Life insurence corporetion of india

Life insurence corporetion  of india Life insurance in India made its debut well over 100 years ago. What follows is an attempt to acquaint readers wi

In our country, which is one of the most populated in the world, the prominence of insurance is not as widely understood, as it ought to be.

New children policy
17/02/2024

New children policy

21/01/2024

కొత్త పెన్షన్ పాలసీ

న్యూ జీవన్ థార-2

ప్లాన్ నెం 872 -

డిఫర్డ్ యాన్యూటీ రెగ్యులర్ మరియూ సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీ -

సింగిల్ ప్రీమియం మినిమం 1 లక్ష ప్రీమియం తో మొదలు.

మరియూ

రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ మోడ్స్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మరియూ మంత్లీ ప్రీమియం పేమెంట్ మోడ్స్ లతో వయస్సు ను బట్టి మినిమం 16000/- ప్రీమియం తో కట్టుకోన వచ్చును.

ఈ జీవన్ దారా-2 పెన్షన్ పాలసీ

20 సంవత్సరాల వయస్సు నుండి

80 సంవత్సరాల వయస్సు వరకు చేయవచ్చును.

పెన్షన్ పేమెంట్ మొదలయ్యే వయస్సు.....

రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ పాలసీ లలో 35 సంవత్సరాల నుండి పెన్షన్ మొదలగును.

మరియూ సింగిల్ ప్రీమియం పేమెంట్ పాలసీ లలో పెన్షన్ ప్రారంభమయ్యే వయస్సు 31 సంవత్సరాల నుండి పెన్షన్ పేమెంట్ ఇవ్వబడును.
ప్రీమియం కట్టుకునే టర్మ్ కస్టమర్ ఎంచుకొనే పెన్షన్ డిఫరెంట్ పీరియడ్ తో సమానముగా ఉండాలి.
టర్మ్ 5 సంవత్సరాల నుండి 15 ఏళ్ల వరకు కట్టుకొనవచ్చును.

76 వయస్సు నుండి 95 వయస్సు వరకు 5% పెన్షన్ అదనంగా ఇవ్వబడును.

04/12/2022

*అసలెంత భీమా ఉండాలంటే... !*

తగిన మొత్తానికి..వార్షికాదాయానికి 10-12 రేట్లు..బీమా గురించి మాట్లాడేటప్పుడు ఆర్ధిక నిపుణులు చెప్పే సూచనలివి. అసలు *'తగినంత'* అంటే ఎంత? దాని లెక్క ఎలా? పాలసీ తీసుకునేప్పుడు దేన్నీ ప్రామాణికంగా తీసుకోవాలి? తెలుసుకుందాం పదండి!

*జీవిత బీమా పాలసీలు ఉన్నాయా?* అని అనగానే..'ఓ! నాలుగైదు ఉన్నాయి' అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. నిజానికి ఇవి సరిపోతాయా అని సమీక్షించుకుని వారి సంఖ్య చాలా తక్కువని చెప్పవచ్చు. పన్ను తప్పించుకోవడానికో, మిత్రుడి మొహమాటం కొద్దో పాలసీలు తీసుకునే వారూ ఉంటారు. దురదృష్టం వెంటాడినప్పుడు కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత *'నాదే'* అని అనుకునే వారందరూ *'తగినంత'* మొత్తానికి బీమా చేయించాల్సిందే. బీమా పాలసీ మొత్తం ఎంతుండాలనేది పాలసీ అనేక అంశాల పై ఆధారపడి ఉంటుంది. వయసు, ఆధార పడిన వారి సంఖ్యా, ఆదాయం, వార్షిక ఖర్చులు, గృహ, వాహన, ఇతర రుణాలు, మీ పొదుపు, మదుపులు, జీవన విధానం, భవిష్యత్తులో వచ్చే అవసరాలకు కావాల్సిన మొత్తం ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటేనే ఎంత బీమా తీసుకోవాలన్న విషయం లో స్పష్టత ఏర్పడుతుంది.

*తెలుసుకునే పద్దతి:*

పైన తెలిపిన‌ట్లు ఎవరైనా ఎంత బీమా కావాలంటే కనీసం 10-12 రెట్లు ఉండాలి అనే మాట వినపడుతూ ఉంటుంది. ఒక విధంగా చూసినప్పుడు ఇది సరైనదే. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఇదే సూత్రం మనకి వర్తిస్తుందని చెప్పలేము. యువకులుగా ఉండి, ఆధార పడిన వారు ఎవరూ లేని వారికి అధిక మొత్తానికి బీమా పాలసీలు అక్కర్లేదు. కానీ, వారు పెరిగి పెద్ద అవడానికి, చదువులు, ఇతర విషయాలకు అయ్యే ఖర్చులు భారీగానే ఉంటాయి కదా! ఈ వయసు లో వారికేమైనా అయితే, తల్లిదండ్రులకు జరిగే మానసిక నష్టాన్ని పూడ్చడం ఎవరివల్లా కాదు. కానీ, ఆర్ధికంగా వారికి ఎంతో కొంత అండ అందించాల్సి ఉంటుంది కదా! అందుకే, ఆర్జన మొదలు పెట్టగానే అవసరమైనంత జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది.

*ప్రతి వ్యక్తి ఆర్ధిక పరిస్థితి, అవసరాలూ వేరు వేరుగా ఉంటాయి. చాలా మంది బీమా తీసుకునే ముందు ప్రీమియం ఎంత? అని చూస్తుంటారు. భరించగలిగిన ప్రీమియం ని బట్టే పాలసీ ని ఎంచుకుంటారు. దీని వల్ల ఇప్పటికిప్పుడు నష్టం లేకపోయినా..భవిష్యత్తులో అవసరం ఏర్పడినప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీమా పాలసీలు ఎంత మొత్తం ఉండాలనేది నిర్ణయించుకోవాలి. దీని కోసం కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి.*

*ఆదాయానికి అనుగుణంగా..*

ప్రస్తుత వార్షిక ఆదాయాన్ని బట్టి మీకు ఎంత బీమా అవసరం అన్నది నిర్ణయించే పద్ధతిది. దీనికి అనుసరించాల్సిన సూత్రం ఏంటంటే..
*బీమా మొత్తం = వార్షికాదాయం x పదవీ విరమణ చేయడానికి ఉన్న వ్యవధి(ఏళ్లలో).*

*ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 35 ఏళ్ళు. పదవీ విరమణ కు ఇంకా 23 ఏళ్ళు ఉన్నాయి. వార్షికాదాయం రూ. 3 లక్షలు అనుకుందాం. అప్పుడు అతనికి కావాల్సిన బీమా మొత్తం రూ. 3,00,000 x 23 = రూ. 69,00,000.*

*ఆదాయానికి అనుగుణంగా పాలసీ* తీసుకునేందుకు మరో పధ్ధతి కూడా ఉంది. తక్కువలో తక్కువ, వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు ఉండాలి. 20-30 ఏళ్ళ వయసు లో ఉన్న వారు 5 నుంచి 10 రెట్లు, 30 నుంచి 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15-20 రెట్లు ఉండాలి. 40 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉంటే 10-15 రెట్లు, 50-60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు వార్షికాదాయానికి కనీసం 5-10 రెట్లు విలువ గల బీమా హామీ తో పాలసీ తీసుకోవాలి. రుణాలను కూడా కలపడం మర్చిపోకండి.

*జీవిత విలువ ఆధారంగా:*

వ్యక్తి జీవితానికి డబ్బుతో విలువ కట్టలేం. కానీ, అతని/ఆమె అవసరం, బాధ్యతలు తీర్చేదెవరు?అందుకే, ప్రతి వ్యక్తికీ ఒక ఆర్ధిక విలువ ఉంటుంది. దాన్ని లెక్కించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా..ఒక వ్యక్తి తాను ముందు ముందు ఎంత సంపాదించబోతాడు, కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది లాంటి విషయాలను పరిగణ లోకి తీసుకుంటారు.

*ఒక ఉదాహరణ చూద్దాం. రాము వయసు 40 ఏళ్ళు, అతను తన 60వ ఏట పదవీ విరమణ చేయదలుచుకున్నాడు. ప్రస్తుతం అతని వార్షిక వేతనం రూ. 3,50,000. అతని వ్యక్తిగత ఖర్చులు, ఆదాయపు పన్ను, జీవిత బీమా పాలసీల ప్రీమియం తదితరాలు కలిసి ఏడాదికి రూ. 1,25,000 అవుతున్నాయి. అంటే కుటుంబానికి ఇంకా ఏడాదికి రూ. 2,25,000 మిగులుతున్నాయి. కాబట్టి రాము వార్షిక విలువ రూ. 2,25,000 గా అనుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా రాము కు 41వ ఏట ఏదైనా జరిగితే..అతని కుటుంబానికి ఎలాంటి ఆదాయం ఉండదు. మరి ఆ కుటుంబానికి రోజులు గడిచేదెలా? రాము ఎంత మొత్తానికి బీమా తీసుకుంటే బాగుంటుంది? లెక్క చూద్దాం.*

*రాము ఆర్జించే మొత్తం లో కుటుంబానికి అందుతున్నది రూ 2,25,000. అంటే, రానున్న 20 ఏళ్లలో అందే మొత్తం రూ. 2,25,000 x 20 ఏళ్ళు = రూ. 45,00,000. అయితే, ఈ మొత్తం అందేది 20 ఏళ్లకు కలిపి కాబట్టి, దాని నేటి విలువ ఎంతనేది చూసుకోవాలి. ప్రతి ఏటా 8 శాతం రాబడి అంచనాతో చూసుకుంటే కావాల్సిన మొత్తం సుమారుగా రూ. 23,85,000.*

ఈ లెక్కను బీమా పాలసీ తీసుకోవాలనుకుని భావించే ప్రతి ఒక్కరూ వేసుకోవడం మంచిది. దీనివల్ల తగినంత మొత్తానికి బీమా తీసుకోవడం సులువు అవుతుంది. చాలా మంది ఆర్ధిక నిపుణులు కూడా అవసరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకోవాల్సిందిగానే సూచిస్తున్నారు.

*ప్రీమియం మాటేంటి?*

*చూస్తే..పెద్ద పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి. మరి వాటికి చెల్లించాల్సిన ప్రీమియం సంగతి ఏంటి? అనే సందేహం రావచ్చు. తక్కువ ప్రీమియం తో, ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలు అందుబాటు లో ఉన్నాయి. వయస్సు ఆధారంగా ప్రీమియం మారుతుంటుంది.*

మీ, కుటుంబ అవసరాలు ఏంటి? బాధ్యతలేంటి? అనేది పూర్తిగా లెక్కలేసుకుని బీమా పాలసీ తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..అవసరాలు, ఆదాయం, ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. దీనికి అనుగుణంగా ప్రతి మూడేళ్లకోసారి మీ బీమా అవసరాలను సమీక్షించుకోండి.

*@@ కృష్ణా బెజావాడ , CELL :9912676569 @@*

Happy independence day
14/08/2022

Happy independence day

18/07/2021

LIC Jeevan Umang: నెలకు రూ.1302 కట్టండి పాలసీ ముగింపులో రూ. 27.60 లక్షల తీసుకోండి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి LIC ఐపీవోను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలకల్లా స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎల్ఐసీ షేర్ల నమోదు పూర్తి కానుంది. త్వరలో ఈ ఐపీవో నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం పూర్తికానుంది. LIC IPOపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు పెట్టుందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడానికి అవకాశం కోసం చూస్తున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న మీకు కూడా LICలోని కొన్ని ప్రత్యేక పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద డబ్బు సంపాదించవచ్చు. మీ కుటుంబానికి భవిష్యత్తుతోపాటు సురక్షితమైన భద్రతను కల్పించవచ్చు. ఈ రోజు LICలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారికి ఈ ప్రత్యేక విధానం గురించి తెలియజేద్దాం.
మేము LIC ప్రజాదరణ పొందిన విధానం.. జీనవ్ ఉమాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే 3 నెలల వయస్సు నుండి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వాస్తవానికి ఇది ఎండోమెంట్ ప్లాన్. ఇందులో, లైఫ్ కవర్‌తో పాటు, మెచ్యూరిటీపై ఒకే మొత్తం లభిస్తుంది. ఈ పథకంలో మరో లక్షణం ఏమిటంటే ఇది 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది.
ఈ పాలసీలో ఒక వ్యక్తి ప్రతి నెలా రూ .1302 ప్రీమియం చెల్లిస్తే… ఒక సంవత్సరంలో ఆ మొత్తం రూ .15,298. ఈ పాలసీని 30 సంవత్సరాల తరువాత అమలు చేస్తే.. నికర మొత్తం సుమారు రూ .4.58 లక్షలు అవుతుంది. మీ పెట్టుబడిపై 31 వ సంవత్సరం నుండి కంపెనీ ప్రతి సంవత్సరం 40 వేల రాబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీరు 31 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు ఏటా 40 వేల రిటర్న్ తీసుకుంటే.. మీకు సుమారు రూ .7.60 లక్షలు లభిస్తాయి.
జీవన్ ఉమాంగ్ పాలసీ భారీ రాబడితో పాటు కొన్ని రైడర్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు… పెట్టుబడిదారుడు ప్రమాదంలో మరణిస్తే లేదా పాలసీ ప్రకారం వికలాంగుడైతే రైడర్ బెనిఫిట్ అనే పదం అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 80 C కింద చెల్లించే ప్రీమియంపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా మీరు ఈ పాలసీ నుండి డబ్బు సంపాదించడమే కాదు.. మీ కుటుంబ భవిష్యత్తును కూడా మీరు భద్రపరచవచ్చు, ఎందుకంటే పాలసీ నడుస్తున్న సమయంలో పాలసీ హోల్డర్ మరణిస్తే, అప్పుడు నామినీ పూర్తి మొత్తాన్ని పొందుతాడు.

New policy arrival today  more details please contact  what's up 9912676569
16/04/2021

New policy arrival today more details please contact what's up 9912676569

25/08/2020

*మిత్రులారా...జీవన్ శాంతి పాలసీ చేయడానికి లేదా చేసుకోడానికి మనకు మరొక రోజు అద్భుతమైన అవకాశం వచ్చింది*................ *మిత్రులారా..మీ మీ వయసును బట్టి నెలకు Rs.1000.00 పెన్షన్ కావాలంటే జీవన్ శాంతి పాలసీ లో కనీసం 235000 నుండి 255000 డిపాజిట్ చేయవలసి ఉంటుంది* *అదే ఒక్క రోజు మిస్సయితే ,నెలకు Rs.1000.00 పెన్షన్ కావాలంటే కనీసం 265000 నుండి 290000 వరకు డిపాజిట్ చేయవలసి వస్తుంది*........ *ఆలోచించండి మిత్రులారా..అద్భుతమైన అవకాశం మనకోసమే వచ్చిందేమో*

Interested people hurry up
20/08/2020

Interested people hurry up

17/08/2020
Jeevan shanti
27/05/2020

Jeevan shanti

Address

Bunder Road
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Life insurence corporetion of india posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Life insurence corporetion of india:

Share