Sri Laxmiganapathi Rice Traders

Sri Laxmiganapathi Rice Traders proprietor

ఓం నమః శివాయ 🙏 అందరికీ మహా శివరాత్రి శుభకాంక్షలు
08/03/2024

ఓం నమః శివాయ 🙏 అందరికీ మహా శివరాత్రి శుభకాంక్షలు

07/10/2019
LOHITHA BRAND RICE IS AVAILABLE.
10/06/2018

LOHITHA BRAND RICE IS AVAILABLE.

BECARE FULL FRNDS*సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్*గత 10 సంవత్సరా...
14/02/2018

BECARE FULL FRNDS
*సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్*

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధిక ధర గల సన్న బియ్యాన్ని నమూనాగా చూపించి,రేషన్ బియ్యాన్ని అంటగట్టి డబ్బులు దండుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు...

ఖమ్మం జిల్లాలోని తల్లాడా మండలం అన్నారుగూడెం కు చెందిన సుంకర కనకరావు,సోదా వెంకటేశ్వర్లు మరియు అదే మండలం నర్సింహారావు పేట కు చెందిన గోపిశెట్టి నాగేశ్వరరావు ఒక ముఠా గా ఏర్పడి తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్ తో పాటు,వరంగల్,ఖమ్మం,ఆదిలాబాద్,రంగారెడ్డి,మెదక్,నల్గొండ,హైదరాబాద్ లలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ,గుంటూరు జిల్లాలలో ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కొని,వాటిని సన్న బియ్యంగా నమ్మించి మోసం చేస్తూ,డబ్బులు దండుకుంటున్న ముగ్గురు సభ్యులు గల ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి,కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీసుల సహాయంతో రిమాండ్ కు తరలించడం జరిగింది...

*మోసం చేయు విధానం....*

ఖమ్మం జిల్లా తల్లాడా మండలానికి చెందిన కనకరావు,వెంకటేశ్వర్లు,నాగేశ్వరరావు లు ఒక ముఠాగా ఏర్పడి,ఎలాగైనా సులభంగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని,తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో గలా జిల్లాలలో ఒక ఆటో లో తిరుగుతూ పట్టణానికి దగ్గరలో గలా పల్లెటూర్లలో ప్రజల వద్ద రేషన్ బియ్యాన్ని కిలోకి 5 నుంచి 10 రూపాయల వరకు చెల్లించి,కొనుగోలు చేసి,వారి ఇంటి వద్దే వారితో తెచ్చుకున్న 25 కిలోల బస్తాలలో నింపుకొని,వాటిని సీల్ చేసుకొని తమ ఆటోలో వేసుకొని,దగ్గర్లో గల పట్టణంలోకి వెళ్లి ఒక చౌరస్తాలో రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న ఆటోని ఆపి,ఈ ముగ్గురు నిందితులు వాడలలో తిరుగుతూ తమ వద్ద సన్న బియ్యం ఉన్నాయని,కొంటారా అని అడుగుతూ,అమాయక ప్రజలు ఎవరైనా తమకు కావాలి,కొంటాము అని చెప్పగానే ఆటోని వారి వద్దకు తీసుకెళ్లి,తమ వద్ద ముందుగానే ఉంచుకున్న సన్న బియ్యం గల బస్తాలోంచి కొన్ని బియ్యాన్ని నమూనాగా చూపించి,బయటి కన్నా కొంత తక్కువగా ఇస్తామని చెప్పి,వారు కోరినన్ని క్వింటాళ్ల బియ్యాన్ని వారి వద్దగల రేషన్ బియ్యం బస్తాలను వేసి,డబ్బులు దండుకొని,వారు వెళ్లి బియ్యాన్ని పరీక్షించుకునే లోపు అక్కడి నుంచి పరారీ అవుతున్నారు...అట్టి రేషన్ బియ్యాన్ని కొనుక్కున్న బాధితులు లబోదిబోమంటూ మోసపోయామనుకుంటున్నారు...ఇట్టి మోసాన్ని గుర్తించే లోపే వారు అట్టి ప్రాంతాన్ని వదిలివెళ్లిపోతున్నారు...

*పట్టుబడిన విదానం....*

కరీంనగర్ పట్టణం లోని తిరుమల నగర్ లో నివాసం ఉంటున్న అజ్మీరా రాజు అను వ్యక్తి గత 10 రోజుల క్రితం అనగా జనవరి 31 వ తేదీన ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి సన్న బియ్యం అమ్ముతున్నాం కొంటారా అని అడగగా, వారు 4000/- రూపాయలకు క్వింటాలు అని చెప్పగా,ఇతను 3500/- రూపాయల చొప్పున అడిగి 3 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేసి,10,500/- రూపాయల నగదు చెల్లించగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు...తీరా ఇంట్లోకెళ్లి చేసుకోగా అవి 1/- కి కిలో ఇచ్చే రేషన్ బియ్యమని గుర్తించి,మోసపోయామని భావించి కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీసులను ఆశ్రయించగా కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది...ఇట్టి విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ, చుట్టూ పక్కల జిల్లాలలో విచారించి,వారు వచ్చిన ఆటో గురించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి,ఎట్టకేలకు వారు ఖమ్మం జిల్లా,తల్లాడా మండలానికి చెందిన కనకరావు,నర్సింహారావు,వెంకటేశ్వర్లు గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా,వారు కరీంనగర్ తో పాటు మిగతా జిల్లాలలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన మోసాలను తెలపడం జరిగింది...

*నిందితులు..మోసాలలో సిద్ధహస్తులు...*

ఇట్టి నిందితులు గత 10 సంవత్సరాలుగా ఇదే విధంగా మోసాలను చేస్తూ ప్రజలను మాటలలో పెట్టి,సన్న బియ్యాన్ని చూపి,రేషన్ బియ్యాన్ని అంటగట్టి ,అధిక మొత్తం లో డబ్బులు దండుకుంటూ మోసం చేస్తూన్నారు..ప్రజలకు లక్షలల్లో కుచ్చుటోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న...వీరిపై ఇప్పటి వరకు చాలా జిల్లాలలో కేసులు నమోదు అయ్యాయి..ఐనా వీరు మోసాలను మానకుండా,ప్రాంతాలను మారుస్తూ ఇదే తరహా మోసాలు చేస్తూ బ్రతుకుతున్నారు...

*రేషన్ బియ్యం సప్లై టైంలో కొంటూ... జీతాలు వచ్చే సమయంలో అమ్ముతూ...*

ఇట్టి నిందితులు అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు రేషన్ బియ్యం వచ్చే సమయాన్ని గమనిస్తూ, అదే సమయంలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని,వాటిని నిల్వ చేసి,ఉద్యోగస్తులకు జీతాలు వచ్చే సమయంలో అట్టి బియ్యాన్ని ఆటోలో వేసుకొని తిరుగుతూ,అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు...జీతం వచ్చినప్పుడు,పట్టణంలో ఉద్యోగస్తుల వద్ద డబ్బులు ఉంటాయి కాబట్టి ఇట్టి బియ్యాన్ని అధిక ధరకైనా కొంటారని,కావున మోసం చేయడం సులభం అవుతుందని చెప్పడం కోసమెరుపు...

*ఆటోలో తిరుగుతూ...పరికరాలన్ని వెంట తెస్తూ....*

నిందితులు ఎక్కడికి వెళ్లినా ఆటోలో వెళ్తూ,రేషన్ బియ్యం కొని,వాటిని అక్కడే వారితో తెచ్చుకున్న ఖాళీ బస్తాలలో,వారి వద్దగల బస్తాలను కుట్టడానికి ఉపయోగించే మెషిన్ తో కుట్టి,అట్టి బస్తాలను సమీపంలో గల పట్టణం లో సన్నబియ్యమని అమ్ముతూ మోసం చేస్తున్నారు...వీళ్ళు ఎక్కడికి వెళ్లినా ఆటోలో వెళ్తూ,ఖాళీ బియ్యం బస్తాలు, కుట్టే మెషిన్ వారి వెంటపెట్టుకొని వెళ్తారు...ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మోసం చేస్తూ అన్ని తప్పించుకు తిరుగుతున్నారు...

*నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సామగ్రి,వస్తువులు...*

~ 10,500/- రూపాయల నగదు..
~ఒక ఆటో నం.TS 04 UC 2771..
~12 బస్తాలలో(ఒక్కటి 25కిలోల చొప్పున) గల రేషన్ బియ్యం..
~ఒక బస్తా(25కిలోలు) జై శ్రీరామ్ బియ్యం..
~బియ్యం బస్తాలు కుట్టడానికి ఉపయోగించే ఒక్క మెషిన్...
~ఖాళీ బియ్యం బస్తాలు...

*నిందితుల యొక్క పూర్తి వివరాలు...*

1.సుంకర కనకరావు s/o వీరయ్య,42సం, మున్నూరు కాపు,r/o అన్నారుగూడెం(గ్రా),తల్లాడ(మం),ఖమ్మం...
2.గోపిశెట్టి నాగేశ్వరరావు s/o రాఘవయ్య,35సం, మున్నూరు కాపు,r/o నర్సింహారావు పేట(గ్రా),తల్లాడ(మం),ఖమ్మం...
3.సోదా వెంకటేశ్వర్లు s/o వీరయ్య,35సం, మున్నూరు కాపు,r/o అన్నారుగూడెం,తల్లాడ(మం),ఖమ్మం...

*నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సిబ్బంది వివరాలు..*

1.శ్రీనివాసరావు,సిఐ,టాస్క్ ఫోర్స్..
2.మాధవి,సిఐ,టాస్క్ ఫోర్స్..
3.కిరణ్,సిఐ,టాస్క్ ఫోర్స్..
4.శ్రీనివాసరావు,సిఐ,కరీంనగర్ 1 టౌన్..
5.రమేష్,ఎస్సై,టాస్క్ ఫోర్స్..

మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది...

Address

1-8-141 Balasamudram
Warangal
506001

Opening Hours

Monday 9:15am - 1:30pm
2pm - 9pm
Tuesday 9:15am - 1:30pm
2pm - 9pm
Wednesday 9:15am - 1:30pm
2pm - 9pm
Thursday 9:15am - 1:30pm
2pm - 9pm
Friday 9:15am - 1:30pm
2pm - 9pm
Saturday 9:15am - 1:30pm
2pm - 9pm
Sunday 9:15am - 1pm
4:30pm - 8pm

Telephone

+919949543342

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Laxmiganapathi Rice Traders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Laxmiganapathi Rice Traders:

Share