05/06/2016
ఎక్కడ మనసు మాట దానిని నిర్వచింపలేక ఆగిపోతున్నాయో అదే బ్రహ్మమని తెలుసుకో అని అంటున్నాయి ఉపనిషత్తులు...
"మాటలకందక భావమునంటక భాసిలు బ్రహ్మము"
ఇది అని ఎదురుగా చూసి ఉపాసించేది బ్రహ్మము కాదని తెలుసుకో అంటున్నాయి..
ఏది కన్ను చూడలేదో ఏది కన్నుకి దృష్యాన్ని చూపిస్తుందో అదే బ్రహ్మమని తెలుసుకో.. ఏది చేవికి చెవి యై ఉన్నదో ... ఏది బుద్దికి బుద్ధియై ఉన్నదో... ఏది మనసుకు మనసై ఉన్నదో.. దేని చేత అన్ని ప్రకాశిస్తున్నాయో...
ఏది అణువు కన్న అణువై ఉన్నదో ఏది అనూహ్యమైనదో...
ఏది నీటిచే తడుపజాలదో, అగ్నిచే దహింపజాలదో, దేనికి జనన మరణాలు లేవో....
ఏది అంతటా సర్వత్రా నిండి ఉందో...
అదియే బ్రహ్మము అని వేదాంతులనినారు...
దానిని వైష్ణవులు ఆత్మారాముడని, కృష్ణుడని, విష్ణువని అనినారు..
దానిని శైవులు శివుడని అనినారు..
దానిని శాక్తేయులు త్రిపురసుందరియని అనినారు..
దానికి ఏ పేరు లేదు కనుకనే వారి మతమును అనుసరించి ఆయా పేర్లు పెట్టుకున్నారు..
ఉన్నది ఒక్కటే...
అది మాటలచేత చెప్పబడనిది, తనుకు తానే " నేను ఎవరు" అని విచారణ చేయవలెను..
శ్రీ గురుభ్యో నమః