AMR Services23 refrigeration and air conditioner works

AMR Services23 refrigeration and air conditioner works All type of refrigerators and air conditioners and washing machines and micro oven services

17/12/2025
Happy new year 2020
01/01/2020

Happy new year 2020

Avoid the plastic not for save for animals
17/10/2019

Avoid the plastic not for save for animals

happy Independence Day
15/08/2019

happy Independence Day

15/02/2019

Get ready to summer is his full services

15/12/2018

నల్లగా మారిపోతున్న రాగి, వెండి వస్తువులు
అధికస్థాయిలో సల్ఫర్‌, హెచ్‌సీఎల్‌, పొటాషియం
శాస్త్రీయ సర్వే లేదంటున్న కాలుష్య నియంత్రణ మండలి

మురుగు కాల్వల నుంచి సల్ఫర్‌ డయాక్సైడ్‌, హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌(హెచ్‌సీఎల్‌), పొటాషియం, అమోనియం వంటి 12 రకాల వాయువులు అధిక మోతాదులో విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏసీ, ఫ్రిజ్‌ల్లోని అల్యూమినియం, కాపర్‌తో తయారు చేసిన పరికరాలు కాలుష్యానికిలోనై త్వరగా చిల్లులు పడుతున్నాయి. దీంతో గ్యాస్‌లీకయి మరమ్మతులకు గురవుతున్నాయి.

ఏడాదిలోపే ఏసీ ఎందుకు చెడిపోయింది అని పలువురు తలలు పట్టుకుంటున్నారు. కాపర్‌ కాయిల్స్‌కు రంధ్రా లు పడి గ్యాస్‌ పోయి ఏసీలు మరమ్మతులకు గురవుతున్నాయి. జిల్లాలో అక్కడక్కడ ఈ తరహా ఫిర్యాదులు రావడంతో ఆయా కంపెనీల ఇంజనీర్లు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లోనే ఇటువంటి ఫిర్యాదులు రావడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడి డ్రెయినేజీల నుంచి సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాయువు విడుదల మోతాదుకు మించి వస్తుండటంతో కాపర్‌ కాయిల్స్‌కు రంధ్రాలు పడుతున్నాయని నిర్ధారించారు. ఇదేరీతిలో ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమా రు 500 ఏసీలకు పైగా మరమ్మతులు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు.

భీమవరం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏసీలు, ఫ్రిజ్‌లు తరచూ మరమ్మతులకు గురవుతున్నా యి. కారణమేమిటో అర్థంకాక ఇంతకాలం వినియోగదారులు లబోదిబోమనే వారు. తరచూ మరమ్మతులకు సంబంధించి వినియోగదారులు వస్తుండటంతో ఆయా కంపెనీల నిర్వాహకులు దీనిపై ప్రత్యేకంగా పరిశీలించా రు. ప్రధానంగా మురుగు కాల్వల పక్కన ఉన్న గృహాల్లోని ఏసీలు, ఫ్రిజ్‌లే ఈ తరహా మరమ్మతులు వస్తున్నట్లు కంపెనీల ఇంజనీర్లు గుర్తించాయి. ఈ విషయంపై లోతు గా అధ్యయనం చేస్తే వాటిల్లో నుంచి విడుదలవుతున్న విషవాయులే ఈ మరమ్మతులకు కారణమని గుర్తించా రు. ఈ సమస్య ఇక్కడేకాదు, దేశంలోని ప్రధాన నగరా లన్నింటిలో సర్వసాధారణమని కంపెనీల సిబ్బంది చెబు తుండడం గమనార్హం.

ఏసీలే ఎందుకంటే...
సాధారణంగా డ్రెయినేజీల్లో వ్యరాలు రెండు నుంచి మూడు రోజుల పాటు కుళ్ళినప్పుడు దాని నుంచి సల్ఫర్‌ విడుదలై ఆక్సిజన్‌తో కలిసి సల్ఫర్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. దీంతోపాటు మిథేన్‌ కూడా విడుదలవుతుంది. ఈ సల్ఫర్‌ డయాక్సైడ్‌ గాలిలో 50మ్యూజీ ఫర్‌ మీటర్‌ స్క్వేర్‌ గా ఉండవచ్చు. ఇది డ్రెయినేజీనుంచి విడుదలై కొంత దూరం వెళ్లిన తరువాత పల్చబడిపోతుంది. ఈ సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రాగి, వెండి, బంగారం వంటి వస్తువులపై ఆక్సిజన్‌తో చర్య కారణంగా పైపొరను దెబ్బతీస్తుంది. దీంతో అవి దెబ్బతింటాయి. అయితే అన్ని వస్తువుల్లోనూ ఉన్న కాపర్‌ దెబ్బతినదు. ఏసీ ల్లోనే ఎందుకంటే ఏసీ కంప్రెషర్‌, గ్యాస్‌ కాయిల్‌ చల్లబర్చడానికి ఫ్యాన్‌ తిరుగుతుంటుంది. ఇది ఆ చుట్టు పక్కల ఉన్న గాలులను తనవైపు వేగంగా లాక్కుంటుంది. దీంతో ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న సల్ఫర్‌డయాక్సైడ్‌ మొత్తం అక్కడికే చేరి కాపర్‌ కాయిల్‌ను నాశనం చేస్తుంది. దీంతో ఏసీలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఇదేపరిస్థితి ఫ్రిజ్‌ల వద్ద ఉన్నా అక్కడకు ఈ గాలులు వేగంగా చేరే పరిస్థితి ఉండదు కాబట్టి అవి ఎక్కువ కాలం తరువాత దెబ్బతింటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రమాదం మించితే... ఇబ్బందే..
ఈ సల్ఫర్‌ డయాక్సైడ్‌ గాలిలో 50మ్యూజి ఫర్‌ మీటర్‌ స్క్వేర్‌ కన్నా ఎక్కువ అయితే ఆరోగ్యానికి కూడా ఇబ్బ ందే. ఊపిరితిత్తుల్లోచేరి అనేక వ్యాధులకు కారణమవు తుంది. అయితే ఇది ప్రమాదకర స్థితి లో ప్రస్తుతం జిల్లాలో ఉందా లేదా అనే దానిపై శాస్త్రీయ అధ్యయనమే దీ లేదు.జిల్లా కాలుష్యనియ ంత్రణ మండలి వద్ద కాలుష్య తనిఖీకేంద్రాలు ఉన్నప్పటికీ ఇవి కేవలం గాలిలో ఉన్న దుమ్ము, కార్బన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటివి కొలిచేందుకే ఉన్నాయి. డ్రెయినేజీల నుంచి విడుదల య్యే సల్ఫర్‌, అమోనియం, పొటాషియం వంటివి ఎంత విడుదల అవుతున్నాయి. ఎంత ప్రమాదంలో ఉన్నా యనే దానిపై ఇప్పటివరకు జిల్లాలో అధ్యయనం లేదు.

గుంటూరు,కృష్ణ,తూర్పు,
ప గో జిల్లాలో అధికం...
భీమవరం యనమధుర్రు డ్రైన్ వెంబడి సుమారు 500 మీటర్లు వరకు మరియు ఫాక్టరీల డ్రైన్ల వద్ద ఇటువంటి ఘటనలు ఎక్కువ గా రావడాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వద్ద ప్రస్తావించగా ఆయా ప్రాంతాల్లో డ్రెయినేజీ ఎక్కవ కాలం నిల్వ ఉండడం కారణంగా భావిస్తున్నామన్నారు.
భీమవరం లో వేoడ్ర ఫ్యాక్టోరి వ్యర్డలు మరియు భీమవరం మురుగు ఎక్కువగా
యనమధుర్రు డ్రైన్లో విడుదల చెయడం ఒక ముఖ్య కారణం,

ఎక్కువ వేగంగా కదిలే డ్రెయినేజీల వద్ద ఈ పరిస్థితి ఉంది. రెండు రోజుల పాటు రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం కదలని డ్రెయినేజీల్లో దీని మోతాదు ఎక్కువగా ఉంటుందన్నారు. దేవాలయా లు అధికంగా ఉండేచోట్ల గంధం వంటివి వినియోగించిన తరువాత డ్రెయినేజీల్లో పడవేయడం, అవి ఎక్కువ దూరం ప్రయాణించకపోవడం వల్ల కూడా ఈ తరహా పరిణామాలు ఏర్పడతాయన్నా రు. జిల్లాలలో ఎంతశాతం ఉన్న ది అనేది మాత్రం నిర్ధారించలేదని తెలిపారు. ఏదే మైనా ఏసీలకు మాత్రం జిల్లా వ్యాప్తంగా డ్రెయినేజీ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ సమస్య ఉందని నిర్ధారించవచ్చు. అయితే ఇది ఎక్కువ అయితే మాత్రం మానవుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దగ్గుతో ప్రారంభమై గుండె సమస్యల వరకు దారితీ స్తాయని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. రెండేళ్లలో ప్రధానంగా యనమధుర్రు డ్రైన్ వెంబడి ప్రాంతాల్లో ఈతరహా ఫిర్యాదులుఎక్కువగా వచ్చాయి.

పరిష్కారం ఏమిటంటే...
తరచూ బ్లీచింగ్‌ చల్లడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ఇంజనీర్‌ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎక్కువగా మురుగు పారుదల జరిగే సమయంలో ఈ పరిస్థితి ఉండదన్నారు. మురుగునిల్వ ఉంటే మాత్రం ఈ వాయువులు ఎక్కువగా విడుదలవుతాయన్నారు. దీనివల్ల రాగి, అల్యూమినియం మాత్రమే కాకుండా చెవులకు పెట్టుకునే వన్‌గ్రామ్‌ గోల్డ్‌, బెంటెక్స్‌ ఆభరణాలు త్వరగా నల్లబడతాయని తెలిపారు.

ఈ సమస్య మనకు కొత్తదే
మురుగుకాల్వల నుంచి విష వాయువు లు విడుదల అవడం అనే సమస్య మనకు కొత్తదే. అయితే ఇది అభివృద్ధి చెందిన నగరాలు గతంలో ఎదుర్కొన్న వే. ఇప్పుడు అక్కడ ఈ సమస్య పరిష్కారం కోసం యంత్రా ంగం చర్యలు తీసుకుంటోంది. మన వద్దా అలా చర్యలు తీసు కోవాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయిన్‌ నిర్మాణం పూర్తయితే ఈ సమస్య తీరే అవకాశం ఉంది. కనుక యూజీడీ పనులు వేగవంతం చేయాలి. అదేవిధంగా బ్లీచింగ్‌ చల్లడం అనేది మరవకూడదు.

Address

Gunadala
Vijayawada
520004

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

919052795495

Alerts

Be the first to know and let us send you an email when AMR Services23 refrigeration and air conditioner works posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share