SRK Ventures

SRK Ventures Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SRK Ventures, Consulting Agency, Hyderabad.

21/02/2024

Fri, 23 - Sun, 25 Feb 2024 International Conference on Reproductive Health Science with Emphasis on Innovation, Integration, and Implementation & Annual Meeting of the Indian Society for the Study of Reproduction and Fertility...

Classic Antique Fairs will be hosting their renowned Antique and Arts Fairs at different UK locations. With 100+ specialist dealers showcasing top-notch items, these fairs are a must for collectors

21/02/2024

Fri, 23 - Sun, 25 Feb 2024 Asia Jewels Show- Hyderabad 38th edition Taj Krishna, Hyderabad

"India's most opulent Fine Jewellery Exhibition & Sale"
Asia Jewels Show 2023 Hyderabad - Its BACK ! After repeating success in its last edition of Hyderabad Asia Jewels Show - India's most popular & opulent Retail Fine Jewellery Exhibition & Sale is back in your city.This time in much bigger way in one of the most luxurious 5 star Hotel Taj Krishna at Banjara Hills.Shop from India's best handpicked Jewellery designers under one roof in comfort of safe & luxury venue.Mark your dates & Register now to get your VIP Entry Pass.

Highlights
Curated best handpicked Jewellery Designers from across India.
Shop in luxury of 5 star safe and comfortable Venue.
Over 50000 all new designs under one roof.
Recommended for

21/02/2024

Fri, 23 Feb 2024 International Conference On Electrical and Electronics Engineering (ICEEE) online edition available Hyderabad •

NCBMESS aims to unite academics and industry professionals in Civil and Mechanical Engineering. It discusses advancements in the field. English is the official language. Papers will be included in the conference proceedings. UGC and Scopus Indexed Journals are associated with the conference. Selected papers will be published in these journals.

Highlights
Popular among visitors for

21/02/2024

Fri, 23 Feb 2024 CII Telangana HR Conclave 19th edition The Westin Hyderabad Mindspace, Hyderabad

"Cultivating People-Centric Business Alliances through Tech and Culture"
CII Telangana is organizing the 19th Edition of the HR Conclave, a pivotal event taking place on 23 February 2024 at The Westin, Hyderabad. This conference will focus on the theme: Cultivating People-Centric Business Alliances through Tech and Culture.This theme underscores the strategic fusion of technology and organizational culture in fostering meaningful and people-centric business alliances. It highlights the importance of leveraging technological advancements while nurturing a collaborative and inclusive work environment. By intertwining these elements, businesses aim to create alliances that prioritize the well-being and growth of individuals, fostering a symbiotic relationship between technology and culture for sustainable and mutually beneficial partnerships.

Highlights
Plenary Session on Latest HR Trends
Session on Indian Ethos – Leadership & Management Lessons
Session on Leveraging HR Technology while maintaining Human Touch – Through the lens of AI & ML
Panel Discussion on ESG – HR and DEI in terms of Organization Strategy
Panel Discussion on Employee Wellbeing – Physical & Mental – Role of Employers
Popular among visitors for

21/02/2024

సర్కారీ భూమిలో “రియల్ వెంచర్”

గంట్లవెల్లిలొ గమ్మత్తు..!
సర్కారీ భూమిలో “రియల్ వెంచర్’
రూ.14 కొట్ల విలువైన భూమి “హాంఫట్”
గంట్లవెల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిన “సర్కారీ భూమి” వైనం
సర్కారీ భూమిలో “బిల్డింగ్ బ్లాక్స్ మాయ”
పథకం ప్రకారం రికార్డుల మార్పు..
“పట్టా కెక్కిన ప్రభుత్వ భూమి”
ఔను సర్కారీ భూమి పట్టాగా మారింది… కాదు కాదు పథకం ప్రకారం పట్టాగా మార్చేశారు. అధికారుల చేతివాటం, స్ధానిక నాయకుల ఆర్థిక చెలగాటం కారణంగా ప్రభుత్వ భూమి కాస్త ‘పట్టాభూమి’గా మారడంతో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి అమ్ముకున్న వైనమిది.

గైరాన్ సర్కారీ భూమిలో బతుకు దెరువు కోసం కాస్తు దారులుగా ఉంటూ కాల క్రమేణా సదరు భూమిని అధికారుల ప్రమేయంతో పట్టాగా మార్చుకుని భూ పందేరానికి తెరలేపారు.
రికార్డులు పుట్టుక పూర్వోత్తరాలు మొత్తం సర్కారీ గైరాన్ భూమిగా నమోదై ఉంది.. కానీ కాలక్రమమైనా సర్కారీ పదాన్ని పక్కకు నెట్టేసి పట్టా భూమి మీద రికార్డుకెక్కించారు.

అసలేం జరిగింది…? రంగారెడ్ది జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామంలో సర్వే నెంబరు 2లో 7-20 గుంటల గైరాన్ సర్కారీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు 1954-1955 ఖాస్త్రా, 1955-1958 సెస్సాలా ప్రకారం రెవెన్యూ రికార్డులో ఈ సర్వే నెంబర్ పూర్తిగా “గైరాన్ సర్కారీ” గా నమోదై ఉంది.

అయితే రెవెన్యూ రికార్డు 1961-62 పహనీ ప్రకారం గైరాన్ సర్కార్ భూమిలో సాగుదారుడిగా పి. భీష్మ అనే వ్యక్తి పేరు నమోదై ఉంది. ఇక అదే రికార్డు 1962 – 63 పహనీ లో సర్కారీ గైరాన్ భూమిగా చూపుతూ లావోని పట్టా ఆక్షేపణ అంటూ కాస్తూ దారుడిగా సదరు పి. భీశ్మ ను రికార్డులో నమోదు చేశారు. ఇక్కడి నుండే అసలు కథ ప్రారంభమయ్యింది.

1964 -1965 పహనీలో సర్వే నెంబరు 2 కింద భూమి స్వబావాన్ని ఇంతకాలం సర్కారీ, గైరాయిన్ గా చూపిన అధికారులు కొత్తగా పట్టా – సర్కారీగా చూపడం మొదలెట్టారు. ఇంకేముంది కాల క్రమేణా 1971- 72 పహనీలలో ఏకంగా సదరు భూమిని పూర్తిగా పట్టా భూమిగా మార్చేసి నమోదు చేశారు.

పాత ఆర్ఓఆర్ రికార్డు మాయం ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 2 భూములకు సంబంధించి 1979- 80 ఓల్డ్ ఆర్ఓఆర్ రికార్డుకూడా తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేదు. సదరు రికార్డు చినిగిపోయిందంటూ సిబ్బంది తాపీగా చెబుతున్నారు. విశ్వసినీ సమాచారం ప్రకారం ఈ రికార్డును గల్లంతు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

ప్లాట్లుగా మారిన ప్రభుత్వ భూమి అధికారుల చేతివాటం కారణంగా గైరాన్ సర్కారీ భూమికి పట్టాగా రికార్డులో నమోదు కావడంతో గంట్లవెళ్లి 2 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి స్థానంలో పట్టాదారుగా వస్తున్న వారు మరణించడంతో వారి వారసులు సదరు భూమిని విరాసత్ చేసుకున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా పట్టా భూమిగా నమోదు అయి వస్తుండటంతో ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల తెలివిగా భూములు కొనుగోలు చేసి ఏకంగా ప్లాట్లు చేసి సొమ్ము చేసుకున్నారు.

21/02/2024

Demand For Spacious Homes : విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్

Demand For Spacious Homes : ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి. నగరంలో అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 2,300 ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. గతేడాది కాలంలో 11శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు వరకు పెరిగాయి.

Demand For Spacious Homes : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు అపార్టుమెంట్స్‌ ఫ్లాట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇండిపెండెంట్‌ ఇళ్ల ధరలు పెరుగుతుండటంతో ఎంతోమంది ఫ్లాట్స్‌ వైపు మక్కువ చూపుతున్నారు. ఇండిపెండెంట్‌ ఇళ్ల కోసం సెంటర్‌ సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడని వారంతా ఫ్లాట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు.
ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం విశాలంగా ఉండే ఇళ్లు కావాలని మెజార్టీ బయ్యర్స్‌ కోరుకుంటున్నారు. ఒకప్పుడు 2బీహెచ్‌కే కోరుకున్న జనం ప్రస్తుతం ట్రి-బీహెచ్‌కే, ఫోర్‌-బీహెచ్‌కేపై ఆసక్తి చూపుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ.. డబ్బు విషయంలో కాంప్రమైజ్‌ కావడం లేదు. వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ విశాలమైన ఇళ్లలో నివసించేందుకే జనం జైకొడుతున్నారు.

11శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు :
ఇక దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ల సైజు 11శాతం పెరిగిందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2022లో సగటున 11 వందల 75 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా, 2023 నాటికి అది 13వందల ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. గత ఐదేళ్లలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 24శాతం మేర వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల సైజులు పెరిగాయి. 2022లో సగటున 13 వందల 75 చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ల విస్తీర్ణం… 2023 నాటికి సగటున 18వందల 90 ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఫ్లాట్‌ విస్తీర్ణం పెరుగుదల 37శాతంగా నమోదైంది.

దేశంలో ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే బెంగళూరులో సగటు ఫ్లాట్‌ విస్తీర్ణం 14వందల 64 ఎస్‌ఎఫ్‌టీ కాగా.. చెన్నైలో 12వందల 60, పూణేలో ఒక వెయ్యి 88 ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 2022లో 17వందల 75 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న సగటు ఫ్లాట్‌ విస్తీర్ణం… 2023లో అది 2వేల 3వందల ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. అంటే హైదరాబాద్‌లో సగటు ఎస్‌ఎఫ్‌టీ సైజ్‌ 30శాతం వృద్ధి చెందింది. దీనిబట్టి హైదరాబాద్‌లో సగటు ఇంటి పరిమాణం ఏటా భారీగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

21/02/2024

HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు.. భారీ లాభాలు!

హైదరాబాద్ అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వందలాది మంది విద్యా, ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. వారిలో కొంత మంది ఇక్కడే సెటిలవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో హైదరాబాద్ లో స్థలాలకు, అపార్ట్ మెంట్సకు ఫుల్ డిమాండ్ పెరిగిపోతోంది. ఇక హైదరాబాద్ శివార్లలో కూడా స్థలాల ధరలు పుంజుకుంటున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి పలు ప్రధాన నగరాలను కలుపుతున్న హైవేల్లో ప్రస్తుతం తక్కువ రేటుకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు అందుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏయే హైవేల్లో స్థలాల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్-బెంగళూరు హైవే:
హైదరాబాద్-బెంగళూరు హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ. 1800 పలుకుతోంది. మీరు ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తక్కువ ధరకే మంచి స్థలాన్ని దక్కించుకోవచ్చు. స్క్వేర్ ఫీట్ ధర రూ. 1800 తో 900 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. రూ. 16,20,000 అవుతుంది. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న ధర డబుల్ అయ్యిందనుకోండి.. అప్పుడు మీ స్థలం ధర రూ. 32 లక్షలకు చేరుకుంటుంది. అంటే తక్కువ కాలంలోనే రెట్టింపు లాభాలు పొందే వీలుంటుంది.

హైదరాబాద్-శ్రీశైలం హైవే:
హైదరాబాద్-శ్రీశైలం హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ.1550 గా ఉంది. మీరు ఈ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ధర రూ.1550 తో 1200 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే రూ. 18,60,000 అవుతుంది. రెండు, మూడేళ్లలో ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధిక రాబడి ఖాయమంటున్నారు నిపుణులు. కొంత కాలం తర్వాత స్క్వేర్ ఫీట్ ధర రూ. 2 వేలు పెరిగిందనుకుంటే.. అప్పుడు మీకు రూ. 24,00,000 వస్తుంది. దీంతో మీరు పెట్టిన పెట్టుబడిపై సులభంగా దాదాపు రూ. 6 లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉంది.

హైదరాబాద్-వరంగల్ హైవే:
హైదరాబాద్-వరంగల్ హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ.1400 గా ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టినట్లైతే ఫ్యూచర్ లో పెద్ద మొత్తంలో లాభాలు అందుకోవచ్చు. ఈ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1400తో 1350 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. రూ. 18,90,000 అవుతుంది. భవిష్యత్తులో పెరిగే ధరలతో భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చు.

హైదరాబాద్-జహీరాబాద్ హైవే:
హైదరాబాద్-జహీరాబాద్ హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ. 1600 వద్ద అమ్ముడవుతోంది. ఈ హైవే ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు సమకూరుతాయంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఈ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1600తో 1600 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. రూ.25,60,000 అవుతుంది. ధరలు పెరిగాయనుకోండి మీరు పెట్టిన పెట్టుబడి దాదాపు 50లక్షల వరకు చేరుకోవచ్చు. అప్పుడు మీకు కళ్లు చెదిరే లాభాలు సొంతం అవుతాయి.

హైదరాబాద్-విజయవాడ హైవే:
హైదరాబాద్-విజయవాడ హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ. 1050 పలుకుతోంది. ఈ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1050తో 2400 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. 25,20,000 అవుతుంది. ఈ ఏరియాలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెట్టింపు లాభాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

హైదరాబాద్-సాగర్ హైవే:
హైదరాబాద్-సాగర్ హైవేలో స్క్వేర్ ఫీట్ స్థలం ధర రూ. 1400గా ఉంది. స్థలాలపై పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన ప్రాంతం. ఈ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1400తో 1800 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. 25,20,000 అవుతుంది. ఈ హైవే ప్రాంతంలో కూడా మంచి ప్రాఫిట్స్ అందుకోవచ్చు.

అయితే పైన చెప్పుకున్న ఆ హైవే ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్ నడిబొడ్డున స్థలాలు కొనుగోలు చేయాలనుకుంటే మీరు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి హైవే ప్రాంతాల్లో ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు అందుకోవడం సులభమని నిపుణులు చెబుతున్నారు.

21/02/2024

PPF Account Blocked: ఈ పొరపాటు చేస్తే మీ పీపీఎఫ్ అకౌంట్ బ్లాక్!

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. మంచి వడ్డీ రేటుతో ఆదాయం హామీ ఇస్తున్న క్రమంలో ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పథకంలో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా మంచి రాబడి కోరుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్...

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. మంచి వడ్డీ రేటుతో ఆదాయం హామీ ఇస్తున్న క్రమంలో ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పథకంలో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా మంచి రాబడి కోరుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. మెచ్యూరిటీ తర్వాత 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అయితే, పీపీఎఫ్ ఖాతాదారులు కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లతో ఖాతా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఏదైనా కారణంతో పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ గా మారితే ఎలా రీయాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

21/02/2024

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

కొన్నిసార్లు మనకు వ్యక్తిగత రుణం అవసరం. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు తరువాత సమస్యలను ఎదుర్కోకూడదు. మీరు క్రెడిట్ కార్డ్ నుండి లేదా బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు విషయాలను తెలుసుకోవడం ఉత్తమం.

కొన్నిసార్లు మనకు వ్యక్తిగత రుణం అవసరం. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు తరువాత సమస్యలను ఎదుర్కోకూడదు. మీరు క్రెడిట్ కార్డ్ నుండి లేదా బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు విషయాలను తెలుసుకోవడం ఉత్తమం.

ఎంత డబ్బు కావాలి?
ఏదైనా రుణం తీసుకునే ముందు, మీకు ఎంత డబ్బు అవసరమో మీరే ప్రశ్నించుకోవాలి. మీకు చాలా తక్కువ డబ్బు అవసరమైతే, ముందుగా మీరు స్నేహితులు, బంధువుల నుండి అప్పు తీసుకోవాలి. డబ్బు అందుబాటులో లేకపోతే క్రెడిట్ కార్డు నుండి చిన్న రుణం తీసుకోవాలి. అలాంటి సమయంలో బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం మంచిది కాదు.

రుణం చెల్లించడానికి ఎంత సమయం పడుతుంది?
మీరు నెలవారీ వాయిదాలలో రుణాన్ని 30 రోజులలోపు రుణ సంస్థ లేదా బ్యాంకుకు చెల్లించాలి. చాలా మంది రుణదాతలు 6 నెలల నుండి 7 సంవత్సరాల మధ్య ఈఎంఐలు చెల్లిస్తారు. మీరు ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే, మీరు తక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. కానీ తిరిగి చెల్లించడానికి మీకు డబ్బు లేనట్లయితే మీరు కూడా రుణ డిఫాల్టర్‌గా మారవచ్చు అని గుర్తుంచుకోండి.

ఎంత వడ్డీ వసూలు చేస్తారు?
రుణం తీసుకుంటే వడ్డీ కట్టాల్సిందే. అటువంటి పరిస్థితిలో మీరు మొదట చౌక ధరలో ఎక్కడ రుణం పొందుతున్నారో తనిఖీ చేయాలి. తరచుగా ఈ రేటు రుణ కాల వ్యవధిని బట్టి పెరుగుతుంది లేదా తగ్గుతుంది. కాబట్టి రుణం తీసుకునే ముందు దీన్ని గుర్తుంచుకోండి. సరైన కాలానికి సరైన రేటుకు రుణాన్ని తీసుకోండి. తద్వారా మీరు తర్వాత వడ్డీగా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా బ్యాంకు మీకు లోన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ స్కోర్‌ని చెక్ చేస్తుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు తక్కువ రేటుకు రుణాన్ని కూడా పొందవచ్చు.

ఫీజు ఎంత?
మీరు పర్సనల్ లోన్ తీసుకోబోతున్నట్లయితే, దానిపై ఎలాంటి రుసుము వర్తిస్తుందో మీరు ముందుగానే తెలుసుకోవాలి. మీకు వడ్డీ రేటు చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ మీరు ప్రాసెసింగ్ ఫీజు, ఫైలింగ్ రుసుము, బీమా మొదలైన వాటితో సహా వివిధ ఛార్జీలు చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మీరు చూస్తున్న రుణ రేటు వాస్తవానికి ఉన్నదానికంటే చాలా ఖరీదైనది కావచ్చు.

21/02/2024

Money: రూ.50 వేల నుంచి 10లక్షల వరకు లోన్ ఇస్తారు .. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి

MUDRA Yojana: ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో రూ.10లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే ఈ మొత్తం లోన్ పొందవచ్చు.

MUDRA Yojana: భారత ప్రభుత్వం వివిధ పథకాలతో పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ సంస్థలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌ కింద కమర్షియల్ బ్యాంక్‌లు, RRBలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, MFIలు, NBFCలు సహా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా అర్హత కలిగిన వ్యక్తులకు రూ.10 లక్షల వరకు గ్యారంటీ అవసరం లేని లోన్లు మంజూరు చేస్తారు.
ప్రకటనలు

అర్హులు వీరే..
మైక్రో యూనిట్స్‌ విభిన్న నిధుల అవసరాలను తీర్చడానికి, ముద్ర మూడు ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అవి శిశు, కిషోర్, తరుణ్ లోన్లు. శిశు కేటగిరీ కింద రూ.50,000 వరకు, కిషోర్ విభాగంలో రూ.50,000- రూ.5,00,000 వరకు రుణాలు అందిస్తారు. అయితే తరుణ్ కింద అత్యధికంగా రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు లోన్‌లు అందిస్తారు. యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా శిశు కేటగిరీ యూనిట్‌లపై ఫోకస్‌ చేశారు.

50వేల నుంచి మొదలు..
ముద్ర ఫండింగ్ రెండు విభిన్న పథకాల ద్వారా అందిస్తారు. మొదటిది మైక్రో క్రెడిట్ స్కీమ్ (MCS). ఇది రూ.1 లక్ష వరకు రుణాలను అందిస్తుంది. మైక్రోఫైనాన్స్ సంస్థల (MFIs) ద్వారా సులభతరం చేస్తుంది. రెండో స్కీమ్‌ రీఫైనాన్స్ స్కీమ్. ఇది వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFCs) అందుబాటులో ఉంది. ఈ పథకం కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలకు రుణాలను అందించడానికి ఈ ఆర్థిక సంస్థలు ముద్ర నుంచి రీఫైనాన్స్ సపోర్ట్‌ పొందవచ్చు.

Credit Card: SBI క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ఇదిగో ఈవిధంగా

* ప్రధాన మంత్రి ముద్ర యోజన ఫీచర్లు
కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సింగ్
తయారీ, వ్యాపారం, సేవలు, పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలు వంటి వివిధ రంగాలలో టర్మ్ లోన్‌లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం PMMY రుణాలను అందిస్తుంది.
అనువైన వడ్డీ రేట్లు

ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి రుణ సంస్థల ద్వారా ముద్ర రుణాల వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం, రుణగ్రహీత ఓవర్‌నైట్‌ హోల్డ్‌ చేసిన ఆధారంగా వడ్డీ వసూలు చేస్తుంది.

లోన్ అమౌంట్‌
మినిమం లోన్ రిక్వైర్‌మెంట్‌ లేనప్పటికీ, PMMY కింద లభించే గరిష్ట లోన్ మొత్తం రూ.10 లక్షలు.
ప్రాసెసింగ్ ఛార్జీలు
ముద్ర రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణగ్రహీతలు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లేదా తాకట్టు అందించాల్సిన అవసరం లేదు.

సలాడ్‌లో పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుంది?మరిన్ని వార్తలు…
సెక్టార్ ఇన్‌క్లూజివిటీ
PMMY వ్యవసాయేతర రంగంలో మాత్రమే కాకుండా ఉద్యానవన, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలకు కూడా రుణాలు ఇస్తుంది.

వడ్డీ రేటు లెక్కింపు
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ముద్ర రుణాలపై వడ్డీ రేటు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు(MCLR) ఆధారంగా కాలిక్యులేట్‌ చేస్తారు.

ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించ...
21/02/2024

ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?

భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద భారీ మెుత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. వ్యవసాయేతర, కార్పొరేట్, సుక్ష్మ, చిన్న తరహా సంస్థలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎలాంటి గ్యారెంటీ లేకుండా.. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ లోన్లు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కమర్షియల్, RRBలు, MFI, NBFC లాంటి పలు ఆర్థిక సంస్థల ద్వారా అర్హులైన వ్యక్తులకు రూ. 10 లక్షల వరకూ లోన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ముద్ర 3 ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. శిశు, కిషోర్, తరుణ్ లాంటి మూడు రకాల లోన్లు ఇస్తోంది. మెుదటగా శిశు విభాగంలో రూ. 50 వేలు, కిషోర్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు అందిస్తారు. ఇక చివరిగా తరుణ్ లోన్ కింద రూ. 5లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు.

భారత ప్రభుత్వం ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి శిశు కేటగిరీ యూనిట్ లపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ పథకంలో ముద్ర లోన్లు రెండు రకాల స్కీమ్స్ ద్వారా అందిస్తారు. అందులో ఒకటి మైక్రో క్రెడిట్ స్కీమ్. ఇందులో ఒక లక్ష వరకు అందిస్తారు. రెండో దాంట్లో రీ ఫైనాన్స్ ద్వారా లోన్లు మంజూరు చేస్తారు. ఇవి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

మ్యానుఫాక్చరింగ్, పౌల్ట్రీ, డైరీ, తేనేటీగల పెంపకం, వ్యాపారం, సేవలు, వ్యవసాయం లాంటి రంగాలలో టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్స్ అవసరాల కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజనలో రుణాలు అందిస్తుంది. అయితే బయటి వడ్డీ రేట్లకంటే తక్కువగానే ఇందులో వడ్డీ రేట్లు ఉంటాయని తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఈ రుణాల కోసం అప్లై చేసేవారు ఎలాంటి ఛార్జీలు కానీ.. గ్యారెంటీ పత్రాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు.

అర్హతలు:
దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. బిజినెస్ ప్లాన్ సిద్ధంగా ఉన్న ఏ వ్యక్తి అయినా లోన్ పొందొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ట్రేడింగ్‌, సర్వీస్‌ సెక్టార్స్‌లో ఇన్‌కమ్‌-జనరేటింగ్‌ యాక్టివిటీలకు, త్రీ లోన్‌ ప్రొడక్టులలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు లోన్‌లు మంజూరు ఇస్తారు. అయితే దరఖాస్తుదారుడు గతంలో డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉండకూడదు. కనీసం 3 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉండాలి. 24 నుంచి 70 ఏళ్ల వయస్సుగలవారై ఉండాలి.

దరఖాస్తు విధానం:
పైన తెలిపిన అర్హతలు ఉన్న వారు అధికారిక వెబ్ సైట్ www.udyamimitra.in ఓపెన్ చేయాలి. అందులో అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. అక్కడ వచ్చిన వాటిల్లో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇక కొత్తగా రిజిస్టేషన్ చేస్తుంటే.. దరఖాస్తుదారుని పేరు, ఈమెయిల్ ఐడీ, మెుబైల్ నంబర్ యాడ్ చేసి.. ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న సంబంధిత బ్యాంకులను సంప్రదించవచ్చు.

Udyamimitra Home

21/02/2024

మీరు బాగా డబ్బు సంపాదించాలా? ఈ టాప్-20 పెట్టుబడి మార్గాలు గురించి తెలుసుకోండి!

Best Investment Options In India : మీరు భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? మంచి పెట్టుబడి మార్గం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో ఉన్న 20 ప్రధానమైన పెట్టుబడి మార్గాల (ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Investment Options In India : ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తమ కష్టార్జితమైన సొమ్మును నష్టపోకుండా, మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తారు. ఇలాంటి వారి కోసం మన దేశంలో అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి వీలు కల్పిస్తాయి. అయితే వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్లో మన దేశంలో అందుబాటులో ఉన్న 20 ప్రధానమైన పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) :జీవిత బీమాతోపాటు, ఆర్థిక వృద్ధిని కోరుకునే వారికి ఈయూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్మంచి ఆప్షన్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. దీనిలో కనిష్ఠంగా రూ.1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. యులిప్స్లో చేసిన పెట్టుబడులపై 10% నుంచి 24% వరకు రాబడులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో కాస్త రిస్క్ కూడా ఉంటుందనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తించుకోవాలి. యూలిప్స్ వచ్చే రాబడిపై ఇన్కం టాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

2. క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్ :తక్కువ రిస్క్తో, స్థిరమైన రాబడి రావాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్లో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై 5% నుంచి 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు.

3. పెన్షన్ ప్లాన్స్ :ఏమాత్రం నష్టభయం లేకుండా, దీర్ఘకాలంలో మంచి ఆదాయం సంపాదించాలని ఆశించేవారు ఈ పెన్షన్ ప్లాన్స్ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. పెన్షన్స్ ప్లాన్స్లో సాధారణంగా రూ.1000 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. చరిత్ర చూసుకుంటే పెన్షన్ ప్లాన్స్పై సుమారుగా 12%-22% వరకు రాబడి వస్తోంది. ఐటీ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పెన్షన్ ప్లాన్స్పై పన్ను మినహాయింపులు లభిస్తాయి.

4. చైల్డ్ ప్లాన్స్ :తమ బిడ్డల భవిష్యత్ కోసం మదుపు చేయాలని ఆశించే తల్లిదండ్రులు చైల్డ్ ప్లాన్స్ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్స్లో రిస్క్ కూడా కాస్త ఉంటుంది. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా ఈ చైల్డ్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై సుమారుగా 14% - 22% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం కింద, ఈ బాలల పథకాలపై పన్ను మినహాయింపులు పొందవచ్చు.

5. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) :ఉద్యోగ విరమణ చేసినవాళ్లు, 60 ఏళ్లు పైబడిన వారు ఈసీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ల్లో మదుపు చేయవచ్చు. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. తరువాత మరో 3 ఏళ్ల వరకు ఈ ప్లాన్ను పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు (కండిషన్స్ అప్లై) మదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్స్పై గరిష్ఠంగా 8.2% వరకు రాబడి వస్తోంది. పైగా ఆదాయ పన్ను చట్టం -1961, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

6. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) :18-70 ఏళ్ల వయస్సు ఉన్న భారతీయ పౌరులందరూ ఈనేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మార్కెట్ లింక్డ్ స్కీమ్ కనుక దీనిలో కాస్త రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాల పెట్టుబడులపై పెద్దగా రిస్క్ ఉండదు. చరిత్రను పరిశీలిస్తే, దీర్ఘకాలంలో ఈ ఎన్పీఎస్ స్కీమ్స్పై 9% - 15% వరకు రాబడి వస్తుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో టైర్-1, టైర్-2 ఆప్షన్లు ఉంటాయి.టైర్ 1 :కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేయవచ్చు.టైర్ 2 :కనిష్ఠంగా రూ.250 మదుపు చేయవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడిపెట్టిన వారికి ఐటీ యాక్ట్-1961లోని సెక్షన్ 80 సీసీడీ(1), సెక్షన్ 80 సీసీడీ (2), సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

7. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్ (POMIS) :భారతీయ పౌరులు అందరూ ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేయవచ్చు. దీనిలో రిస్క్ ఏమీ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో వ్యక్తిగతంగా రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్గా అయితే రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 7.4% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్పై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు.

8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :భారతీయ పౌరులు అందరూ ఈ దీర్ఘకాలిక పెట్టుబడి పథకంలో చేరవచ్చు. దీనిలో 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తరువాత కూడా ప్రతీ 5 ఏళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు. ఈపీపీఎఫ్పథకంలో పెట్టిన డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో ఒక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పీపీఎఫ్ పెట్టుబడులపై 7.1% వరకు గ్యారెంటీ రాబడి వస్తుంది. ఐటీ యాక్స్-1961లోని సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

9. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్ :ఈ పథకంలో కనీసం 6 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీలు ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడుల్లో ఎలాంటి రిస్క్ ఉండదు. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బాండ్స్పై 8% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ పథకం కింద వచ్చిన రాబడిపై ఐటీ చట్టం 1961 ప్రకారం, పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ ఐటీ యాక్ట్-1957 ప్రకారం, దీనికి సంపద పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
10. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ :ఎలాంటి రిస్క్ లేకుండా, గ్యారెంటీగా ఆదాయం సంపాదించాలని ఆశించేవారికి ఈఫిక్స్డ్ డిపాజిట్లుమంచి ఆప్షన్ అవుతాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్లు వరకు దీనిలో పొదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 4% నుంచి 9% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రాబడులపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

11. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) :డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాళ్లు అందరూఐపీఓలో పాల్గొనవచ్చు. కానీ దీనిలో రిస్క్- రివార్డ్ రెండూ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఐపీఓలో సంపాదించిన లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (STCG), లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (LTCG) చెల్లించాల్సి ఉంటుంది.

12. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ :షేర్ మార్కెట్ పెట్టుబడులుహెవీ రిస్క్తో కూడుకున్నవి. అయితే లాభాలు కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మీకు నచ్చినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

13. మ్యూచువల్ ఫండ్స్ :కాస్త రిస్క్ తీసుకుని మంచి రాబడులు సంపాదించాలని ఆశించేవారికిమ్యుచువల్ ఫండ్స్మంచి ఆప్షన్ అవుతాయి. చాలా మంది సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్కు నిర్దిష్ట సమయం వరకు లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే, మ్యూచువల్ ఫండ్స్పై దీర్ఘకాలంలో 8% నుంచి 20% వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్పై సంపాదించిన లాభాలపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్తో ముడిపడిన మ్యూచువల్ ఫండ్లకు ఆదాయపన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

14. బంగారంపై పెట్టుబడులు :భారతదేశంలో చాలా మంది బంగారం కొనేందుకు ఇష్టపడతారు. కష్ట సమయంలో బంగారం మనల్ని ఆదుకుంటుందని నమ్ముతారు. బంగారంపై దీర్ఘకాలంలో 8% - 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ద్వారా వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

15. రియల్ ఎస్టేట్ :భారతదేశంలో నేడు స్థిరాస్తి రంగం మంచి భూమ్లో ఉంది.రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనుక రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లీగల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అయితే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అని పెద్దలు చెబుతుంటారు. కనుక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాబడులపై గవర్నమెంట్కు కచ్చితంగా (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

16. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) :ఈ స్థిరాస్తి రంగ పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ REITsలో కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్స్పై 10% - 15% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రాబడులపై కచ్చితంగా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి.

17. క్రిప్టోకరెన్సీ :ప్రపంచంలో ఎవరైనా ఈక్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన అవగాహన లేకుండా ఈ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అయితే ఒక సంవత్సరంలో క్రిప్టోకరెన్సీపై సంపాదించిన లాభాలపై 30 శాతం వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

18. కార్పొరేట్ బాండ్స్ :కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధి కోసం బాండ్స్ జారీ చేసి, ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తూ ఉంటాయి. ఇలా బాండ్స్ తీసుకున్నవారికి ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేట్స్ ఇస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ డేట్ వచ్చిన తరువాత అసలు, వడ్డీలను ఇన్వెస్టర్లకు అందిస్తూ ఉంటాయి. అయితే దీనిలో కాస్త రిస్క్ కూడా ఉంటుంది. కనుక మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ సంస్థల బాండ్లనే ఎంచుకోవాలి.

19. గవర్నమెంట్ బాండ్స్ :ప్రభుత్వాలు సావరిన్ బాండ్స్ జారీ చేస్తుంటాయి. ఈ బాండ్స్ పూర్తి సురక్షితమైనవి. ఇన్వెస్టర్లకు దీనిపై ఫిక్స్డ్ ఇన్కం వస్తుంది. కనుక ఏమాత్రం నష్టభయం లేకుండా మంచి రాబడి సంపాదించాలని ఆశించేవారు ఈ గవర్నమెంట్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టాలి.

20. పీర్-టు-పీర్ లెండింగ్ (P2P) :భారతదేశంలో ఆర్బీఐ నియంత్రణలోనే పీర్-టు-పీర్ లెండింగ్ కొనసాగుతుంది. కనుక న్యాయబద్ధంగా, పారదర్శకంగా పీర్-టు-పీర్ లెండింగ్ జరుగుతుంది. కాబట్టి పెట్టుబడిదారుల డబ్బులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చాలా ఆన్లైన్ పీ2పీ లెండింగ్ ప్లాట్ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం సంపాదించవచ్చు.

21/02/2024

Money Rules: పర్సనల్ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ - డబ్బు అవసమైనప్పుడు ఏది మంచిది?

ఈ రెండు లోన్‌ ఆప్షన్ల మధ్య తేడాల గురించి తెలుసుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.

Bank Overdraft Vs Personal Loan: ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని అవసరాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో డబ్బు లేకపోతే అప్పు చేయాలి. ప్రస్తుతం, ప్రజలకు చాలా రకాల లోన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. వ్యక్తిగత రుణం, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.

వ్యక్తిగత రుణం, ఓవర్‌డ్రాఫ్ట్.. ఈ రెండు ఆప్షన్లు తక్షణం డబ్బును సమకూరుస్తాయి, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటాయి. కొంతమంది ప్రజలు.. పర్సనల్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ ఒకటే అని పొరపడుతున్నారు. ఇవి రెండూ వేరు. ఈ రెండింటి మధ్య కొన్ని సారూప్యతలు, అలాగే తేడాలు కూడా ఉన్నాయి.

డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా, లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లాలా అన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు లోన్‌ ఆప్షన్ల మధ్య తేడాల గురించి తెలుసుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.

పర్సనల్ లోన్ అంటే ఏంటి?
వ్యక్తిగత రుణం అనేది ఒక అసురక్షిత రుణం (Unsecured loan). అంటే, మీరు ఈ లోన్‌ తీసుకోవడానికి బ్యాంక్‌కు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ.. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్, జీతం, ఆదాయం, బ్యాంక్‌తో అనుబంధం వంటి కొన్ని అంశాల ఆధారంగా కస్టమర్ రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. వీటి ఆధారంగా, కస్టమర్‌కు ఇచ్చే లోన్‌ను, దానిపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

వ్యక్తిగత రుణం విషయంలో, రుణగ్రహీత ఒకేసారి లోన్‌ మొత్తాన్ని తీసుకుంటాడు. ఆ డబ్బును అతని ఇష్టానుసారం ఉపయోగించుకుంటాడు. వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అంటే, రుణం తిరిగి చెల్లించే వ్యవధిలో వడ్డీ రేటును పెంచడం లేదా తగ్గించడం ఉండదు. రుణాన్ని EMI రూపంలో చెల్లించాలి. ఈ EMIలో అసలు + వడ్డీ రెండూ కలిసి ఉంటాయి. ప్రారంభంలో, EMIలో వడ్డీకి ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. EMIలు చెల్లిస్తున్న కొద్దీ, క్రమంగా వడ్డీ వెయిటేజీ తగ్గి అసలు (Principal Amount) వెయిటేజీ పెరుగుతుంది. లోన్‌ టెన్యూర్‌ ముగిసేసరికి వడ్డీతో సహా బాకీ మొత్తం తీరిపోతుంది.

ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏంటి?
ఓవర్‌డ్రాఫ్ట్ అనేది ఒక రకమైన సురక్షిత రుణం (Secured loan). ఇందులో, కస్టమర్‌, తన బ్యాంక్‌ నుంచి క్రెడిట్ పరిమితిని పొందుతాడు. ఓవర్‌డ్రాఫ్ట్ క్రెడిట్ పరిమితి కస్టమర్‌కు చెందిన కరెంట్ అకౌంట్‌ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, బ్యాంకులు కరెంట్ ఖాతా బ్యాలెన్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంలో కొంత భాగానికి సమానమైన పరిమితిని అందిస్తాయి. ఆ పరిమితి ముగిసే వరకు, కస్టమర్‌, తన అవసరాన్ని బట్టి డబ్బును దపదఫాలుగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

పర్సనల్ లోన్ వర్సెస్‌ ఓవర్‌డ్రాఫ్ట్
దీర్ఘకాలికంగా డబ్బు అవసరమైతే వ్యక్తిగత రుణం ఉపయోగకరంగా ఉంటుంది. స్వల్పకాలిక అవసరాలకు ఓవర్‌డ్రాఫ్ట్ ఉత్తమ ఎంపిక. పర్సనల్ లోన్‌లో.. రుణం మంజూరైన వెంటనే, ఆ మొత్తం డబ్బుకు వడ్డీ పడుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లో.. ఉపయోగించే మొత్తానికి మాత్రమే వడ్డీని ఛార్జ్ చేస్తారు. పర్సనల్ లోన్‌లో.. వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్‌లో.. వడ్డీని రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. పర్సనల్ లోన్ రీపేమెంట్ EMI ద్వారా జరుగుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ విషయంలో, ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఎప్పుడైనా చెల్లించొచ్చు.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SRK Ventures posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share