KOMMA Sattaiah & SON

KOMMA Sattaiah & SON No celebration will b fulfilled without us!!!!!

31/10/2022

🙏🌺కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి. 🌺🙏

🌺దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు.
కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలున్నాయి. 🌺

🌺ఈ నెలరోజులూ ఇంట్లో దీపాల కన్నా చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటంది.

సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది.
ఇంతకీ కార్తీకమాసం నెలరోజులూ నదుల్లో, చెవులుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు.
దీనివెనుకున్న ఆంతర్యం ఏంటంటే.

నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం.
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం.
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం🌺

🌺ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు*, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన *న-మ-శి-వా-య* అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.

శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా..

ముందుగా *శివం-పంచభూతాత్మకం* అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది.
ఆత్మ జ్యోతి స్వరూపం
ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు.

జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే.

ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు. *అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. 🌺

🌺అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. *కార్తీక మాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.*.
విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు.

ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. *నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు. 🌺

_*  మొదటిరోజు శైలపుత్రీ దుర్గా అలంకారం*_🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️శైలపుత్రీ దుర్గా , అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. ...
26/09/2022

_* మొదటిరోజు శైలపుత్రీ దుర్గా అలంకారం*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శైలపుత్రీ దుర్గా , అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ , భవానీ , పార్వతి , హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య , గణపతి , సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం , ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం , ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రీ దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు.

*పురాణ గాథ*

నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతీ , హైమవతీ అని కూడా పిలుస్తారు.

బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీ దుర్గా దేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి , ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి , శివుణ్ణీ , సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ , అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి , అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దనీ , అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు , మేనకా , హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ , శైలజ , శైలపుత్రీ అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు.

శివమహాపురాణం , దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ , పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుడు) నుంచి భర్త(శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు , యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి , ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి , ధ్యానించి , సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది , కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రీ దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రీదేవిది పృధ్వీ తత్త్వం , సందర్భశుద్ధి అయిన గుణం , గ్రాహణ , భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

*ధ్యానం*

#అలిగిన_బతుకమ్మ శైలపుత్రీదేవి_మంత్రం
ల, మ. నాలుక , పెదాలపై దృష్టి ఉంచి ఈ రెండు పదాలను పలుకుతారు.

శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం:
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం౹ వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్౹౹

"వృషభాన్ని అధిరోహించి , కిరీటంలో చంద్రవంకను ధరించి , యశశ్శు కలిగి , భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా వందనం - నమస్కారం అర్పిస్తున్నాను." అని ఆ శ్లోకానికి అర్ధం.

శైలపుత్రీ దుర్గాదేవి దేవాలయం
ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హియా ఘాట్ వద్ద శైలపుత్రీ దేవి ఆలయం ఉంది.
విప్రతేజం✍️రాంభట్ల.రవిశాస్త్రి

పుష్కరాలు అంటే ?************ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే ...
13/04/2022

పుష్కరాలు అంటే ?************

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు),మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు.పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి.నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం.తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

స్నాన శక్తిని చెప్పే పుష్కరాల కధ - పుష్కరుడు కథ :

ఆధ్యాత్మిక పరంగా " తుందిలుడు " అనే ఒక మహర్షి శంకరుణ్ణి గురించి తపస్సు చేసాడు . ప్రత్యక్షమైన ఈశ్వరుడు ' ఏం కావాలి ' అన్నాడు . నన్ను నీలో లీనము చేసుకో స్వామీ అని అన్నాడు తుందిలుడు . శంకరుడు ఒక క్షణము ఆలోచించి సరే నంటూ తనలో లీనముచేసుకున్నాడు .

తుందిలుడు అంటే పెద్ద బొజ్జ కలవాడని అర్ధం ... అంటే పంచభూతాలూ తనలో దాగున్న ప్రపంచం అని భావము . ఆ పంచభూతాలూ ఒక్కటై శంకరుణ్ణి ప్రార్ధిస్తాయి. . . మేమంతా నీ అధీనములో ఉంటామని ... సరేనన్నాడు శంకరుడు . ఈ కారణముగా శంకరుడుకి ఐదు తలలుంటాయి. పంచభూతలింగాల పేరిట -- కంచి (పృధ్వీలింగం) ,జంబుకేశ్వరము(జల లింగం), తిరుణ్ణామలై(తేజోలింగం), శ్రీకాళహస్తి (వాయులింగం), చిదంబరం (ఆకాశ లింగం) అనే ప్రదేశాలున్నాయి. ఈ పంచభూతాలూ అన్నిటినీ అందరికీ ఈయగలిగిన శక్తి ఉన్నవని గ్రహించి ఈ పంచభూతాల సమిష్ఠి రూపానికి " పుష్కరుడు " (పుష్కలముగా అన్ని తనలోకలిగిన కారణముగా ఈయగలిగిన వాడు ) అని పేరు పెట్టారు. సృష్టిచేయాల్సిన అవసరము వచ్చిన బ్రహ్మ ... సృష్ఠి చేయడముకోసము పంచభూతాల అవసరము ఉందని గుర్తించి పంచభూతాల సమిస్టి రూపమైన పుష్కరుణ్ణి తనకీయమని సంకరుడు ని ప్రార్ధిస్తాడు .

బ్రహ్మ కున్న అవసరాన్ని గుర్తించిన శంకరుడు పుష్కరుణ్ణి బ్రహ్మకిచ్చేసాడు . ఇప్పుడు పంచభూతాలు సంకరుని అధీనము నుండి బ్రహ్మ అధీనానికి వచ్చేసాయి . మరికొంత కాలానికి బుద్ధికి అధిష్టాత అయిన బృహస్పతి ఈ పుష్కరుణ్ణి తనకీయమని బ్రహ్మని ప్రార్ధిస్తాడు . . . అంటే తన బుద్ధిశక్తిని ఆ బ్రహ్మ చేత సృష్టింపబడే అన్నిటికీ అందించాలనే భావము తో సరేనని బ్రహ్మ ఆ పుషరుణ్ణి బృహస్పతికి ఇచ్చేసాడు . ఆ పంచభూతాల సమిస్టిశక్తి అయిన పుష్కరుణ్ణి ఈ బృహస్పతి లోకములోని జనూలందరికీ వినియోగించదలిచి సంవత్సరానికి ఓ 12 రోజులు పాటు ఒక్కోనదిలో ఈ పుష్కరుణ్ణుని ఉండవలదింగా ఆజ్ఞ చేస్తాడు . ఆ 12 రోజులు ఎందరు ఆ నదిలో స్నానము చేస్తే ఆ అందరికీ పంచభూత శక్తి చేరుతుందని దీని భావము. అలా జరుగుతుందనే బృహస్పతి ఉద్దేశము .

ఏ నది ఏవైపుగా ప్రవహిస్తూ ఈ శక్తిని ఏ కాలములో పొందుతుందో ఆ రహస్యాన్ని కూడా మనకి వివరిస్తూ పుణ్యము కట్టుకున్నారు బృహస్పతి .

నది------------------------ రాశి
గంగా నది------------------ మేష రాశి
రేవా నది (నర్మద)------------ వృషభ రాశి
సరస్వతీ నది---------------- మిథున రాశి
యమునా నది-------------- కర్కాట రాశి
గోదావరి-------------------- సింహ రాశి
కృష్ణా నది------------------ కన్యా రాశి
కావేరీ నది------------------ తులా రాశి
భీమా నది------------------ వృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నది------ ధనుర్ రాశి
తుంగభద్ర నది---------------- మకర రాశి
సింధు నది----------------- కుంభ రాశి
ప్రాణహిత నది--------------- మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

10/04/2022

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

16/11/2021

*క్షీరాబ్ధి ద్వాదశి*

ఒకప్పుడు ఈ దేశంలో పిల్లా-మేక, పశువూ-పక్షి, చెట్టూ-చేమ మానవ పరివారంలో భాగంగా ఉండేవి. మనిషి వాటితో కలిసి బతికేవాడు.

గోవును దేవతా స్వరూపంగా భావిస్తూ గోమాతగాను, భూమిని భూమాతగాను గౌరవించడం ఈ దేశ సంస్కృతిలో భాగం. తులసి, ఉసిరి, మామిడి, రావి, మారేడు, జమ్మివంటి వృక్షజాతులను సైతం పూజించడం ఈ దేశంలో ఆచారం.

మన పండుగలు, పర్వాలు ఈ ఆచారాలను, వ్యవహారాలను పదేపదే గుర్తుచేయడానికా- అన్నట్లుగానే ఉంటాయి. తక్కిన ప్రాణికోటితో మనిషికి ఒకానొక బంధాన్ని ముడివడేలా చూసుకుంటూ, మన పెద్దలు కొన్ని విధివిధానాలు రూపొందించారు.

కార్తికంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం అందులో భాగం. తులసి మొక్కకు, ఉసిరి చెట్టుకు కార్తికమాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

కార్తిక శుద్ధ ఏకాదశిని 'ప్రబోధనా ఏకాదశి' అంటారు. ఆనాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై పవళింపును చాలించి, తులసి వనానికి చేరుకుంటాడట.

బ్రహ్మాది దేవతలు సైతం ఆయనతోపాటు కదిలివచ్చి తులసి వనంలో కొలువుంటారంటారు. మరునాడు ద్వాదశి పూట క్షీరాబ్ధి ద్వాదశి భావనతో- దీపదానాలు చేసి 'క్షీరాబ్ధి శయన వ్రతం' ఆచరించాలని వ్రత గ్రంథాలు సూచిస్తున్నాయి.

శ్రీకృష్ణుడితో తులసికి పెళ్ళయిన రోజిది. కనుక ఈ రోజు 'తులసి వివాహ పర్వం' నిర్వహిస్తారు. కృష్ణుడు తనకు బాగా ఇష్టమైన చోట్లు మూడు- అని ఉద్ధవుడికి చెప్పాడట. భక్తుల హృదయాలు కృష్ణుడికి బాగా ప్రీతికరమైన స్థానం.

తపస్వుల సన్నిధానం రెండోది. మూడోది- తన ప్రియురాలైన తులసితో కలిసి ఉండటం కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ కథను ఆధారంగా చేసుకుని క్షీరాబ్ధి ద్వాదశినాడు తులసి వివాహ పర్వాన్ని ఆచరించడం ఆనవాయితీగా మారింది.

నూతన వస్త్రాలు, గాజులు, పసుపుకుంకుమలతో తులసి మొక్కను అలంకరించి- కృష్ణుడి మూర్తికి, తులసి మొక్కకు మధ్య అడ్డుగా తెరను పట్టుకుని వివాహతంతు నిర్వహిస్తారు.

కొన్నిచోట్ల కాయలతో ఉన్న పచ్చని ఉసిరి కొమ్మను తెచ్చి, తులసి కోటలో పాతి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. వేప, రావిచెట్లు రెండూ కలగలిసి ఉన్నచోట వాటిని లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజించినట్లే; తులసిని లక్ష్మిగాను, ఉసిరికను నారాయణుడిగాను ఆరాధించడం- క్షీరాబ్ధి ద్వాదశి నాటి ఆచారం.

తులసి మొక్కను అనునిత్యం అర్చించినట్లే ఉసిరిక చెట్టును కార్తిక మాసమంతటా పూజించాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అమలక తరువు అనేది తెలుగులోకి వచ్చేసరికి ఉసిరి పక్కన 'క' చేరి ఉసిరిక చెట్టు అవుతోంది. దీన్నే ధాత్రీ వృక్షమనీ పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడ సోకే చెరువునీట స్నానం కార్తిక మాసంలో చాలా పవిత్రం. కార్తిక వన సమారాధనలు ఉసిరి చెట్టు నీడలో నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే!

ఏ తోటలో అయినా ఉసిరి చెట్టును ఒక దాన్నయినా పెంచడం శుభప్రదంగా భావిస్తారు. ఆయుర్వేదం తులసి, ఉసిరికల ఔషధ విశేషాలను విస్తారంగా వర్ణించింది. తులసిని సర్వరోగ నివారిణిగా చెబుతుంది. ఏదైనా ఒక విద్యపై గట్టిపట్టు సాధించినప్పుడు 'ఆయనకు అది కరతలామలకం' అంటుంటారు. అంటే, అరచేతిలో ఉసిరిలా అమరిపోయిందని అర్థం.

ఇది జ్యోతిర్విద్యకు చెందిన ఒక రహస్య సంకేతం. మనిషి అరచేతిలోని రేఖలకు, ఉసిరికాయపై కనబడే గీతలకు, భూగోళంపై గల అక్షాంశ, రేఖాంశాలకు సమన్వయం చూపిస్తూ- భాస్కరాచార్యుడు తన 'సిద్ధాంత శిరోమణి'లో గోళాధ్యాయం పేరుతో ఎన్నో విశేషాలు వివరించాడు. రామాయణం బాలకాండలోని ఒక శ్లోకం 'రామకథ వాల్మీకి ముని అరచేతిలో అమలకం' అంటుంది. అలా కరతలామలకం అనే పదప్రయోగం వెనక చాలా కథ ఉంది.

గోళాకారంగా ఉండే నిమ్మకాయవంటి వేరే పళ్లకు దక్కని ఒకానొక ఔచిత్య సౌభాగ్యం ఈ పోలికలో ఉసిరిపండు దక్కించుకుంది.

తులసి, ఉసిరి ఒకేచోట పుట్టాయని 'శివ పురాణం'లోని ఒక కథ వివరించింది.

కాలనేమి కుమార్తె 'వృంద'. ఇదే పేరు పద్మపురాణంలో 'బృంద'గా కనిపిస్తుంది. ఆమె జలంధరుడి భార్య. మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృందను సమీపిస్తాడు.

భర్తగా పొరబడి ఆమె విష్ణువును గాఢంగా ఆలింగనం చేసుకుంటుంది. ఆ పిదప వాస్తవాన్ని గ్రహించి, అవమానభారంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది.

చితిలో దగ్ధమవుతూ ఆమె 'నన్నిలా నా భర్త నుంచి దూరం చేసిన మూలంగా నీవూ నీ భార్యకు దూరమై చిరకాలం దుఃఖాన్ని అనుభవించి, చివరకు కోతుల సాయంతో ఆమెను దక్కించుకుందువుగాక!' అని విష్ణువును శపిస్తుంది.

ఆమె చితాభస్మం భూమిలో కలిసిపోయిన చోటులోంచి తులసి, ఉసిరి మొక్కలు మొలిచాయని శివపురాణ గాథ. ఆ కారణంగా ఆ రెండింటికీ పవిత్రత, పూజ్యత చేకూరాయని పెద్దలు చెబుతారు.

కార్తిక మాసమంతటా కాకపోయినా, కనీసం క్షీరాబ్ధి ద్వాదశినాడైనా ఆ రెండింటినీ ఆరాధించాలని పెద్దలు నిర్దేశించడం వెనక ఇలా ఎన్నో అంతరార్థాలు, రహస్యాలు ఇమిడి ఉన్నాయి.

అవి తెలిసి చేసినా, తెలియకుండా చేసినా ఆరాధనవల్ల ఆయురారోగ్యాలు, శుభాలు చేకూరతాయి. అలాంటి పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి

*🤔ఉచితంగా అంటే...* ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడ...
07/07/2021

*🤔ఉచితంగా అంటే...*

ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,
నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,
కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!
ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు,
అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
ప్రొఫెసర్ ok అన్నారు...
మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లో,average ర్యాంక్ B వచ్చింది అందరికి,

2nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,

ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
చదువు తక్కువ చదివే స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,

ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,

1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,
కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు,

2. ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే
మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,

3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,
ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,
4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,

సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,
అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,

మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,

ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది..

కరక్కాయత్రిఫలాలలో ఒకటి. క‌ర‌క్కాయ‌ను సంస్కృతంలో హరిత‌కి అంటారు. కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. ఆయుర్వేద మం...
24/06/2021

కరక్కాయత్రిఫలాలలో ఒకటి. క‌ర‌క్కాయ‌ను సంస్కృతంలో హరిత‌కి అంటారు. కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. ఆయుర్వేద మందుల లో ఎక్కువగా ఉపయోగించే కరక్కాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కరక్కాయ తీసుకోవడం వల్ల బుద్ధుని వికసింపజేస్తుంది. మల బద్ధకం, వాంతులు, ఫైల్స్, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు కరక్కాయ సులువుగా తొలగిస్తుంది. అయితే కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కరక్కాయ వాతగుణాలను తగ్గించి, బుద్ధిని వికసింపజేస్తుంది. అంతేకాదు శక్తినిచ్చి, ఆయుష్షును పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు దీనిలో ఉంటాయి. మలబద్దకాన్ని నివారించడానికి సరైన ఔషధం.

అలాగే పైల్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. యాంటి స్పాస్మడిక్, యాంటీ పైరేతిక్‌గానూ పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరం, ఎక్కిళ్లు, వాంతులను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆందోళన, నాడీమండల నిస్త్రాణాన్ని నియంత్రిస్తుంది.

కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల విష జ్వరాలు తగ్గిపోతాయి. అదే కరక్కాయ పొడిని ఆముదం లో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

దగ్గు తో పాటు కలిగే ఆయాసం నుండి బయట పడాలంటే కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్ళు కలిపి చూర్ణం చేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసి వచ్చినప్పుడు కొంచెం వేడి చేసిన పాత నెయ్యి లో కరక్కాయ పెచ్చులు చూర్ణం, ఇంగువ పొడి బిడలవణం చేర్చి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకోవాలి.

దీనితో ఈ సమస్యలు మాయమైపోతాయి. చిన్న పిల్లలకి 1 నుంచి ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా దీన్ని ఇస్తే రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్యం లోనూ ఆరోగ్యంగా ఉంటారట.

కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున రెండు పూటలా ఆముదంతో కలిపి ప్రతి నిత్యం తీసుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయ చూర్ణం రెండు భాగాలకు వేయించిన పిప్పళ్ల చూర్ణం ఒక భాగం కలిపి, మోతాదుకు పావు చెంచాడు చూర్ణం, తేనెతో కలిపి ప్రతి 4 గంటలకూ ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.

కరక్కాయ పౌడర్‌ను నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనెతో పాటు కరక్కాయ పౌడర్‌ను పేస్ట్ రూపంలో పూయడం వల్ల దాని రక్తస్రావం తగ్గించే గుణం కారణంగా గాయాలను నయం చేస్తుంది.

ఇది అంటువ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది.

14/05/2021

భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది.

మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి.
తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్సు సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో తయారవబోతోంది.

ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటినుంచి మోసం చేసి ప్రోటీన్ వాడుకుని పదంతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వైరస్ కు వుంటుంది. ఈ చక్కర అణువులనుంచి వైరస్ కి శక్తి వస్తుంది.

ఆ శక్తితో మళ్ళీ పదంతలౌతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరరస్ ఎక్కవై తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.

అయితే ఈ తాజా మందు, వైరస్ ను మోసం చేసి గ్లూకోస్ అని భావించేలా చేస్తుంది. ఈ మందు అణువులను మింగిన వైరస్ లు వంద్యమై ఇంకా కొత్త వైరస్ లను పుట్టించలేక పోతాయి.

ఈ సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్ లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని.గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది.

ఈ మందు కనుక అనుకున్నవిధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో)ఇది అధ్బుతంగా పని చేసింది.

ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి
26/04/2021

ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి

🎋🌿☘️🍁🍃🥀*శ్రీ ప్లవ నామ సంవత్సర* ఉగాది *శుభాకాంక్షలు🎋🍂🍃☘️🌿🌾 అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని..మీకు, మీ క...
13/04/2021

🎋🌿☘️🍁🍃🥀
*శ్రీ ప్లవ నామ సంవత్సర* ఉగాది *శుభాకాంక్షలు
🎋🍂🍃☘️🌿🌾

అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని..

మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే కలగాలని కోరుకుంటున్నాము.
🌹🌹🙏🙏💐💐

పాపమోచనీ ఏకాదశి🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱పాపమోచనీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. అతిపు...
07/04/2021

పాపమోచనీ ఏకాదశి

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

పాపమోచనీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది.

అతిపురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు.

ఈ ఏకాదశి ఫాల్గుణమాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది.

లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు,

మంజు ఘోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది .

ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది.

శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజు ఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు.
అపుడు మంజు ఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు.

ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగి రేయింబవళ్ళనే మరచిపోయాడు. ఆ కామకలాపాలలోనే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి.

ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజు ఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోనాలని నిశ్చయించుకొంది.

అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి
వెళ్ళడానికి అనుజ్జును కోరింది.

అపుడు మేధావి ఆమెతో "రమణి! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది.

ఈ రకంగా ఆ అప్సరస యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడురోజులు మునితో ఉండినప్పటికీని అదంతా కేవలము ఒక రేయిలో సగభాగము వలెనే తోచసాగింది తిరిగి మంజు ఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈసారి ముని ఆమెతో "రమణి! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతఃకాల విధులు పూర్తి చేసేంతవరకు డే ఉండు" అని అన్నాడు.

అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాలవిధులు పూర్తి కావడానికి ఇంకెంత పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపి వేసారు. ఇప్పటికైనా సమయం విలువ తెలిసికోండి" అని అన్నది ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది.

అపుడు ఆ ఋషి "సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేసాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేసావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది.

అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ "నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో సాదానా! సిగ్గు సిగ్గు" అని అన్నాడు

మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజు ఘోష అతనితో "ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమా అర్హురాలిని, నా మీద దయ చూపించు" అని అన్నది.

ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపోసంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు. పాపమోచనీ ఏకాదశి. అది సకల పాపహరము. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పశావజీవనం పోతుంది" అని పలికాడు.

తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు.

తనయునికి చ్యవన ఋషి మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు" అని అన్నాడు.

తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహముతో ఆ ఏకాదశి ప్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి ప్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ సశించిపోయాయి, అతడు కూడ పరమ పుణ్యభాగుడయ్యాడు
మంజు ఘోష కూడ పాపమోచనీ ఏకాదశి పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది.

మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశి ప్రతిపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యా న్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ ప్రతపాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకము, గురుపత్ని సంగమపాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి" అని అన్నాడు

సారాంశ మేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది. సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి.

హరినామ స్మరణం..
సమస్త పాప హరణం...

జై శ్రీమన్నారాయణ 🙏

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

మాఘమాసం అంటే అందిరికీ ముందుగా గుర్తుకువచ్చేది  #మహాశివరాత్రి పర్వదినం. 🔸 బ్రహ్మ, విష్ణువులు ఇద్దరి  మధ్య యుద్ధం ఆపడం కోస...
11/03/2021

మాఘమాసం అంటే అందిరికీ ముందుగా గుర్తుకువచ్చేది #మహాశివరాత్రి పర్వదినం.

🔸 బ్రహ్మ, విష్ణువులు ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘమాసంలో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభ రూపం ధరించాడు.

ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపము ఉంది. రూపము లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి లింగం ఇటు సగుణము, నిర్గుణమూ కూడా.

శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు "మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవ కాలము అని అంటారు. ఈ లింగోద్భవ కాలములో నన్ను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు, వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి" అని పరమశివుడు వరమిచ్చాడు.

🔸 శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, శివ లింగాన్ని పూజించాలి. జాగరణ చేసి,‌ లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు. శివరాత్రి నాడు లింగాన్ని రోజంతా పూజించవచ్చు.

సుర్యోదయము నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈశ్వరుడిని పంచామృతాలతో, జలధారలతో అభిషేకించండి, సర్వశుభాలు కలుగుతాయి.

🔸 శివరాత్రి నాడు బ్రాహ్మీముహూర్తంలో నదిలోకాని, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి.

ఆచమనము చేసి, విభూతి తప్పక ధరించాలి. రుద్రాక్షలు ధరిస్తే మంచిది. ఆ తరువాత గణపతిని పూజించాలి. పగలు, రాత్రి కూడా షోడశోపచారములతో పూజించాలి.

🔸 నమకచమకాలతో లేదా మహన్న్యాసం పెట్టుకుని, రుద్రాధ్యాయము వింటూ అభిషేకించండి. జలంతో పాటు, పంచామృతాలతో, పాలు, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది. దారిద్ర్యము తొలగిపోతుంది. అకాలమరణం ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది.

🔸 ఫలరసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి. పసుపుకుంకుమలతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది. గంగాజలం మరీ మంచిది. అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించండి.

శివుడిని పసుపు పచ్చని పూలతో, తెల్లని పూలతో పూజించండి. శివ మానస స్తోత్రం చేయాలి. నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో అర్చన చేయండి.

🔸 ధూపము, దీపం, నైవేద్యం ఉండి తీరాలి. పంచ ఉపచారములు చేయాలి. లింగోద్భవ కథను చెప్పుకోవాలి. అర్థరాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి, 12గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ ఉండాలి.

ఈ రోజు ఉపవాసం ఉండి ‌పళ్ళు, పాలు తీసుకోవచ్చును. మరునాడు స్నానం చేసి దానము చేయాలి. వ్రతము చేసిన ‌వాళ్ళు స్వయంపాకం, దక్షిణ దానం చేస్తే, దానధర్మములు చేస్తే సంపూర్ణఫలితం పొందుతారు.

శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది. గురుదర్శనము మంచిది.

అందరికి శివరాత్రి శుభాకాంక్షలు!

🚩🙏 హర హర మహాదేవ్ 🙏🚩

Address

Vemulawada
505302

Telephone

+919949958027

Website

Alerts

Be the first to know and let us send you an email when KOMMA Sattaiah & SON posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share