JOEL NUTS

JOEL NUTS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JOEL NUTS, Wholesale & Supply Store, Imampanja Street , mainbajar cross , 1town, Vijayawada.

Permanently closed.
18/08/2020
పుచ్చ గింజల్లో విటమిన్స్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలను ఆహార...
28/05/2020

పుచ్చ గింజల్లో విటమిన్స్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.

ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది , రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

పుచ్చ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి ఉపయోగపడుతుంది.

హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది

కంటిజ‌బ్బుల‌కు కూడా పుచ్చ‌కాయ విత్త‌నాలు బాగ ప‌నిచేస్తాయి. కంటి వెంట నీరుకార‌డం, కంట్లో మంట‌, దుర‌ద వంటి స‌మ‌స్య‌లు ఉంటే పుచ్చ‌కాయ గింజలు అధ్బుతంగా ప‌నిచేస్తాయి.

మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి, డైట్ లో చేర్చుకోవడానికి అను...
22/05/2020

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి, డైట్ లో చేర్చుకోవడానికి అనుమతిస్తుంటారు. విటమిన్ సి సోర్స్ అద్భుతంగా ఉన్నటువంటి ఆహార పదార్థం ఇది. వీటిలో ఉండే విటమిన్ ఇ కోలన్ క్యాన్సర్ మరియు డయాబెటిక్ రిస్క్ నుండి కాపాడుతాయి.

క్యాన్సర్ నివారణి: సన్ ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఇ, సెలీనియం మరియు కాపర్ ను కలిగి ఉంటాయి . ఇవి నేచురల్
యాంటీఆక్సిడెంట్స్ . ఈయాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు కారణం అయ్యే సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. మరియు కొలన్ క్యాన్సరును నియంత్రణలో ఉంచుతుంది.

ఎముకల ఆరోగ్యానికి : సన్ ఫ్లవర్ సీడ్స్ మెగ్నీషియంకు ఒక ఉత్తమ మూలం. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం అవుతుంది.పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. సలాడ్స్‌, సూప్స్‌, బ్రెడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు.

ఒత్తిడిని మాయం చేస్తాయి: సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడీవ్యవస్థను ప్రశాంతపరిచి స్ట్రెస్ తగ్గిస్తుంది దాంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: వీటిలో ఉండే హైఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీనిలో పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

కార్డియోవ్యాస్కులార్ హెల్త్: సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే విటమిన్ సి కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను తగ్గిస్తుంది మరియు ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడటం వల్ల హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ను నివారిస్తుంది.

మెంటల్ హెల్త్: సన్ ఫ్లవర్ సీడ్స్ డిప్రెషన్ తగ్గిస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే సెరోటనిన్ టెన్షన్ తగ్గిస్తుంది మరియు విశ్రాంతి పరుస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: సన్ ఫ్లవర్ సీడ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బౌల్ మూమెంట్ ను మరింత సులభం చేస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు.

చర్మ కేశ సంరక్షణకు: వీటిలో విటమిన్ ఇ చర్మ మరియు కేశ ఆరోగ్యానికి మరియు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ : ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి..కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.

సెలీనియం అధికంగా ఉంటుంది: పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే సన్ ఫ్లవర్ సీడ్స్ థైరాయిడ్ కు గ్రేట్ గా పనిచేస్తుంది. ఇవి శరీరంలోని వాపు, మరియు రెడ్ నెస్ ను తొలగిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనబడినది. ముఖ్యంగా వీటిలో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోనులను మెటబలైజ్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గుమ్మడికాయ విత్తనాలు ఆహార పీచుపదార్థాల (ఫైబర్స్) యొక్క గొప్ప వనరుగా ఉండటం వల్ల వీటి సేవనం జీర్ణక్రియ ప్రక్రియ రుగ్మతలను ...
16/05/2020

గుమ్మడికాయ విత్తనాలు ఆహార పీచుపదార్థాల (ఫైబర్స్) యొక్క గొప్ప వనరుగా ఉండటం వల్ల వీటి సేవనం జీర్ణక్రియ ప్రక్రియ రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలలో ఉన్న అనేక సూక్ష్మపోషకాలు మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.

చర్మం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు మంచి మూలకాలు ఇవి చర్మ ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం పొడిబారకుండా చేసి ముడతలను నివారిస్తాయి అలాగే అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలను కూడా నివారిస్తాయి.

బరువు తగ్గుదలకు: గుమ్మడి గింజల ఫైబర్ కు మంచి వనరులు అంటే అవి వేగంగా కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి తద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అలాగే ఇవి ఫ్యాట్స్ కు ఆరోగ్యకర వనరులు.

ముధుమేహం కోసం: గుమ్మడి గింజలకు ప్రభావవంతమైన హైపోగ్లైసిమిక్ చర్యలు ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి. హైపోగ్లైసిమిక్ చర్యలు అంటే రక్త చక్కర స్థాయిలను తగ్గించే చర్యలు తద్వారా అవి ముధుమేహం నిర్వహణ కు సహాయం చేస్తాయి.

గుండె ఆరోగ్యం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు మంచి వనరులు ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

మెదడుకు: యాంటీయాక్సిడెంట్లకు మంచి వనరులుగా గుమ్మడి గింజలు రెయాక్టీవ్ ఆక్సిజన్ జాతుల సంఖ్యను తగ్గిస్తాయి మరియు వాటి వలన మెదడుకి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి తద్వారా అల్జిమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

డ్రైఫ్రూట్స్‌లో మనకు బాగా తెలిసింది ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టేయొచ్చని డాక...
10/05/2020

డ్రైఫ్రూట్స్‌లో మనకు బాగా తెలిసింది ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టేయొచ్చని డాక్టర్లు చెబుతారు. ఆయుర్వేదంలో కూడా అనేక రోగాల మందులకు ఎండుద్రాక్ష వినియోగిస్తారు. ఎండు ద్రాక్ష ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా..

* ఎండుద్రాక్షలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది.. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

* వీటిని తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

* ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలున్న వారికి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి ఇవి చాలా మంచివి.

* ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేనివాళ్లకి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగకరం.

* ఎండుద్రాక్ష తినడం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

* ఇవి మెదడుకీ మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి.

* వీటిల్లో పొటాషియం, కెటెచిన్లు, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్ధరైటిస్‌తో బాధపడేవాళ్లకి ఎంతో మేలు. అలాగే ఇందులోని ఫినాలిక్‌ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

* తరుచూ ఎండుద్రాక్ష తింటే రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) అదుపులో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మేలు.

* ఎండుద్రాక్షలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియాని నివారిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి సాయం చేస్తుంది.

ప్రూన్స్ ఫ్రూట్స్ గురించి మీరు వినే ఉంటారు వీటిని డ్రైడ్ ప్లమ్స్' అని కూడా పిలుస్తారు. తెలుగులో పెద్ద రేగుపళ్లు అని పిలు...
09/05/2020

ప్రూన్స్ ఫ్రూట్స్ గురించి మీరు వినే ఉంటారు వీటిని డ్రైడ్ ప్లమ్స్' అని కూడా పిలుస్తారు. తెలుగులో పెద్ద రేగుపళ్లు అని పిలుస్తారు. ఈ రేగుపళ్లలో న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి పలువిధాలుగా సహాయపడుతాయి. అందుకే వీటిని కూడా హెల్తీ ఫుడ్స్ లిష్ట్ లో చేర్చేశారు . అయితే ఈ ప్రూన్స్ లేదా డ్రైడ్ ప్లమ్స్ వల్ల పొందే ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అద్భుతమైన ఈ పండులో అనేక లాభాలున్నాయి. ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..! ఈ ప్రూన్స్ (రేగుపళ్లు) గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయంతో పోరాడటానికి మరియు క్యాన్సర్ పారద్రోలేడానికి, రక్తహీనత తగ్గించడంలో సహాయపడటానికి మరియు కంటి శుక్లాలు తప్పించడానికి, బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి, రక్తంలో చెక్కర పాళ్ళను కంట్రోల్ చేయడానికి మరియు మలబద్దకం నియంత్రించడానికి ఇలా పలువిధాలుగా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది: కొన్ని పరిశోధన ప్రకారం ప్రూన్స్ రోజుకు 3-6తినడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ప్రూన్స్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దాంతో హార్ట్ అటాక్ వంటి ప్రమాధకర వ్యాధులను తగ్గించుకోవచ్చు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే రేగుపళ్ళు : రేగుపళ్ళ జ్యూస్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ ఇన్సులిన్ సెన్సివిటిని పెంచి డయాబెటిస్ ను రాకుండా రక్షణ కల్పిస్తుంది.

రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది: ప్రూన్స్ జ్యూస్ రక్తకణాల్లో మలబద్దకానికి కారణం అయ్యే హెమరాయిడ్స్ ను నివారించడానికి సహాయపడుతుంది.

మలబద్దకం నివారించడానికి: రేగుపళ్ల వల్ల మరో అతి పెద్ద లాభం మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రూన్స్ జ్యూస్ లో ఇన్ సోలబుల్ ఫైబర్(కరగని ఫైబర్)అధికంగా ఉండటం వల్ల ప్రేగులోని మలినాలను నెట్టుకొస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది: ప్రూన్స్ జ్యూస్ లో ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల . పెద్ద ప్రేగుల్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియాకు ఆహారంలా పనిచేస్తుంది. ఈ ఇన్ సోలబుల్ ఫైబర్ బ్యాక్టీరియాతో కలిసిపోయి ప్రోబయోటిక్ మరియు బ్యూటిరిక్ మరియు ఎసిటిక్ యాసిడ్స్ గా మారుతాయి. ఈ ప్రోపయోనిక్ యాసిడ్స్ కొలెస్ట్రాలో ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ ను తగ్గిస్తాయి . దాంతో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్ తగ్గించుకోవచ్చు

బరువు తగ్గిస్తాయి: మీరు బరువు తగ్గించుకోవాలంటే? ప్రూన్స్ జ్యూస్ ను త్రాగాలి ఇది చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఫ్రూనే జ్యూస్ లో ఉండే సోలబుల్ ఫైబర్ మీ డైట్ కు మాస్ ను జోడిస్తుంది. దాంతో మీకు ఎక్కువ ఆకలి అనిపించకుండా వేరే ఇతర ఆహారాల జోలికి పోకుండా చేస్తుంది.

అనీమియా తగ్గిస్తుంది: మీరు అనీమియాతో బాధపడుతున్నట్లైతే, ప్రూన్స్ జ్యూస్ త్రాగడం మంచిది. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఫ్రూనే వల్ల ఇది ఒక బెస్ట్ హెల్త్ బెనిఫిట్.

ఓస్టిరియో ఫోయోసిస్ : ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ప్రూనేలో గొప్పగా ఉన్నది.కొన్ని పరిశోధనల ప్రకారం ప్రూన్స్ రోజూ రెగ్యులర్ గా 100గ్రాములు తీసుకుంటే మహిళల్లో మోనోపాజ్ దశలొ ఓస్టిరియో ఫోసిస్ తగ్గిస్తుంది. విటమిన్స్ అధికం: ప్రూన్స్ జ్యూస్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి అధికం. కాబట్టి ఒక గ్లాసు ఫ్రూనే జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు, శరీరానికి కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

కంటి శుక్లాలను నివారిస్తుంది: ప్రూన్స్లో బీటాకెరోటిన్ అధికంగా ఉండటం వల్ల యాంటీ ఆక్సియాక్సిడెంట్స్ వల్ల కంట్లో శుక్లాలను నివారిస్తుంది

Hazelnuts make a tasty snack and are a great addition to many dishes. When a person includes them in a balanced, calorie...
21/02/2020

Hazelnuts make a tasty snack and are a great addition to many dishes. When a person includes them in a balanced, calorie-controlled diet, the nuts also provide several health benefits.

Hazelnuts contain:

vitamin E

healthy fats

protein

8 benefits of hazelnuts

Hazelnuts may improve a person’s health by:

supporting healthy bowel movements

reduce weight gain

protect against cell damage

lower levels of harmful cholesterol

improve insulin sensitivity

support heart health

reduce inflammation

improve s***m count

Unless a person has an allergy, there are few risks to adding hazelnuts to the diet. They are versatile and make an easy snack.

Macadamia nuts are high in healthy fats ( monounsaturated and polyunsaturated fats) and may help those trying to lose we...
12/02/2020

Macadamia nuts are high in healthy fats ( monounsaturated and polyunsaturated fats) and may help those trying to lose weight. One serving of macadamia nuts also contains dietary fiber, protein, manganese, thiamin, and a good amount of copper.
Macadamia nuts contain just over 1 g of natural sugar, and they are a low glycemic index food. With their many health benefits, macadamia nuts can fit into any healthful diet.

They lower risk factors for heart disease .
Macadamia nuts contain a type of vitamin E called tocotrienols.
Tocotrienols may have powerful anticancer abilities and may prevent cancer
They protect the brain
They may prevent weight gain
They stave off hunger
Macadamia nuts contain protein, high amounts of beneficial fats, and fiber.The fat takes longer to digest, Together, these nutrients can help a person feel full for longer.

పీకన్స్: వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది హార్ట్ అటాక్ ను నివారించడంలో గ...
11/01/2020

పీకన్స్: వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది హార్ట్ అటాక్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. మరియు ఇది బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

జీడిపప్పుతో ప్రయోజనాలుమన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వంటల్లో రుచికి వాడే పదార్థాల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్న...
30/12/2019

జీడిపప్పుతో ప్రయోజనాలు

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వంటల్లో రుచికి వాడే పదార్థాల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీడిపప్పు కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీన్ని కాజూ అని కూడా అంటారు.జీడిపప్పు అనగానే కొవ్వు పెరుగుతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది. జీడిపప్పులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. రోజూ మితంగా జీడిపప్పు తింటే పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు.
* జీడిపప్పు అధిక రక్తపోటును తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది.
* రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది.
* జీడిపప్పులో ఉండే లుటిస్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* ఫైబర్‌ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది
* కాపర్‌ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
* మెగ్నీషియం నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
* దంతాలు ధృడంగా మారుతాయి.
* నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
* మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తుంది.
* శరీరానికి హాని కలిగించే కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.
తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుంది.
* జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం బాధించవు.
* ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా ఉంటారు.
శరీరానికి కావలసిన అన్ని పోషకాలను జీడిపప్పు నుండి పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒలిక్‌ ఆసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని 25శాతం వరకు తగ్గించుకోవచ్చు. రక్తహీనత లేకుండా చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే జీడిపప్పునుమితంగా తీసుకుంటే అనేక రోగాల నుంచి కాపాడుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు :సెలెనియం పోషకాన్ని ఎక్కువగా కలిగివున్న బ్రెజిల్ నట్స్‌ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనా...
27/12/2019

బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు :

సెలెనియం పోషకాన్ని ఎక్కువగా కలిగివున్న బ్రెజిల్ నట్స్‌ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మన శరీరంలో మంటలు, వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. గుండెను కాపాడతాయి. చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. టెన్షన్ నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. బ్రెజిల్ నట్స్‌ని సైంటిఫిక్‌గా బెర్థోల్లెషియా ఎక్సెల్సా అని పిలుస్తున్నారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. తినేందుకు మంచి రుచి కలిగివుంటాయి. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ అడవుల్లో ఓ జాతి చెట్టు నుంచీ వీటిని పండిస్తున్నారు. అందుకే వీటిని బ్రెజిల్ నట్స్ (బ్రెజిల్ గింజలు లేదా బ్రెజిల్ పప్పులు) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌తోపాటూ... దక్షిణ అమెరికాలోని వెనిజులా, కొలంబియా, పెరూలో కూడా పండిస్తున్నారు. మిగతా ఖండాల్లో కూడా వీటిని పండించే ప్రక్రియ మొదలైంది.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం అనే పోషకం... మన శరీరానికి ఎంతో అవసరం. దాని వల్ల విషపూరిత వ్యర్థాలు మన శరీరంలోకి రాకుండా ఉంటాయి. బాడీని చల్లగా ఉంచడంలో సెలెనియం ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది సెలెనియం కొరతతో బాధపడుతున్నారు.

బ్రెజిల్ నట్స్ చెడు కొలెస్ట్రాల్ అంతు చూసి... మంచి కొవ్వును పెంచి, గుండెను కాపాడతాయి. మనకు ఎంతో అవసరమైన ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ ఈ పప్పుల్లో ఉంటాయి. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, విటమిన్ E కూడా కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ శరీరంలోని వేడి, మంటలు, నొప్పులు, వాపుల్ని తగ్గిస్తాయి.

మనకు రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి బ్రెజిల్ నట్స్‌‌కి ఉంది. వివిధ కాలాల్లో వచ్చే వ్యాధుల నుంచీ ఈ గింజలు మనల్ని కాపాడతాయి.

టెన్షన్‌తో ఉండేవాళ్లు బ్రెజిల్ నట్స్ తింటే చాలు... బ్రెయిన్‌లో సెరొటోనిన్ కెమికల్ చక్కగా పనిచేసేలా చేస్తాయి. అంతే బ్రెయిన్ చురుగ్గా మారి... టెన్షన్, తలనొప్పి, ఆందోళన వంటివి మాయమవుతాయి. చక్కటి నిద్ర పడుతుంది కూడా.

థైరాయిండ్ గ్రంథి బాగా పనిచేసేలా చేస్తుంది. మన శరీరంలో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే ఆ థైరాయిడ్ గ్రంథి చక్కగా ఉండాలి.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సీ, ఈ, మన చర్మం మెరిసేలా, సాగేలా చేస్తుంది. మృదువైన కోమలమైన స్కిన్ వచ్చేస్తుంది. ఈ గింజలు ముసలితనం రాకుండా మాగ్జిమం ట్రైచేస్తాయి.

మన బాడీలో జింక్ సరిపడా లేకపోతే ఆక్రోడెర్మాటిటిస్ ఎంటెరోపాథికా ( Acrodermatitis enteropathica ) అనే వ్యాధి సోకుతుంది. అది రాకుండా ఉండేందుకు మనం బ్రెజిల్ నట్స్ తినాలి.

జుట్టును కాపాడేందుకు బ్రెజిల్ నట్స్‌లో L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉంది.

కొంతమందికి మల బద్ధకం సమస్య ఉంటుంది. ఏం తిన్నా జీర్ణం కావు. అలాంటి వాళ్లు రెండో మాట ఆలోచించకుండా బ్రెజిల్ నట్స్ తింటే సరి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలూ పరారవుతాయి.

కండరాలు సరిగా పనిచేయకపోయినా, నొప్పి వస్తున్నా ఎముకలకు ఖనిజాలు, ఇతరత్రా కావాల్సిన పదార్థాలు పుష్కలంగా అందాలంటే... బ్రెజిల్ నట్స్‌ని తింటూ ఉండాలి. వాటిలోని ఐరన్ రక్తంలో కలిసి... ఎముకల్లోకి వెళ్లి... ధృఢంగా మార్చేస్తుంది.

మన శరీర కణాలు పాడవకుండా చేసే లక్షణం బ్రెజిల్ నట్స్‌కి ఉంది. కణాలు పాడైతే వాటిని బాగుచేస్తాయి కూడా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో చాలా మందికి కేన్సర్ సోకుతోంది. కారణం కణాలు పాడైపోతుండటమే. ఆ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా మనకు ఎంతో మేలు చేస్తాయి

ఖర్జూర తింటే కచ్చితంగా బలం వస్తుంది   ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. ఈ పండులో ఔషధ గుణాలు కూడ...
19/12/2019

ఖర్జూర తింటే కచ్చితంగా బలం వస్తుంది

ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ.
ఖర్జూరలో రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా ఉంటుంది. రకహీనతతో బాధపడుతున్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బి లను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూర పండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.
మలబద్దకముతో బాధపడే వారు పాలల్లో 4నుంచి 5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. నీరసము, నిస్సత్తువతో బాధపడుతున్నవారు కొన్ని నెలల పాటూ రోజు ఖర్జూర పండ్లు భోజనము తర్వాత తీసుకోవాలి. ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.
మూత్రం సాఫీగా కానివారు ఖర్జూరపండు తింటే వారికి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు మంచి మందు. అలాగే ఖర్జూర చెట్టు కూడా కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.
రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుంది. త్వరగా మార్పు వస్తుంది. డేట్స్ లో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ బోన్స్ హెల్తీగా ఉండటానికి , ఓస్టిరియో ఫోసిస్ కండీషన్ ను నివారించడానికి ఇవి సహాయపడుతాయి. దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా, ఐరన్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది.. ఐరన్ లోపంతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. డేట్స్ లో ఉండే విటమిన్ సి, ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది

Address

Imampanja Street , Mainbajar Cross , 1town
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when JOEL NUTS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JOEL NUTS:

Share