే మంచిది. స్త్రీదేవతోపాసన చేయువారు, వ్యాపార బాగస్వాములు, రియల్ ఎస్టేట్, గృహోపయోగ అలంకరణ సామాగ్రి వ్యాపారం చేయువారు, వస్త్రవ్యాపారం చేయువారు, సుగంద ద్రవ్యాల వ్యాపారం చేయువారు ఇంద్రాణి లాకెట్ ధరించాలి.

31/10/2019
గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది. గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది. కేతుగ్రహానికి అధిపతి గణపతి. ...
25/10/2019

గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది. గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది. కేతుగ్రహానికి అధిపతి గణపతి. అందుకే జాతకంలో కేతువు అనుకూలంగా లేకపోతే గణపతిని పూజించాలి.

కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయితే మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తానే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించుకోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యోగంలో స్ధిరత్వం లేక పోవటం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, చదువులో ఆటంకాలు, అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగును.

కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్టదోషం. పంచమంలో ఉంటే సంతాన సమస్యలు, చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు గనేష్ శంఖాన్ని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.

గణేష్ శంఖాన్ని ఎవరైతే నిత్యం పూజాచేస్తే ఎటువంటి పనినైనా ఆటంకాలు లేకుండ కార్యాన్ని సాదించుకోవచ్చు. ప్రతి పనిలో విజయం సాదించవచ్చును. ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. నరదృష్టి ప్రభావాలు ఉండవు.
విద్యనభ్యసించే వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు తప్పకుండ పూజించాలి. బుద్ది వికాసాన్ని కలిగిస్తుంది. వివేకాన్ని కలిగిస్తుంది. మెమరీ పవర్ పెంచుతుంది.జాతకచక్రంలో కేతుగ్రహా దోషాలు ఉన్నవారు తప్పక పూజించాలి. జాతకచక్రంలో కేతువు పంచమభావంలో గాని, సప్తమభావంలో గాని, చతుర్ధభావంలో గాని, లగ్నభావంలో గాని ఉన్నప్పుడు శంఖాన్ని తప్పక పూజించాలి.

గణేష్ శంఖంతో నీటిని త్రాగిన వ్యక్తులు చెడు వ్యసనాలకు(తాగుడు,జూదం) క్రమక్రమంగా దూరం అవుతారు. చెడుకలలు, వికృత చేష్టలు నివారించబడతాయి.జాతకచక్రంలో పదవ స్థానంలో కేతువు శత్రుక్షేత్రాలలో ఉంటే వృత్తిలో స్థిరత్వం ఉండదు. అలాంటి వారు గణేష్ శంఖాన్ని పూజిస్తే వృత్తిలో స్థిరత్వం ఉంటుంది.గృహ నిర్మాణానికి ముందు గాని, వ్యాపార, విద్యా ఆరంభానికి ముందు గణేష్ శంఖు పూజ చేసినట్టైతే గృహ నిర్మాణంలో, వ్యాపారంలో గాని, విద్యలో గాని ఎటువంటి ఆటంకాలు ఉండవు.జాతకంలో కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు గణేశ్ శంఖుని పూజిస్తే చాలా మంచిది. ఇంటిలో ఈశాన్య దిక్కు దోషం ఉన్నవారు గణేష్ శంఖుని పూజామందిరంలో ఉంచుకొని పూజిస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి.
గణేశ శంఖం కావలసిన వారు సంప్రదించండి.రామకోటేశ్వరావు గుప్తా -09966480262

మరకత  గణపతిజాతకచక్రంలో బుధుడు నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, బుధ దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, బుధుడు బ...
25/10/2019

మరకత గణపతి
జాతకచక్రంలో బుధుడు నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, బుధ దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి జేడ్‌స్టోన్ గణపతిని పూజా మందిరంలో పచ్చ పెసర్ల పైన గ్రీన్ కలర్ వస్త్రం పరచి బుధవారం రోజు గణపతిని ప్రతిష్టించి పూజ చేసిన బుధగ్రహ దోషాలు తొలగిపోవును. వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమల వృత్తుల వారు, విద్యార్దులకు చదువులో ఆటంకాలు ఉన్న, అన్ని రకాల వ్యాపారాలు, సినిమారంగంలో రాణింపు లేకున్నా, జ్యోతిష్యం, ఉపాద్యాయ వృత్తుల వారు, క్రీడలు, పెయింటింగ్ చేసేవాళ్ళు ఈ గణపతిని పూజించాలి.
పైన పేర్కొన్న వస్తువులు కావలసిన వారు సంప్రదించండి. రామకోటేశ్వరావు గుప్తా -09966480262

క్రిష్టల్ బాల్             ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెర...
25/10/2019

క్రిష్టల్ బాల్
ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెరుగవడంతో పాటు పెళ్ళికాని వారికి వివాహం కుదరడం జరుగుతుంది. అలాగే ఈ స్పటికాలను ఈశాన్య దిశలో వేలాడ దీయడం ద్వారా మీ పిల్లలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తారు.

ఉదయాన్నే స్పటికాన్ని ఈశాన్య గదిలోని ఈశాన్య మూలలో ఉంచి, ఐదు నిమిషాల పాటు లేత సూర్య కిరణాలు దానిపై పడేట్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రిస్టల్‌లోనికి చూస్తూ... మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన దృశ్యాన్ని ఊహించుకున్నట్లైతే ఆ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఇలా స్పటికంలోకి చూస్తూ... మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకుంటే కూడా శుభప్రదమని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా... పదే పదే స్పటికం ముందు అనుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఆ ఆలోచనల తాలూకు తరంగాలు స్పటికంలోనే ఉండి పోతాయి. తిరిగి అందులోనూ ఆ తరంగాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఆ కోరికను జరగాల్సిన కోణంతోనే మనల్ని నిర్దేశిస్తాయని నిపుణుల నమ్మకం.

అలా దృశ్యాన్ని నిక్షిప్త పరచిన క్రిస్టల్‌ను నైఋతి దిశలోని గదిలో నైఋతి మూలలోగానీ, బెడ్‌రూంలోని నైఋతి దిశలో గానీ వేలాడదీస్తే... కుటుంబ సఖ్యతను సాధించవచ్చు. అదే విధంగా ఇంట్లో పెళ్ళి కాని వారి గదిలోని నైఋతి దిశలో ఈ స్పటికాన్ని వేలాడదీస్తే త్వరలో వివాహ సంబంధాలు కుదురుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
క్రిష్టల్ బాల్ షాప్ లో అందరికి కనపడే విధంగా వేలాడదీస్తే వ్యాపారం మంచిగా కొనసాగుతుంది.
పైన తెలిపిన వస్తువులు కావలసిన వారు సంప్రదించగలరు. రామకోటేశ్వర గుప్తా -09966480262

మరకత శివలింగంమరకత  శివలింగానికి, మాదిఫలాల రసంతోను, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించిన జలాన్ని స్వీకరించిన చతుర్ధంలో బ...
25/10/2019

మరకత శివలింగం
మరకత శివలింగానికి, మాదిఫలాల రసంతోను, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించిన జలాన్ని స్వీకరించిన చతుర్ధంలో బుధుడు ఉండటం వలన వచ్చు బాలారిష్ట దోషాలను తొలగించి చదువులో ఆటంకాలు తొలగించును. వ్యాపారాభివృద్ధి,జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయి.

ORIGINAL CRYSTAL LAKSHMI DEVI  ఒరిజినల్ స్పటిక లక్ష్మీ దేవి
21/10/2019

ORIGINAL CRYSTAL LAKSHMI DEVI ఒరిజినల్ స్పటిక లక్ష్మీ దేవి

స్పటిక గణపతి               ఏ పూజకు అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆరాదించేది  గణ నాధుడునే. గణనాధుడుకు పూజ చేసి ప్రారం...
21/10/2019

స్పటిక గణపతి

ఏ పూజకు అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత ఆరాదించేది గణ నాధుడునే. గణనాధుడుకు పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. వినాయకుడు నర ముఖముతోనే జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని చేతి లోనే మరణించాలని వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.

లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక సుముఖము అన్నారు. ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే స్పటిక వినాయకుని ముఖమును చూసి “ఓం శ్రీ స్పటిక మహా గణాధిపతి యై నమః” అని నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.

స్పటిక గణపతి అన్ని స్టోన్ గణపతులలో ఉత్తమమైన గణపతి. స్పటికం శుక్రగ్రహ ప్రతీక. కుటుంబంలో బార్య భర్తల మద్య అన్యోన్నత, సుఖ సంతోషాలు కలగాలన్న, అపోహలు తొలగి పోవాలన్న శుక్ర గ్రహ ప్రతీక అయిన స్పటిక గణపతిని పూజించాలి. వినాయకుడు విఘ్నాలకు ప్రసిద్ధి. పనులలో విఘ్నాలు కలుగుతున్న స్పటిక గణపతిని పూజించాలి. శుక్రుడు వివాహ కారకుడు. వివాహంలో ఆటంకాలు కలుగుతున్న, దంపతులమద్య సఖ్యత లేకున్నా స్పటిక గణపతిని పూజించాలి.

శుక్రవారం ఉదయం స్నాన అనంతరం స్పటిక గణపతిని గంగాజలంతో శుద్ది చేసి పూజా మందిరంలో తెల్లని వస్త్రం పరచి దానిపైన స్పటిక గణపతిని ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్య అనంతరం ఆకర్షణకు వశీకరణకు కారకుడైన శుక్రగ్రహ కారకమైన స్పటిక గణపతిని “ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవశమానాయ స్వాహా” అనే మంత్రంతో పూజ చేసి ఇంట్లో గాని వ్యాపార సంస్ధలలో గాని ప్రతిష్ఠించిన జనాకర్షణ, వ్యాపారభివృద్ధి, దంపతుల మద్య అన్యోన్నత చేకూరతాయి.
9966480262 శ్రీ గిరి సన్నిధి హ్యాండిక్రాఫ్ట్స్ శ్రీశైలం

05/11/2018

Wishing you joy and prosperity this Diwali

"గుర్రపు నాడా" గుర్రపు నాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే స్వీకరించాలి. గుర్రానికి కొట్టకు...
24/09/2018

"గుర్రపు నాడా"

గుర్రపు నాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే స్వీకరించాలి. గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయోగించినను ఎటువంటి ఫలితము ఉండదు. గుర్రపునాడాని శనివారం గాని, శనిత్రయోదశి నాడు గాని సేకరించి గుర్రపునాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి.

సింధూరంతో పూసిన గుర్రపునాడాని శనివారం ఉదయం ఇల్లు లేదా ఆఫీసు లేదా ప్యాక్టరీ యొక్క ప్రదాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి. ఇంటికి సంబందించినంత వరకు గుర్రపునాడాని "ఆ" ఆకారంలో ఉంచాలి. అనగా ఊర్ధ్వ ముఖంగా ఉంచాలి. ఇలా ఉంచటం వలన శనిదోషం, నరదృష్టి ప్రభావాలు కిందకి అనగద్రొక్కబడతాయి.

గుర్రపునాడాని వ్యాపార స్ధలంలో గాని, ప్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున "ఊ" ఆకారంలో ఉంచాలి. ఇలా ఉంచడం వలన శత్రుభాధలు, దృష్టి దోషాలు దరిచేరనివ్వదు.

ఉపయోగాలు:-
1) ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు వారు నివసిస్తున్న ఇంటిలో గాని వ్యాపారస్ధలంలో గాని గుర్రపునాడాని ఉంచిన లేదా నాడా చేసిన రింగుని ఎడమచేతి మధ్య వ్రేలుకి ధరించిన, నాడాని కడియం లాగా చేసుకొని ఎడమచేతికి ధరించిన శని తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.
2) అంగారక దోషం కూడ తగ్గుతుందని కొంతమంది నమ్మకం.
3) గుర్రపునాడా ఉన్న ఇల్లు ఇంటిలోని వారికి రక్షణ కవచం లాగా ఉంటుంది.
4) దీర్ఘకాలిక రోగాలు, దృష్టిదోషాలు ధరిచేరనివ్వదు.
5) మంచి ఆరోగ్యాన్ని చురుకుతనాన్ని ప్రసాదిస్తుంది.
6) ఇనుము, నూనె, పెట్రోల్ బంక్ లు, నువ్వులు, మిరియాల వ్యాపారాలు చేసేవారు తప్పకుండా వారి వ్యాపారస్ధలంలో గుర్రపునాడాని ప్రధాన ద్వారానికి ఉంచాలి.
7) రాజకీయ నాయకులు, సినిమా, సాప్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్, అధికారుల తోటి అవమానాలు ఉన్నవారు ఈ గుర్రపునాడాని ఉపయోగించాలి.
8)ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతున్నా, వేగంగా కావలసిన పనులు ఆలస్యమవుతున్నవారు గుర్రపు నాడాను ఉపయోగించాలి.

శని సంచారం అంటే సాధారణంగా అందరూ అధికంగా భయపడతారు. నిజంగా ఆయన అంత భయంకరమైన గ్రహమా? రాశి చక్రంలో మకర కుంభ రాశులకు అధిపతి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.

‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు. ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.

జైమిని సూత్రాలతో బాగా రీసెర్చ్ చేసేవారు ఒక మంచి మాట చెబుతారు. ఎవరి వ్యాపకములలో వారు వుంటే శని ఏమీ చేయడు అని. అది నిజమే. ఇతరుల పనులలో తలదూర్చినా చేయు వృత్తితో పాటు కొత్త వృత్తి ఆశ్రయించినా ఇబ్బంది పెట్టే అంశాలుగా మారుస్తాడు. ప్రాకృత ధర్మం తప్పిన వారి విషయంలోనే శని ప్రభావం అధికం అని చెబుతారు.

ఐరన్, స్టీల్, సిమెంట్, సాల్ట్‌బేస్డ్ వ్యాపారాలు, ఫర్నీచర్, మందులు వంటి వ్యాపారులు, వైద్యులు బాగున్నారు అంటే వారికి శని అనుగ్రహం వున్నది అని గ్రహించవచ్చు. అలాగే శని దోషం త్వరగా ప్రసరించేది మాలిన్యమైన సందర్భాలలోనే. అందులో భాగంగా పురాణాలలో విజ్ఞానం ఉండి అలాగే జ్యోతిశ్శాస్త్రం మీద అవగాహన ఉన్నవారు చెప్పే శని శాంతి మార్గాలు.

ప్రాకృతమయిన ధర్మాలు విడనాడటం, ఒకరి చెప్పులు మరొకరు ధరించడం, ఒకరోజు ధరించిన వస్త్రములు మరుసటిరోజు ధరించడం, పగలు నిద్ర, మంచం మీద పగలు కూర్చోవడం, పడుకోవడం, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండటం, రాత్రులందు తైలము రాసుకోవడం, ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడడం, పురుషుడు రోజూ తలస్నానం చేయకపోవడం, తోలు, ఉప్పు, ఇనుము చెక్క వంటి వస్తువులు ఉచితంగా తీసుకోవడం, పాదప్రక్షాళన లేకుండా బయట తిరిగి ఇంటిలోకి రావడం, ఇలా జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే అంశాలు అన్నీ కూడా ఎవరయితే పాటిస్తారో వారిని శనైశ్చరుడు ఇబ్బందికి గురి చేస్తాడు అని చెబుతారు.

కావలసిన వారు సంప్రదించండి.
రామకోటేశ్వర గుప్తా- 9966480262
వెల-150రూపాయలు

Address

Oop. Ankalamma Temple , Shop No-21, Pg Road
Srisailam
518101

Opening Hours

Monday 6am - 11pm
Tuesday 6am - 11pm
Wednesday 6am - 11pm
Thursday 6am - 11pm
Friday 6am - 11pm
Saturday 6am - 11pm
Sunday 6am - 11pm

Telephone

+91 99664 80262

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri giri sannidhi handy crafts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share